Krishna Mukunda Murari: కృష్ణ దిమ్మతిరిగే ప్లాన్.. నెంబర్ అడిగిన మురారి.. వాళ్లలో టెన్షన్ టెన్షన్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Krishna Mukunda Murari Serial Today Episode November 22th

కృష్ణ గురించి భవానీ నిలదీత: కృష్ణ వ్యవహార శైలిలో మార్పులు రావడంతో నందూ, రేవతిపై భవానీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత వాళ్లను పిలిచి 'మొన్న‌టి వ‌ర‌కూ మురారి అమెరికా వెళుతున్నాడ‌ని తెలిసి కృష్ణ టెన్ష‌న్ ప‌డింది. మ‌రో నాలుగు రోజుల్లో మురారి అమెరికా వెళ్ల‌బోతున్నాడ‌ని అంటే.. అప్ప‌టి వ‌ర‌కూ ఎందుకు? ఇప్పుడే వెళ్ల‌మ‌ని ముకుంద‌తో చెప్పింద‌ట‌. కృష్ణ అలా ఎందుకు మాట్లాడిందో నాకు స‌మాధానం కావాలి' అని నిలదీస్తుంది. అప్పుడు నందూ 'తను ఎందుకలా మాట్లాడిందో నేను కనుక్కుంటాను' అంటుంది. దీంతో భవానీ వద్దని ఆమెకు వార్నింగ్ ఇస్తుంది.

భవానీ అలా.. మురారి మరోలా: ఆ తర్వాత భవానీ 'ప్రభాక‌ర్ కేసు హియ‌రింగ్‌కు వ‌చ్చిన‌ట్లు ఉంది. నిజాలు మురారికి తెలుస్తాయ‌నే భ‌యంతోనే కృష్ణ అలా మాట్లాడింది కావ‌చ్చు' అంటుంది. గౌత‌మ్ కూడా ఆమెకు స‌పోర్ట్ చేస్తాడు. అప్పుడు భవానీ 'కోర్టు తీర్పు వ‌స్తే ఆ క్రిమిన‌ల్స్ బండారం మొత్తం బ‌య‌ట‌ప‌డుతుంది' అంటుంది. ఇక, మురారి మాత్రం 'అమెరికా వెళ్తే కృష్ణ‌ను చూడ‌కుండా ఉండ‌టం నా వ‌ల్ల అవుతుందా? లేదా? ఆమెను క‌ల‌వ‌కుండా ఒక్క‌రోజు ఉండ‌ట‌మే క‌ష్టంగా ఉంది. అలాంటిది అమెరికాలో ట్రీట్‌మెంట్ ముగిసే వ‌ర‌కు ఉండ‌టం నావల్ల కాదు' అనుకుంటాడు.

గతం గుర్తొస్తుందని సంతోషం: మురారిని అమెరికా వెళ్లమన్న కృష్ణను నిలదీసేందుకు రేవతి, నందు వస్తారు. అప్పుడామె టిఫిన్ తింటూ ఉంటుంది. ఆ సమయంలో కృష్ణపై రేవతి కోప్పడగా.. తను మాత్రం కూల్‌గా జోక్స్ వేస్తుంది. అప్పుడు కృష్ణ 'మురారి అమెరికా వెళ్తే గ‌తం తొంద‌ర‌గా గుర్తొచ్చే ఛాన్స్ ఉంది. ఒక‌వేళ అదే జ‌రిగితే నా ప్రేమ‌కోస‌మైనా సార్ వెంట‌నే అమెరికా నుంచి తిరిగి వ‌స్తారు. గ‌తం గుర్తు రాక‌పోతేనే నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్నారు. అదే గ‌తం గుర్తొస్తే ఆగుతాడా' అని అంటుంది. అదంతా విన్న రేవతి ఎంతగానో సంతోషిస్తుంది. తర్వాత కోడలిని మెచ్చుకుంటుంది.

ముకుంద టెన్షన్ పడుతూనే: ఇక, కృష్ణ మాటలను తలుచుకుంటూ ముకుంద టెన్షన్‌ పడుతుంది. 'అమెరికా అంటే ఇన్నాళ్లు భ‌య‌ప‌డిన కృష్ణ‌.. ఇప్పుడు మురారిని త్వరగా తీసుకెళ్ల‌మ‌ని నాతో ఛాలెంజ్ ఎందుకు చేసింది? ఆ మాట ఆమె అన‌డం వెనుక ఏదో ప్లాన్ ఉంది. ఆ విష‌యం మురారిని అడిగి తెలుసుకోవాలి' అనుకుంటుంది. అదే స‌మ‌యంలో ముకుంద‌ను వెతుక్కుంటూ మురారి వ‌స్తాడు.

