Krishna Mukunda Murari: కృష్ణ, మురారి పెళ్లి రద్దు.. ముకుంద మరో ప్లాన్.. అంతలో ట్విస్ట్ ఇచ్చిన భవానీ

భారతదేశంలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Krishna Mukunda Murari Serial Today Episode October 30th 2023

భవానీ దేవిని బ్రతిమాలుతూ: హుటాహుటిన ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర నిల్చుని ఉన్న కృష్ణను చూసి భవానీ దేవి కోపంతో రగిలిపోతుంది. అంతేకాదు, ఆమె దగ్గరకు వచ్చి ఇంట్లో ఉండడానికి వీలు లేదు వెళ్లిపో అంటుంది. అప్పుడు కృష్ణ 'ఏసీపీ సార్ పరిస్థితి బాలేదు. నేను సార్ దగ్గరే ఉండాలి పెద్ద అత్తయ్యా' అంటుంది. దీంతో భవానీ దేవి అలా పిలవకు అని సీరియస్ అవుతుంది. దీంతో కృష్ణ 'సరే మిమ్మల్ని మేడమ్ అనే అంటాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. మురారీ సార్‌కు నేను సాయం ఉండాలి' అని బ్రతిమాలుతుంది. కానీ, భవానీ దేవి మాత్రం వినిపించుకోదు.

పెళ్లిని రద్దు చేసేస్తాను అని: కృష్ణ బ్రతిమాలుతుండగా భవానీ దేవి 'క్రిమినల్స్‌కి నా ఇంట్లో స్థానం లేదు వెళ్లిపో. నమ్మించి ఎంతగా మోసం చేస్తావా? మా అబ్బాయికి మంచిగా అయిన తర్వాత అగ్రిమెంట్ రద్దు చేయిస్తాను. ఆ వెంటనే మ‌రో పెళ్లి చేస్తాను' అంటుంది. ఎంత చెప్పినా తన మాట వినకపోవడంతో ఆ ఇంట్లో నుంచి కృష్ణ నిరాశ‌గా వెనుదిరుగుతుంది. అలా ఆమె వెళ్లగానే ముఖం మీదనే ముకుంద డోర్ మూసేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి ముందరే నిల్చుని ఉంటుంది.

మురారికి గతం గుర్తు చేసేలా: చీకటి పడగానే మురారి హాల్లోకి వచ్చి కూర్చుంటాడు. ఇదే మంచి సమయం అనుకున్న ముకుంద తమ ప్రేమను గుర్తు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆ వెంటనే 'వాతావరణం చాలా బాగుంది కదా మురారీ. ఇలాంటి సమయాల్లో ప్రేమించిన వాళ్లు పక్కనే ఉంటే బాగుంది కదా' అంటుంది. దీంతో మురారి 'మరి నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ' అంటూ గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఏదో ప్రాబ్లం వచ్చి పిచ్చి పట్టిన వాడిలా మెలికలు తిరిగిపోతుంటాడు. ఆ శబ్దాలు విన్న ఇంట్లో వాళ్లు అంతా అక్కడికి వస్తారు.

మురారికి వైద్యం చేసిన కృష్ణ: ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో కృష్ణ కూడా పరుగు పరుగున అక్కడకు వస్తుంది. అప్పుడు బ్రతిమాలినా కూడా భవానీ దేవి వినదు. ఆ వెంటనే పక్కన ఉన్న ఓ ఇంజెక్షన్ తీసుకుంటుంది. అప్పుడు భవానీ దేవితో 'మేడమ్ ఇది చేస్తే మురారి సార్‌కు మామూలుగా అవుతుంది. ఇప్పుడు కోప్పడొద్దు' అని పర్మీషన్ తీసుకుంటుంది. ఆ వెంటనే మురారీకి ఇంజెక్షన్ చేస్తుంది. ఆ సమయంలో అతడు కృష్ణను తదేకంగా చూస్తూ ఉంటాడు. అప్పుడామె 'ఇంజెక్షన్ చేశాను కదా తగ్గిపోతుందిలే. మీరు కాస్త రెస్ట్ తీసుకోండి.. ఎక్కువ ఆలోచించొద్దు' అని చెప్తుంది.

కృష్ణ ఉండేందుకు ఓకే చెప్పి: మురారికి ఇంజెక్షన్ చేసిన తర్వాత కృష్ణ.. భవానీ దేవి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఆమెతో 'మేడమ్ నన్ను ఇక్కడే ఉండనివ్వండి. మురారీ సార్ పరిస్థితి చూశారు కదా. నేను ఉండటం చాలా అవసరం. సార్ సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డ‌ త‌ర్వాత ఇక్క‌డి నుంచి వెళ్లిపోతాన‌ు' అంటుంది. దీంతో భవానీ దేవి 'సరే.. ముకుందా తనకు గెస్ట్ హౌస్ రూమ్ చూపించు' అంటుంది. దీంతో రేవతి కాస్త బాధగా చూస్తుంది. కృష్ణ అయితే ఇదైనా చాలు అన్నట్లు ఊపిరి పీల్చుకుంటుంది. అనంతరం కృష్ణను.. ముకుంద గెస్ట్ హౌస్ వైపు తీసుకుని వెళ్తుంది.

నువ్వు భయపడుతున్నావు: కృష్ణ పరిస్థితిని చూసిన ముకుంద ఆమెను తన మాటలతో ఇంకా కృంగదీయాలని అనుకుంటుంది. అందుకు తగ్గట్లుగానే 'ఏంటి కృష్ణా బాధపడుతున్నావా? భయపడుతున్నావా' అని వెటకారంగా అడుగుతుంది. దీనికి కృష్ణ ధీటుగా 'నువ్వు భయపడుతున్నావు ముకుందా' అని అంటుంది. దీంతో ముకుంద 'అంతలేదు.. నేనెందుకు భయపడతాను' అని ఎదురు ప్రశ్నిస్తుంది. దీనికి కృష్ణ 'నిజం.. నీలో భయమే నిన్ను ఇలా మాట్లాడేలా చేస్తుంది' అంటుంది.

ఎందుకు పంపించింది?: కృష్ణ మాటలకు ముకుంద 'నేనెందుకు భయపడాలి? మీ పెద్ద అత్తయ్యా అదే మా భవానీ అత్తయ్య నాకు అండగా ఉంది. మురారికి నువ్వు ఎవరివో గుర్తు లేదు. నేను మురారిని ప్రేమిస్తున్నా అని డైరెక్ట్‌గా ఎప్పుడో భవానీ అత్తయ్యతో చెప్పేశాను. ఆదర్శ్ రాకూడదని ఆ కమాండర్ డ్రామాలో చెప్పేశాను. అయినా సరే నిన్ను బయటికి నన్ను లోపలికి ఎందుకు పంపించింది' అంటూ చెబుతుంది. దీంతో కృష్ణ ఆలోచనలో పడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X