Krishna Mukunda Murari: కృష్ణ అంటే అందుకే ఇష్టం.. తేల్చేసిన మురారి.. ప్లాన్ తెలుసుకుని షాకైన భవాని

మిగిలిన భాషల కంటె తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.

అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Krishna Mukunda Murari Serial Today Episode November 23rd 2023

మంగళవారం ఎపిసోడ్‌‌లో జరిగింది ఇదే: మంగళవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌‌లో.. మురారిని అమెరికా వెళ్లకుండా అడ్డుకుంటుంది అనుకున్న కృష్ణ.. ముందే వెళ్లమని ఎందుకు అంటుంది అని భవానీ దేవి అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ వెంటనే రేవతి, నందూను ప్రశ్నిస్తుంది. దీంతో వాళ్లు ఆమె దగ్గరకు వెళ్లి ఏమైందని అడగ్గా.. తన ప్లాన్‌ను వివరించి చెప్తుంది. దీంతో రేవతి వాళ్లు సంతోషిస్తారు. ఇక, ముకుంద వచ్చి మురారిని కృష్ణ గురించి ప్రశ్నించగా అతడు క్లాస్ పీకుతాడు. ఆ తర్వాత కృష్ణ దగ్గరకు వెళ్లగా.. వీలైనంత త్వరగా అమెరికా వెళ్లిపోమని అందరి ముందే అనడంతో షాక్ అవుతారు.

ప్రేమతో మురారిని పడేసిన కృష్ణ: భవానీ దేవి ముందే మురారిని అమెరికా వెళ్లడానికి కృష్ణ ఒప్పిస్తుంది. ఆ తర్వాత ఆమె తన ఔట్ హౌస్‌కు వెళ్లిపోయి వంట చేసుకుంటూ ఉంటుంది. అంతలోనే మురారి అక్కడకు వస్తాడు. ఆమె ఎగ్ కర్రీ వండడం చూసి తనకు ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. అది విని షాకైన కృష్ణ 'గతంలో కూడా మీరు ఎగ్ ఫ్రై కర్రీని బాగా తినేవారు' అని మురారికి చెబుతుంది. అనంతరం ఆమె మురారికి ఇంకా ఏమేమి ఇష్టమో చెప్పమని అడుగుతుంది. కానీ, అతడు మాత్రం తనకు అదొక్కటే గుర్తు ఉందని చెబుతాడు. తర్వాత ఆమెకు హెల్ప్ చేస్తాననగా.. వద్దని అంటుంది.

మురారి చేతికి గాయం అయింది: మురారి చూస్తూ ఉండగా కృష్ణ ఎగ్ కర్రీని వండుతుంది. అప్పుడతను 'కృష్ణ‌ను చూస్తుంటే నా మ‌నిషే అనిపిస్తుంది. కృష్ణ కూడా అలా భావించే నాతో చ‌నువుగా ఉంటుందా' అని మనసులో అనుకుంటాడు. అంతలోనే క‌ర్రీ చేస్తోండ‌గా వేడి నూనె కృష్ణ ముఖంపై ప‌డ‌బోతుండ‌గా మురారి త‌న చేయి అడ్డం పెడ‌తాడు. దీంతో అతడికి గాయం అవుతుంది. అప్పుడు కృష్ణ కంగారు ప‌డుతుంది. అంతేకాదు 'నా మీద నూనె ప‌డుతుంద‌నే మీరు చేతులు అడ్డం పెట్టారు క‌దా. నేనంటే మీకు ఎందుకు అంత అభిమానం' అని అతడిని సూటిగా ప్రశ్నిస్తుంది.

స్వయంగా తినిపించేసిన కృష్ణ: కృష్ణ అడిగిన ప్రశ్నకు మురారి తెలియ‌ద‌ని బ‌దులిస్తాడు. ఆ త‌ర్వాత త‌న‌కు ఆక‌లిగా ఉంద‌ని కృష్ణ‌కు చెబుతాడు. కానీ, మురారి చేతులు కాల‌డంతో అత‌డికి తానే స్వ‌యంగా అన్నం తినిపిస్తుంది. ఆమె ప్రేమ చూసి మురారి ఫ్లాట్ అయిపోతాడు. అన్నం తినిపించే స‌మ‌యంలో కృష్ణ క‌ళ్ల‌ల్లోకి చూస్తూ అలాగే ఉండిపోతాడు. అలా వాళ్లు అన్నం తింటూ ఉండగా.. మురారి కనిపించడం లేదని రేవతి కంగారు పడుతుంది. దీంతో మధుకర్.. కృష్ణ అన్నం తినిపించే విషయం చెప్తాడు. దీంతో రేవతి ఎంతగానో సంతోషిస్తుంది.

