Krishna Mukunda Murari: గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్.. ముకుందపై మురారి ఫైర్.. ఆ వ్యక్తి రాకతో టెన్షన్

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

శుక్రవారం ఎపిసోడ్‌లో ఏమైంది?: కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. కృష్ణ చేసిన బిర్యానీ తినడానికి మురారి వాళ్లు అందరూ ఔట్ హౌస్‌కు వెళ్తారు. అక్కడ అందరూ తిన్న తర్వాత కృష్ణ ఓ గేమ్ చెప్తుంది. అప్పుడు మురారి ఆమెనే చూస్తూ ఉంటాడు. అది గమనించిన భవానీ దేవి అతడిని అమెరికాకు పంపే విషయాన్ని చెప్తుంది. దీంతో ఇక్కడ డాక్టర్ ఉండగా అక్కడికెందుకు పంపిస్తున్నారని మురారికి డౌట్ వస్తుంది. తర్వాత కృష్ణకు జ్వరం వస్తుంది. అది తెలుసుకున్న మురారి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తానని అనగా భవానీ దేవి అడ్డుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Today Episode November 4th 2023

రేవతి టెన్షన్... నిజం చెప్పి: కృష్ణకు జ్వరం రావడంతో మురారి, ముకుంద కలిసి ఆస్పత్రికి తీసుకు వెళ్లిన విషయం తెలిసి రేవతి భయపడుతూ ఉంటుంది. ముకుంద ఏమైనా చెప్పి మురారికి కృష్ణను దూరం చేస్తుందేమో అని టెన్షన్ పడుతుంది. అప్పుడు మధుకర్ 'ముకుంద ఏమీ చేయలేదు. ఎందుకంటే కృష్ణను మురారి ఇష్టపడుతున్నాడు. దీంతో తన గురించి ఏం చెప్పినా వినే పరిస్థితి లేదు. అది ముకుందకు కూడా బాగా తెలుసు. అలా చెప్పినా తన పని పులిహోరే అవుతుంది. కాబట్టి హ్యాపీగా ఉండు' అంటాడు.

కృష్ణను ఎత్తుకున్న మురారి: కృష్ణను ఆమె పని చేస్తున్న ఆస్పత్రికే మురారి తీసుకు వస్తాడు. దీంతో ముకుంద 'నీకు ఈ ఆస్పత్రి ఎలా తెలుసు' అని ప్రశ్నిస్తుంది. దీనికి మురారి 'నేను గతం మర్చిపోయాక నాకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన హాస్పిటల్ ఇదే' అంటాడు. తర్వాత కృష్ణను ఎంత లేపినా లేవకపోవడంతో 'మురారి ఎత్తుకుని తీసుకెళ్తాడా? మురారికి గతం గుర్తుకు వస్తే నా పరిస్థితి ఏంటీ. కృష్ణను అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా ప్రేమించేలా ఉన్నాడు' అని ముకుంద టెన్షన్పడుతుంటుంది. ఇంతలోనే మురారి.. కృష్ణను ఎత్తుకుని హాస్పిటల్‌ లోపలికి తీసుకెళ్తాడు.

ముకుంద కంగారు పడుతూ: కృష్ణను ఆస్పత్రికి తీసుకెళ్లగానే నర్స్ అక్కడి డాక్టర్ పరిమిళను పిలుస్తుంది. అప్పుడు ముకుంద 'ఇప్పుడు మురారికి ఈమె నిజం చెబుతుందా? చెప్పకుండా చూడాలి' కంగారు పడిపోతూ ఉంటుంది. కృష్ణకు చెక్ చేసిన తర్వాత డాక్టర్ 'మురారికి గతం గురించి చెప్పలేదా? బ్రెయిన్ డ్యామెజ్ అవుతుందని చెప్పారా' అని ముకుందను అడుగుతుంది. దీనికామె 'అవును డాక్టర్.. మీరు ఎక్కడా ఏం చెబుతారో అని కంగారు పడ్డాను' అని బదులిస్తుంది.

గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్: కృష్ణకు ట్రీట్‌మెంట్ జరుగుతోన్న సమయంలో మురారి 'ఈ హాస్పిటల్‌ను చూసినా.. ఈ డాక్టర్‌ను బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది ఏంటీ. వేణికి ట్రీట్‌మెంట్ అయిన తర్వాత మీరు నాకు పరిచయమా అని డాక్టర్‌ని అడగాలి' అని అనుకుంటాడు. తర్వాత కృష్ణ లేచి సార్ ఎక్కడ అని అడుగుతుంది. దానికి డాక్టర్ 'ఇప్పుడు సార్ గురించి ఎందుకు? మెడిసిన్ తీసుకురావడానికి వెళ్లాడు. నిన్ను ఎత్తుకుని సార్ తీసుకొచ్చాడు. బంధం అంటే ఇది. నువ్వు చెప్పకున్నా.. నీ ఎదురుగా ఉంటే గతం గుర్తుకు వస్తుంది' అని చెబుతుంది. దీంతో కృష్ణ సంతోషిస్తుంది. తర్వాత కృష్ణ గురించి మురారికి డాక్టర్ చెప్తుంది. అప్పుడు ఆమెను ఎక్కడో చూసినట్లు ఉందని అడుగుతాడు. ఆమె ఇంజెక్షన్ అప్పుడు చూశారు అంటుంది.

రెస్టారెంట్‌ గుర్తుకొచ్చింది: ఇంటికి వెళ్తుండగా దారిలో రెస్టారెంట్ దగ్గర కారు ఆపి ఇది నాకు తెలిసినట్లు అనిపిస్తుంది అని మురారి అంటాడు. దీంతో కృష్ణ 'సార్ ట్రాక్‌లోకి వస్తున్నారు. ఇలా అయితే అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదు' అనుకుంటుంది. తర్వాత ముగ్గురూ లోపలికి వెళ్తారు. అప్పుడు ముకుంద చాలా టెన్షన్ పడుతుంది. రెస్టారెంట్‌లో ముగ్గురు కూర్చుని ఆర్డర్ ఇస్తారు. మురారికి గతం గుర్తుకు వస్తూ కంగారుపడిపోతుంటాడు. గతాన్ని తలుచుకుని కోపంగా పక్కన ఉన్న వస్తువులు విసిరికొడతాడు. తర్వాత కృష్ణ వాళ్లు మురారిని కూల్ చేసి కూర్చోపెడతారు.

ముకుందపై మురారి ఫైర్: మురారి టెన్షన్ పడుతుండగా ముకుంద 'ఇందుకే వద్దన్నా వెళ్దాం పదండి' అనగా.. 'స్టాప్ ఇట్ ముకుంద. ఎప్పుడూ చూడు వెళ్దాం వెళ్దాం అంటావు ఎందుకు' అని మురారి ఫైర్ అవుతాడు. దీంతో కృష్ణ కూల్ అవ్వండి సార్. ముందు ప్రశాంతంగా ఉండండి అని నచ్చజెబుతుంది. తర్వాత ముకుందకు సారీ చెబుతాడు. అంతేకాదు, ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోండి. ఇంట్లో తెలిస్తే బాధపడతారని మురారి అంటాడు. ఇంతలో టిఫిన్ వస్తుంది. అప్పుడు మురారి 'నా బాధ పగవాడికి కూడా రాకూడదు. ఇక్కడే కూర్చున్నాను' అని అంటాడు.

మరో వ్యక్తి రావడంతో షాక్: కృష్ణ, ముకుంద, మురారి రెస్టారెంట్‌లో ఉండగా.. గతంలో వీళ్ల ముగ్గురితో పరిచయం ఉన్న వ్యక్తి చూస్తాడు. ఇందులో సార్ భార్య ఎవరనేది పందెం వేసుకున్నది అతడికి గుర్తుకు వస్తుంది. హా నాకు లక్ష రూపాయలు గెలిపించిన అక్క దేవత. మరి అతనెవరు అని ఆ వ్యక్తి ఆలోచిస్తుంటాడు. అతడిని ముకుంద చూసి టెన్షన్ పడిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X