twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తీకదీపం శౌర్యతో అంత ఈజీ కాదు.. జబర్దస్త్ నరేష్‌ను ఓ ఆటాడేసుకుంది!!

    |

    బుల్లితెరపై కార్తీక దీపం సృష్టిస్తోన్న సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే కార్తీకదీపం, వంటలక్క, డాక్టర్ బాబు, శౌర్యలు క్రియేట్ చేస్తున్న వండర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి క్యారెక్టర్స్‌కు, పోషిస్తోన్న తీరుకు ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. వంటలక్క, డాక్టర్ బాబు పాత్రల తరువాత శౌర్య (కృతిక) పాత్రకే ఎక్కువ పేరు వచ్చింది. సీరియల్‌లో ఎంత చలాకీగా ఉంటుందో బయట కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది.

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    కృతిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. కార్తీకదీపం సెట్స్‌లోని విశేషాలు, క్యాస్టింగ్‌తో పెట్టే ముచ్చట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. వయసు చిన్నదే అయినా ఆలోచనలో మాత్రం అందరికంటే ఎంతో ఎత్తులో ఉంటుంది. దానం చేయడంలో, ఎదుటివారికి సాయపడటంలో ముందుంటుంది.

    తాజాగా షోలో..

    తాజాగా షోలో..

    సాయి కుమార్ హోస్ట్‌గా నిర్వహిస్తోన్న వావ్ ప్రోగ్రాం గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వావ్ మూడో సీజన్ ప్రారంభం కాగా.. అది బాగానే క్లిక్కయింది. వచ్చే వారం ఎపిసోడ్‌లో పిల్లల గ్యాంగ్‌తో రచ్చ చేసేందుకు రాబోతోన్నాడు. ఈ క్రమంలో బేబీ కృతిక, నేహాంత్, జబర్దస్త్ నరేష్, బేబీ శ్రీదేవీ విచ్చేశారు.

    నరేష్‌పై పంచులు..

    నరేష్‌పై పంచులు..

    ఇక జబర్దస్త్ నరేష్ ఇలా చిన్నపిల్లలతో కలిసి ఆట ఆడటానికి రావడంపై అందరూ సెటైర్లు వేశారు. పోడియం వద్ద నరేష్ నిల్చుంటే కనీసం దాని అంత ఎత్తు కూడా లేడు. నరేష్ ఎక్కడున్నాడు కనిపించడం లేదని కృతిక ఓ పంచ్ వేయడంతో అందరూ పగలబడి నవ్వేశారు. ప్రోమోలో అందరూ కలిసి నరేష్‌ను బాగా వాడేసుకున్నట్టు కనిపిస్తోంది.

    అమాంతం నెట్టేసింది..

    అమాంతం నెట్టేసింది..

    ఇక మరోసారి నేహాంత్ పంచ్ వేశాడు. భాషా లెవెల్‌లో నరేష్ పోజు కొడుతుండగా నేహాంత్ వేసిన పంచ్‌కు నవ్వులు పూశాయి. బేబీ శ్రీదేవితో డైలాగ్ చెప్పించేందుకు నరేష్ నానా తంటాలు పడ్డాడు. ఇక చివర్లో నరేష్‌ను అమాంతం నెట్టడంతో ఎగిరిపడ్డాడు. మొత్తానికి పిల్లల సందడితో షో మొత్తం నవ్వులఝల్లులు కురిశాయి.

    Recommended Video

    Karthika Deepam fame Nirupam AKA Karthik Got gift from Chiranjeevi's Mother Anjana Devi
    కంటెస్టెంట్ల రచ్చ..

    కంటెస్టెంట్ల రచ్చ..

    వావ్ మూడో సీజన్‌లొ కంటెస్టెంట్లు చేసే రచ్చతో షో బాగానే క్లిక్ అవుతోంది. హైపర్ ఆది, అనసూయ, శ్రీముఖి, విషుప్రియ, రాం ప్రసాద్ వంటి కంటెస్టెంట్లను తీసుకొచ్చి షోను బాగానే నడిపిస్తున్నారు. తాజాగా ఈ పిడుగులతో చేసిన ఎపిసోడ్ కూడా క్లిక్ అయ్యేట్టే కనిపిస్తోంది.

    English summary
    Krithika And Jabardasth Naresh In WOW 3 Show, sai kumar Hosting Wow 3 season, Krithika, Jabardasth Naresh, Nehanth Are Particiaped In This SHow.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X