కృష్ణ ధ్యాస త‌ప్ప మ‌రొక‌టి లేదా: అన్నం తినేసిన తర్వాత 'డాక్టర్ నెంబర్ అడిగినా భవానీ పెద్దమ్మ కృష్ణకు ఎందుకు ఇవ్వలేదు' అని ఆలోచిస్తుంటాడు. అంతలోనే అక్కడకు ముకుంద వస్తే ఇదే ప్రశ్న అడుగుతాడు. అలాగే, తరచూ కృష్ణ గురించే మాట్లాడుతుంటాడు. అది తట్టుకోలేకపోయిన ముకుంద 'కృష్ణ ధ్యాస త‌ప్ప నీకు మ‌రొక‌టి లేదా? వాళ్లు ఎలాంటి క్రిమిన‌ల్స్ అన్న‌ది పెద్ద‌మ్మ చెప్పిన కూడా న‌మ్మ‌వా? మా మాట‌ల‌కు విలువ, గౌర‌వం లేదా' అని సీరియస్ అవుతుంది. దీంతో మురారి 'మీకు నా మీద జాలి త‌ప్ప మ‌రేం లేద‌ని అనిపిస్తుంది. మీరు న‌న్ను మాన‌సిక రోగిలా చూస్తున్నారు' అంటాడు.

కృష్ణ అంటే అందుకే ఇష్టం అని: ఆ తర్వాత మురారి 'న‌న్ను మ‌నిషిగా, స్నేహితుడిగా కృష్ణ చూస్తుంది కాబ‌ట్టే అభిమానం ఏర్ప‌డింది. ఏ స్వార్థంతో కృష్ణ నాకు యాక్సిడెంట్ చేసిందో చెప్ప‌మ‌ని అంటే ఎవ‌రూ ఎందుకు చెప్ప‌డం లేదు' అని ఎదురు ప్రశ్నిస్తాడు. మురారికి అనుమానం రావ‌డంతో ముకుంద వెంటనే ప్లాన్ మార్చేస్తుంది. ఆ వెంటనే 'ఎంక్వైరీలు చేయ‌డం మాకు తెలియ‌దా? మాకు చేత‌కాదా? మ‌నం పెంచిన మొక్క‌ను తుంచ‌డం ఇష్టం లేక ఆగిపోయాం. మరి కృష్ణ మ‌న ఇంటికి రావ‌డానికి ఎందుకు టెన్ష‌న్ ప‌డుతుంది. నువ్వు రమ్మన్నా ఎందుకు రావట్లేదు' అని డౌట్ పెంచుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode November 23rd 2023

ప్లాన్ విని షాకైపోయిన భవానీ: కృష్ణ, నందూ మాట్లాడుతుండగా భవానీ చాటుగా వింటుంది. అప్పుడు కృష్ణ 'మురారి అమెరికా వెళితే గ‌తం గుర్తొస్తుంది. అప్పుడు ప‌రిగెత్తుకుంటూ నాకోసం వ‌స్తారు' అని ప్లాన్ చెప్తుంది. అది భ‌వానీ షాక్ అవుతుంది. అప్పుడు నందూ 'నిన్ను దూరం పెట్టినందుకు మా వాళ్ల‌పై కోపం లేదా' అని అడగ్గా.. 'మ‌న‌సు గాయ ప‌రిచిన‌ వాళ్ల‌ను ద్వేషించ‌డం స‌హ‌జం. కానీ ప్రేమిస్తే వాళ్లు నా మ‌నుషుల్లా క‌నిపిస్తారు. ఇక నేను ఎందుకు బాధ‌ప‌డాలి. ముకుంద గురించే నా బాధ మొత్తం. జ‌ర‌గ‌ని వాటికోసం, అంద‌ని వాటి కోసం ఆరాటపడుతుంది' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X