Krishna Mukunda Murari: కృష్ణకు బిగ్ షాక్.. మురారి అమెరికా ప్రయాణం క్యాన్సిల్.. చిచ్చు పెట్టిన భవానీ
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. ఆకలితో వచ్చిన మురారికి ఇష్టమైన ఎగ్ కర్రీని వండుతానని కృష్ణ అంటుంది. అప్పుడు వేడి నూనె ఆమెపై పడబోతుండగా అతడు చేయి అడ్డు పెడతాడు. దీంతో మురారి చేయి కాలుతుంది. అప్పుడే కృష్ణే అతడికి అన్నం తినిపిస్తుంది. ఆ తర్వాత మురారిని ముకుంద ఎప్పుడూ కృష్ణ గురించే ఎందుకు ఆలోచిస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. అంతేకాదు, ఆమెపై లేనిపోనివి అన్నీ చెప్తుంది. అనంతరం కృష్ణ తన ప్లాన్‌ను రేవతి వాళ్లకు వివరిస్తుంది. అదంతా భవానీ దేవి పక్కనే ఉండి చాటుగా వినేస్తుంది.

మాయ మాటలతో నమ్మించింది:ఎంత చెప్పినా వినకుండా కృష్ణ చుట్టూనే మురారి తిరుగుతుండడం చూసి ముకుంద తట్టుకోలేకపోతుంది. దీంతో ఎలాగైనా వాళ్లిద్దరి మధ్య దూరం పెంచాలని ఫిక్స్ అవుతుంది. ఇందులో భాగంగానే కృష్ణపై మురారికి ధ్వేషం కలిగేలా మాయ మాటలు చెబుతుంది. ఇదే ప్లాన్‌ను భవానీ ముందు కూడా అమలు చేస్తుంది. దీంతో భవానీ కూడా వాళ్లిద్దరిని శాశ్వతంగా దూరం చేయాలని అనుకుంటుంది. అంతేకాదు, అసలు మురారిని అమెరికా పంపడానికి కృష్ణ తాపత్రేయపడుతుందో తెలుసుకోవాలని అనుకుంటుంది.
అమెరికా పంపకూడదని డిసైడ్:అసలు కృష్ణ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని డిసైడ్ అయిన భవానీ ఔట్ హౌస్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే కృష్ణ 'మురారి అమెరికా వెళితే అతడికి వెంటనే గతం గుర్తొస్తుంది. అప్పుడే సార్‌కు నేనెవరో తెలిసే అవకాశం ఉంటుంది' అని నందుతో అంటుంది. ఆ మాటలు విని భవానీ షాక్ అవుతుంది. ఆ వెంటనే కృష్ణ ప్లాన్‌ను అడ్డుకోవాలని అనుకుంటుంది. ఇందుకోసం ట్రీట్‌మెంట్ కోసం మురారిని అమెరికా పంపించాలనే తన నిర్ణయాన్ని మార్చుకొని కృష్ణకు షాకివ్వాలని కొత్త ఎత్తు వేస్తుంది.
జైలుకు కృష్ణ.. మురారిని వద్దని:జైలులో ఉన్న బాబాయి ప్రభాకర్‌తో మాట్లాడడం కోసం కృష్ణ బయలుదేరుతుంది. అది చూసిన మురారి ఆమెతో పాటు వస్తానని అంటాడు. కానీ, చిన్నాన్న గురించి తెలిస్తే ఏవైనా సమస్యలు వస్తాయని భావించిన కృష్ణ.. మనసులో భయపడుతూ ఉంటుంది. దీంతో మురారిని తనతో రాకుండా చేయాలని అనుకుంటుంది. కానీ, అతడు మాత్రం వస్తానని పట్టుబడతాడు. ఇదంతా గమనించిన భవానీ దేవి.. కృష్ణపై మురారికి ఎలాగైనా అనుమానం కలిగేలా చేయాలని ప్లాన్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