ఎవరైనా చెప్పారా అంటూ: మురారి వచ్చిన వెంటనే ముకుందతో 'మ‌నం అమెరికాలో ఎన్ని రోజులు ఉండాలి' అని అడుగుతాడు. అప్పుడామె 'ట్రీట్‌మెంట్‌ను బ‌ట్టి ఎన్నిరోజులైనా అమెరికాలోనే ఉండాలి. ఎన్ని రోజులైతే ఏముంది? ఎవ‌రైనా అమెరికా వెళ్ల‌ద్ద‌ని కానీ, అక్క‌డి నుంచి తొంద‌ర‌గా ర‌మ్మ‌ని కానీ చెప్పారా' అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత కృష్ణ గురించి అనుమానం వ్యక్తం చేస్తుంది.

ముకుందకు మురారి క్లాస్: ముకుంద మాటలతో మురారికి కోపం వస్తుంది. ఆ వెంటనే అతడు 'కృష్ణ‌నే నన్ను అమెరికా వెళ్ల‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది' అని బ‌దులిస్తాడు. ఆ మాట విని ముకుంద షాక్ అవుతుంది. తర్వాత 'ఇలా ఎదుటివారిపై సెటైర్స్ వేయ‌డం మానేయ్. నాకు ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్ట‌ర్‌తో భ‌వానీ పెద్ద‌మ్మ మాట్లాడిందా' అని క్లాస్ పీకుతూ అడుగుతాడు. దీంతో ముకుంద మాట్లాడ‌లేదంటే మురారి అమెరికా ఎక్క‌డ రాన‌ని అంటాడో అని కంగారు ప‌డుతుంది. అప్పుడు మాట్లాడారు అని అబద్ధం చెప్తుంది. ఈ విషయంపై మాట్లాడతానని అతడు ముకుందతో అంటాడు.

వదిలి వెళ్లాలని లేదంటూ: ముకుందతో మాట్లాడిన తర్వాత మురారి నేరుగా కృష్ణ‌ను వెతుక్కుంటూ ఔట్‌ హౌస్‌కు వ‌స్తాడు. అప్పుడామెతో అమెరికా వెళ్లాల‌ని అనిపించ‌డం లేదు అని చెబుతాడు. అంతేకాదు, 'ఈ ఇంటిని వ‌దిలి నేను ఎక్క‌డికి వెళ్ల‌ను' అనగా.. 'ఈ ఇల్లు మీ మ‌న‌సులో, ఆలోచ‌న‌ల్లో ఉంది. ఎక్క‌డికి వెళ్లినా ఇంటిని మాత్రం మ‌రువ‌లేరు. కాబట్టి సంతోషంగా వెళ్లి రండి' అని కృష్ణ సలహా ఇస్తుంది. ఆ త‌ర్వాత కృష్ణ‌ను తీసుకొని మురారి త‌న ఇంట్లోకి వ‌స్తాడు. అది చూసి భ‌వానీతో పాటు ముకుంద త‌ట్టుకోలేక‌పోతారు. కృష్ణ ఎందుకొచ్చింది అని అడుగుతారు.

డాక్టర్ నెంబర్ కావాలని: భవానీతో మురారి 'నా ట్రీట్‌మెంట్ గురించి నీతో మాట్లాడాటానికి నేను తీసుకొచ్చాను. నాకు ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్ట‌ర్‌తో కృష్ణ మాట్లాడాల్సిందే' అంటాడు. దీనికి భవానీ 'క్రిమిన‌ల్‌కు నా కొడుకుకు ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్ట‌ర్ నంబ‌ర్ ఇచ్చేది లేదు' అని మ‌న‌సులో అనుకుంటుంది. తర్వాత కృష్ణ కూడా పదే పదే అడగడంతో 'నంబ‌ర్ ఉంది కానీ ఇవ్వ‌ను. ఎవ‌రికి నంబ‌ర్ షేర్ చేయోద్ద‌ని డాక్ట‌ర్ త‌న‌తో అన్నారు' అంటుంది. అప్పుడు కృష్ణ 'నాకు తెలిసి ప‌ది రోజుల్లో ట్రీట్‌మెంట్ పూర్త‌వుతుంద‌ని వెంట‌నే వ‌చ్చేయ‌చ్చ‌ు' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X