Krishna Mukunda Murari: కృష్ణ ప్లాన్ వర్కౌట్.. ముకుంద, మురారి జంటగా.. భవానీ ఊహించని నిర్ణయం
జనరేషన్లు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
బుధవారం ఎపిసోడ్‌లో ఏమైంది?:కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. ముకుందతో మురారికి పెళ్లి చేయాలని ఈశ్వర్ డిసైడ్ అవుతాడు. ఈ విషయాన్ని భవానీ దేవికి చెప్పగా.. ఆమె ఆలోచనలో పడుతుంది. కృష్ణ చేతిలో ఓడిపోయానని బాధపడుతున్న ముకుందకు మురారి మాటలు సంతోషాన్ని ఇస్తాయి. అనంతరం కృష్ణ తన పేరును మార్చుకుని మురారికి వేరేది చెప్తుంది. ఇక, కృష్ణ ఆలోచనలోనే ఉన్న మురారి.. ఆమె దగ్గరకు వెళ్లాలని కింద పడబోతాడు. విషయం తెలుసుకున్న భవానీ మాత్రం కృష్ణను పంపించేస్తానని వార్నింగ్‌ను ఇస్తుంది.

ముకుందపై మురారి వాంతు:కృష్ణుడి బొమ్మను చూసి మురారికి గతం గుర్తుకు వస్తుంది. కానీ, తనకు ఆ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు అన్నది మాత్రం ఎంత ప్రయత్నించినా గుర్తు రాదు. దీంతో తల తిరుగుతున్నట్లు అవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. అతడిని అలా చూసిన రేవతి, భవనీ బాగా భయపడిపోతారు. అప్పుడే మురారి.. ముకుంద చేతి మీదనే వాంతు చేసుకుంటాడు. ఆ వెంటనే ఆమెకు సారీ చెప్తాడు. దీంతో ముకుంద 'మన మధ్య సారీలు ఏంటి? ఇలా ఇంకోసారి మాట్లాడితే బాగుండదు' అంటుంది. దీంతో మురారి ఆమెకు ఫ్లాట్ అయినట్లు నవ్వుతాడు. అప్పుడు ముకుంద సంతోషిస్తుంది.
నేను నిన్ను వదిలి పెట్టనని:అంతా సర్ధుకున్న తర్వాత మురారి తనకు ఒక అమ్మాయి గుర్తుకు వస్తుందని, తను ఎవరో తెలియక ఇబ్బంది అవుతుందని చెప్తాడు. దీనికి ముకుంద 'నువ్వు ఒంటరిగా ఉండకు. ఏది ఆలోచించకు. అసలు నేను నిన్ను ఒంటరిగా ఉండనివ్వను' అని అంటుంది. అప్పుడు భవానీ దగ్గరగా ఉండి మురారిని బాగా చూసుకో అని సపోర్ట్ చేస్తుంది. ముకుంద.. మురారికి దగ్గర అవుతుండడంతో కృష్ణ జీవితం నాశనం అవుతుంది అనుకుంటూ రేవతి కంగారు పడుతూ.. తాను ఏం చేయలేనా అని ఆలోచిస్తుంది. అంతేకాదు, ఎలాగైనా వాళ్లను కలపాలని అనుకుంటుంది.

