Krithi Shetty చేతిలో ముత్యమంత ముద్దు.. సరికొత్త సీరియల్‌తో..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న జీ తెలుగు ఛానెల్ మరో ఫ్యామిలీ నేపథ్యం ఉన్న సీరియల్‌ను ప్రారంభించింది. ముత్యమంత ముద్దు అనే సీరియల్‌ను ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. ఈ సీరియల్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా జీ తెలుగు విడుదల చేసింది.
ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి చేతుల మీదుగా సరికొత్త ధారవాహిక ముత్యమంత ముద్దు ప్రారంభం కానున్నది. రుణం పేరుతో దారుణాలు చేసే అత్త, కన్నవాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అనుకునే కోడలు అనే కాన్సెప్ట్‌తో ముత్యమంత ముద్దు సీరియల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నది అంటూ కాన్సెప్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు.

గీత ముహుర్త సమయం ముంచుకుపోతున్నది. త్వరగా పెళ్లి తంతు పూర్తి చేయండి అంటూ ఓ మహిళ చెప్పగా.. కృతిశెట్టి తాంబూలంలో తాళిని పట్టుకొని వచ్చింది. ఆ తర్వాత కృతిశెట్టి మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత అమ్మాయి లైఫ్ అంతా మారిపోతుంది కదా.. ఇంటిని వదిలిపోవాలి. ఇంటి పేరు మార్చుకోవాలి. అమ్మా, నాన్నలను దాదాపు మరిచిపోవాలి. పెళ్లి గురించి, అత్తమామ సంరక్షణ గురించి కృతిశెట్టి, మరో యువతితో జరిగిన సంభాషణ సీరియల్ కథ, కథనాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పాయి.

నిషా మిలానా, సిద్దార్థ్ వర్మ, రామీ మేఘన, ఆమని తదితరులు ఈ సిరియల్‌లో నటిస్తున్నట్టు తాజా సమాారం. ఇంకా నటీనటులు వివరాలు అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











