Krishna Mukunda Murari: ముకుందకు మురారి షాక్.. కృష్ణను పట్టుకోగానే గుర్తొచ్చిన గతం.. అంతలోనే అలా!

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కృష్ణ ముకుంద మురారి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏడాదిగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'కృష్ణ ముకుంద మురారి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్‌లో ఏమైంది?: కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. ఇంటికి తిరిగి వచ్చిన కృష్ణను భవానీ దేవి అడ్డుకుంటుంది. అప్పుడామె ఎంత బ్రతిమాలినా వినకుండా బయటకు పంపుతుంది. అయినా కృష్ణ ఇంటి ముందే నిల్చుని ఉంటుంది. అనంతరం ముకుంద.. మురారికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేయడంతో అతడు ఇబ్బంది పడతాడు. దీంతో కృష్ణ వచ్చి ఇంజెక్షన్ చేయడంతో కోలుకుంటాడు. అనంతరం మురారి బాగు అయ్యే వరకూ కృష్ణ అక్కడే ఉండేందుకు భవానీ ఒప్పుకుంటుంది. కానీ, ఔట్ హౌస్‌లోనే ఉండాలని చెబుతుంది.

Krishna Mukunda Murari Serial Today Episode October 31st 2023

ముకుందతో కృష్ణ చాలెంజ్: తన దగ్గరకు వచ్చి వెటకారంగా మాట్లాడుతున్న ముకుందకు కృష్ణ ధీటుగానే సమాధానాలు చెప్తుంది. అప్పుడు ముకుంద.. మురారిని నీకు దక్కకుండా చేస్తానని అనగా.. 'ఆయనకు ఎప్పటికీ నేనే భార్యను. నేను ఆ ఇంట్లోకి రావడం కాదు.. మురారి సార్‌నే ఔట్ హౌస్‌లోకి వచ్చేలా చేస్తాను' అంటూ కృష్ణ చాలెంజ్ చేస్తుంది. అంతేకాదు, 'ఈ ఇంట్లో నాకు కాదు.. నీకు కూడా ఏ హ‌క్కు లేద‌ు. ఆద‌ర్శ్‌ను నీ భ‌ర్త అని ఒప్పుకున్న‌ప్పుడే నీకు అన్ని హ‌క్కులు వ‌స్తాయి' అని ఝలక్ ఇస్తుంది. దీంతో ముకుందకు ఏం మాట్లాడాలో అర్థం కాదు.

కర్రీతో రేవతి ప్రయత్నాలు: కృష్ణ, మురారి దూరంగా ఉండడాన్ని చూసి మధుకర్ తట్టుకోలేకపోతాడు. భవానీ మనసులోని అపోహలు తొలగిపోయి ఆమెను ఇంటి కోడలిగా అంగీకరించాలని అనుకుంటాడు. అంతలోనే అక్కడకు మురారి వస్తాడు. అతడిని చూసిన మధుకర్.. 'మురారి కచ్చితంగా కృష్ణకు థ్యాంక్స్ చెప్తాడు' అని అనుకుంటాడు. కానీ, మురారి మాత్రం ముకుంద ఎక్కడ అని భవానీని అడుగుతాడు. అది చూసి వాళ్లు బాధపడతారు. అనంతరం రేవతి వంకాయ కర్రీతో మురారికి గతం గుర్తు చేయాలని అనుకుంటుంది. అప్పుడు భవానీ తెగ కంగారు పడిపోతుంది.

తన రూమ్‌నే మురారిదని: డిన్నర్ చేసిన తర్వాత మురారి త‌న రూమ్ ఏదో తెలియ‌క కంగారు ప‌డుతుంటాడు. అప్పుడు రేవ‌తి చెప్ప‌బోతుండ‌గా ముకుంద వచ్చి త‌న‌ రూమ్‌నే మురారిది అని చెబుతుంది. అంతేకాదు, నీ కోసం రూమ్ మొత్తం రెడీ చేసి పెట్టాన‌ని అంటుంది. అప్పుడు మురారి.. ముకుంద‌కు థాంక్స్ చెబుతాడు. అప్పుడామె అది నా బాధ్యత అనగా.. రేవతి అదంతా చూసి షాక్ అయిపోతుంది. తర్వాత ఎందుకలా అబద్ధం చెప్పావని ప్రశ్నించగా.. భవాని ముకుందకు సపోర్టుగా మాట్లాడుతుంది. అంతేకాదు, మురారిని మంచి మనిషిని చేసే బాధ్యతను ముకుందకు అప్పగిస్తుంది.

బాబాయిని నిరపరాధిగా: మరోవైపు, ఔట్ హౌస్‌లో ఉన్న కృష్ణ.. మురారికి ఎలాగైనా గ‌తం గుర్తు చేయ‌డంతో పాటు ఏ నేరం చేయ‌కుండా జైలు పాలైన త‌న చిన్నాన్న‌ను నిరాప‌రాధిగా విడిపించాల‌ని అనుకుంటుంది. అప్పుడు ఆక‌లిగా ఉన్నా అక్కడ వండుకోవ‌డానికి ఏం లేక‌పోవ‌డంతో అలాగే నిద్ర‌పోవాల‌ని అనుకుంటుంది. అంతలోనే మ‌ధుక‌ర్ ఆమె కోసం అన్నం తీసుకొస్తాడు. కృష్ణ బాధ‌లో ఉంటుంద‌ని మ‌ధుక‌ర్ అనుకుంటాడు. కానీ ఆమె చాలా ధైర్యంగా ఉండడం చూసి సంతోషపడతాడు.

కృష్ణను కాపాడిన మురారి: ఉదయం అవగానే ఔట్ హౌస్‌ను కృష్ణ శుభ్రం చేస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడకు వచ్చిన ముకుంద 'నీ శేష జీవితం మొత్తం ఇలాగే ఇక్కడే గడిచిపోవాలి' అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీనికి కృష్ణ ధీటుగానే బదులిస్తుంది. అంతేకాదు, 'ఏదో ఒక రోజు త‌ప్ప‌కుండా నేను తిరిగి ఇంట్లో అడుగుపెడ‌తాను' అంటూ ముకుంద‌తో ఛాలెంజ్ చేస్తుంది. అప్పుడే కృష్ణను వెతుక్కుంటూ మురారి అక్కడకు వస్తాడు. అంతలో ఆమె బూజు దులుపుతూ కింద పడబోతుంది. అప్పుడామెను మురారి పట్టుకుంటాడు. దీంతో మురారికి గతం గుర్తుకు వస్తుంటుంది.

ముకుందకు మురారి షాక్: కృష్ణ, మురారి గతం గుర్తు చేసుకుంటూ ఉండగా ముకుంద వాళ్లను డిస్ట్రర్బ్ చేస్తుంది. ఆ తర్వాత తేరుకున్న మురారి.. కృష్ణకు సహాయం చేయాలని అనుకుంటాడు. కానీ, కృష్ణ మాత్రం మీకంటే ముకుంద చేస్తే బాగుంటుంది అంటుంది. దీంతో మురారి ఆమెను సహాయం చేయమని చెప్తాడు. దీంతో ముకుంద చీపురు పట్టుకుని ఔట్ హౌస్‌ను క్లీన్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు కృష్ణ కూడా సహాయం చేస్తానని అంటే మురారి వద్దని చెప్తాడు. దీంతో మురారి, ముకుంద కలిసి అంతా శుభ్రం చేస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X