Krishna Mukunda Murari: భవానీని ప్రశ్నించిన మురారి.. అదిరిపోయే ప్లాన్ వేసిన కృష్ణ.. సూపర్ ట్విస్టు
ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
శనివారం ఎపిసోడ్‌లో ఏమైంది?: కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. కృష్ణకు జ్వరం రావడంతో మురారి తనను ఆస్పత్రికి తీసుకు వెళ్తాడు. ఇది భవానీకి తెలుస్తుందేమో అని రేవతి టెన్షన్ పడుతుంది. అనుకున్నట్లుగానే ఆమెకు విషయం తెలుస్తుంది. దీంతో మురారిని యూఎస్ పంపాలనుకున్న విషయం చెప్తుంది. తర్వాత కృష్ణ గురించి నిజాలు దాచడంతో అతడికి డౌట్లు వస్తుంటాయి. ఆస్పత్రిలోనూ మురారికి డాక్టర్ గతం గుర్తొస్తుంది. ఇంటికి వస్తున్న సమయంలో ఓ రెస్టారెంట్ దగ్గర ఆగగా.. అతడికి కొన్ని విషయాలు గుర్తొస్తాయి. అప్పుడే ఓ వ్యక్తి వస్తాడు.

అబద్దాలతో మురారికి డౌట్: రెస్టారెంట్‌లోని ఓ వ్యక్తి మురారిని గుర్తు పట్టడు కానీ ముకుంద, కృష్ణను అలాగే చూస్తుంటాడు. అది చూసిన ముకుంద అతడు వస్తే మురారికి గతం గుర్తొస్తుంది అని భయపడుతుంది. అప్పుడతడు వాళ్ల దగ్గరకు వచ్చి మురారిని చూపించి ఆయన ఎవరు అని అడుగుతాడు. కృష్ణ నిజం చెప్తుందేమో అని ముకుంద ముందే అబద్దాలు చెబుతుంది. అలాగే, అతడిని పంపేస్తుంది. ముకుంద టెన్షన్ గమనించిన మురారికి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఏదేదో గుర్తుకు వచ్చి అతడు ఇబ్బంది పడతాడు.
స్వీట్‌తో గుర్తు చేసిన కృష్ణ: ముకుంద తీరుతో మురారికి అనుమానం అంతకంతకూ పెరుగుతుంది. అప్పుడు అతడికి గతానికి సంబంధించిన విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పుడు మురారి 'నా జీవితంలో అసలు ఏం జరిగింది అనేది త్వరలోనే తెలుసుకుంటాను' అంటాడు. దీంతో ముకుందా చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు కృష్ణ.. మురారికి ఇష్టం అయిన కపుల్ స్వీట్‌నే ఆర్డర్ చేస్తుంది. అది చూసిన తర్వాత అతడు ఆలోచనలో పడిపోతాడు.
భవానీ దేవకి రేవతి రిక్వెస్ట్: మురారిని ట్రీట్‌మెంట్ కోసం అమెరికా పంపేందుకు భవానీ ఏర్పాట్లు చేస్తుంటుంది. అప్పుడు రేవతి తనలో తాను టెన్షన్ పడుతుంది. ఎలాగైనా ఈ ప్లాన్ చెడగొట్టాలని అనుకుంటుంది. అందుకోసం భవానీతో మురారిని యూఎస్ పంపొద్దని అంటుంది. దీనికామె 'నీ కోడలు గుర్తొస్తుందనే వద్దంటున్నావా' అంటుంది. అప్పుడు రేవతి 'కృష్ణను దూరం చేసేందుకు నువ్వు వేసే ప్రతి అడుగుతో వాళ్లిద్దరూ తిరిగి ఒక్కటవుతారనే ఆశ పూర్తిగా పోయింది' అంటుంది. దీంతో భవానీ 'కృష్ణ వల్లే ఇంట్లో సంతోషం మొత్తం దూరమైంది. మురారి లైఫ్ నాశనమైంది' అంటుంది.
రేవతిని ఒప్పించిన భవానీ: రేవతి మాటలకు భవానీ 'మురారి, ముకుందలను ఒక్కటి చేయడానికే అమెరికా పంపిస్తున్నా' అని సూటిగానే చెప్పేస్తుంది. దీనికి రేవతి 'అలా చేస్తే కృష్ణకు అన్యాయం చేసిన వాళ్లం అవుతాము' అంటుంది. దీంతో భవానీ దేవి 'అగ్రిమెంట్ మ్యారేజీ గడువు ముగిసింది కాబట్టి మనం చేసేది ఏం ఉండదు. ఏం చేయలన్నది కృష్ణకే బాగా తెలుసు' అని వివరిస్తుంది.
కృష్ణను ఎందుకు ఆపారు?: ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన కృష్ణను జ్వరం నుంచి కోలుకునే వరకు తమ ఇంట్లోనే ఉండమని మురారి రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ముకుంద.. కృష్ణను ఇంట్లోకి రాకుండా భవానీ ద్వారా అడ్డుకోవాలని అనుకుంటుంది. కానీ, భవానీ, రేవతిల మధ్య జరుగుతోన్న వాదనను ముకుంద వింటుంది. ఆ మాటల్ని మురారి వింటే ప్రమాదమని గ్రహించి అతడిని ఇంట్లోకి రాకుండా ఔట్ హౌస్‌కు తీసుకెళ్తుంది. కృష్ణను ఇంట్లోకి రాకుండా ముకుంద, భవానీ ఎందుకు అడ్డుకుంటున్నారో మురారికి సందేహం వస్తుంది. ఇదే విషయాన్ని వాళ్ల ముందే భవానీని అడుగుతాడు.
వాళ్లకు క్లాస్ పీకిన భవాని: మురారి ప్రశ్నకు భవానీ దేవి అబద్ధాలు చెప్తుంది. తర్వాత మురారిని పంపించి కృష్ణకు క్లాస్ పీకుతుంది. అంతేకాదు 'మురారిని అమెరికా వెళ్లకుండా అడ్డుకుంటే ఔట్ హౌస్‌లో కూడా ఉండకుండా చేస్తా. నీ దారి నువ్వుచూసుకో. మా దారికి అడ్డురాకు' అంటుంది. అప్పుడే కృష్ణను చూసేందుకు రేవతి కూడా అక్కడకు వస్తుంది. కానీ, అక్కడే ఉన్న భవానీ ఆమెపై కోప్పడుతుంది. అప్పుడు కృష్ణ 'మురారి అమెరికా ప్రయాణం ఎలాగైనా ఆపాలి. మురారి నోటితోనే అమెరికా వెళ్లనని చెప్పించాలి' అనుకుంటూ ఉండగా ముకుంద వచ్చి కృష్ణతో వెటకారం ఆడుతుంది.
కృష్ణ రివర్స్ ఎటాక్ చేస్తూ: కృష్ణతో ముకుంద 'ఫస్ట్ టైమ్ నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఏదో చేద్దామని అనుకున్నావు. కానీ నీ టైమ్ బ్యాడ్ వల్ల వేసిన ప్లాన్స్ ఒక్కటి కూడా వర్కువుట్ కావడం లేదు. నేను మురారి ప్రేమికులం అని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది కాబట్టి మమ్మల్ని కలిపి.. నీ దారి నువ్వు చూసుకో' అంటుంది. అప్పుడు కృష్ణ 'నీ జీవితానికి అర్థం, పరమార్థం ఆదర్శ్‌తోనే. అతడిని తిరిగి తప్పకుండా ఇంటికి తీసుకొస్తాను' అంటూ చాలెంజ్ చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