అతడిపై ఆశలు వదులుకో:భవానీ అన్న మాటలకు గుర్తు చేసుకుని కృష్ణ బాధపడుతూ ఉంటుంది. అంతలోనే అక్కడకు మధుకర్ వస్తాడు. అప్పుడు కృష్ణ 'ఓదార్చడానికి వచ్చావా? నీ జీవితంలో ఏబీసీడీల అబ్బాయి లేడు. అతడిపై ఆశలు వదులుకో. ఒంటరిగానే బతుకు అని చెప్పడానికి వచ్చావా' అంటూ వరుస ప్రశ్నలు వేస్తుంది. దీనికతడు 'అవును కృష్ణ అదే చెప్పడానికి వచ్చాను. నిన్ను మురారి నుంచి దూరం చేయడానికి ముకుంద చేస్తోన్న ప్రయత్నాలు చూస్తుంటే నీపై జాలి వేస్తుంది. నువ్వు ఏమైపోతావో అని భయమేస్తుంది' అని ఎమోషనల్ అవుతాడు.
కృష్ణ ధైర్యానికి ముచ్చటగా:ఆ తర్వాత మధుకర్ ఇంట్లో జరుగుతున్న చర్చలు, ముకుంద వేస్తున్న ప్లాన్ల గురించి కృష్ణకు చెప్తాడు. కానీ, ఆమె మాత్రం వాటిని లైట్ తీసుకుంటుంది. అంతేకాదు, 'ప్రేమ అన్నది చేతుల్లో, చేతల్లో పుట్టదు. గుండెల్లో పుడుతుంది. మురారి, ముకుందలను భవానీ కలపాలని అనుకున్నా ఆయన మాత్రం అందుకు ఒప్పుకోడు. ముకుందను పెళ్లిచేకోడు. ముకుందను ఫ్రెండ్ గానే భావిస్తున్నాడు. ఒకవేళ నిజంగానే మురారి, ముకుందలకు భవానీ పెళ్లి చేయాలని అనుకుంటే గతం మర్చిపోయిన మురారికి ముకుందనే తన భార్య అంటూ పరిచయం చేసేది' అంటుంది.

ముకుంద అలా.. రేవతి ఇలా:కృష్ణ ఎంతో ధైర్యంగా మాట్లాడడంతో మధుకర్ సంతోషంగా వెళ్లిపోతాడు. అతడికి ముకుంద కలిసి వెటకారం ఆడగా.. ఆమెకు పంచ్‌లు వేస్తాడు. ఇక, ఇంట్లో ఒంటరిగా ఉన్న కృష్ణ దగ్గరకు రేవతి వస్తుంది. అప్పుడు కృష్ణ భయపడుతూ 'నేను మిమ్మల్ని అమ్మగా భావించాను' అంటుంది. దీనికి రేవతి 'ఏ ఆడపిల్ల అయినా పెళ్లైన తర్వాత కష్టం వస్తే అమ్మతోనే చెబుతారు. మరి మీ అమ్మ నీకు గుర్తు రాలేదా' అని ప్రశ్నించగా.. ప్రభాకర్ అడ్డుకున్న విషయం చెప్తుంది. తర్వాత నేను మోసం చేశాననుకుంటున్నారా అని అత్తను అడగ్గా.. అలా అయితే రాను కదా అంటుంది.
మురారిని యూఎస్ పంపి:కృష్ణతో రేవతి సంతోషంగా మాట్లాడడం చూసిన భవానీ కుళ్లుకుంటూ ఉంటుంది. ఆ వెంటనే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, మురారిని ట్రీట్‌మెంట్ కోసం అమెరికాకు పంపించాలనుకుంటున్నట్లు రేవతితో చెబుతుంది. దీనికామె 'మురారి బాగుపడతాడు, గతం గుర్తొస్తుంది అంటే సంతోషించేవారిలో నేనే ముందుంటాను. కానీ, మురారిని అంతదూరం ఒక్కడినే ఎలా పంపిస్తారు' అని అడుగుతుంది. దీనికి భవానీ 'ఒక్కడినే కాదు మురారికి తోడుగా ముకుందను పంపించాలని అనుకుంటున్నా' అని చెప్తుంది. దీంతో రేవతి వాళ్లు షాక్ అవుతారు.
బిర్యానీతో పడేసిన కృష్ణ:కృష్ణ స్పెషల్‌గా బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. ఆ వాసన చూసి కృష్ణ దగ్గరకు వెళ్లడానికి మురారి రెడీ అవుతాడు. అప్పుడు భవానీ 'మురారిని అడ్డుకుంటే అతడు ఎలా రియాక్ట్ అవుతాడో' అనుకుంటుంది. దీంతో చేసేదేం లేక మురారి వెంట భవానీ, రేవతితో పాటు మిగిలిన వాళ్లూ వెళ్తారు. అప్పుడు రేవతి 'దెబ్బకు అందరిని తన దగ్గరకు వచ్చేలా చేసింది. నా కోడలా మజాకా' అనుకుంటుంది. అనంతరం అందరికీ బిర్యానీ వడ్డించడంతో తింటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











