పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టెలివిజన్ నటి.. క్యూట్‌గా పేరు పెట్టి స్వాగతం..

జాతీయ టెలివిజన్ ఛానెల్‌లో అత్యంత ప్రేక్షకదారణతో ఆకట్టుకొంటున్న డైలీ సీరియల్‌ కుమ్ కుమ్ ఫేం శిఖా సింగ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తమ కుటుంబాంలోకి చిన్నారిని స్వాగతించామని భర్త కరణ్ షా సంతోషాన్ని వ్యక్తం చేశారు. శిఖా సింగ్ ఆడపిల్లకు జన్మనిచ్చారని చెబుతూ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక శిఖా సింగ్, చిన్నారి గురించి మరిన్నీ వివరాలు తెలియజేస్తూ..

జూన్ 16న శిఖా సింగ్ ప్రసవం

జూన్ 16న శిఖా సింగ్ ప్రసవం

శిఖా సింగ్ 2020 జూన్ 16వ తేదీన రాత్రి ఆడపిల్లకు జన్మినిచ్చారు. ప్రస్తుతం శిఖా సింగ్, చిన్నారి క్షేమంగా ఉన్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగున్నదని వైద్యులు చెప్పారు. మా పాపకు అలయ్‌నా సింగ్ షా అని పేరు పెట్టుకొన్నాం. చిన్నారి రాకతో మా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తున్నది అని కరణ్ షా ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు.

ప్రసవానికి ముందు కవితా ధోరణితో

ప్రసవానికి ముందు కవితా ధోరణితో

ఇక శిఖా సింగ్ తన ప్రసవానికి ముందు బిడ్డ గురించి కవితా ధోరణిలో స్పందించారు. నా గర్భంలోపల ఉన్నప్పుడు ఈ ప్రపంచానికి ఎప్పుడు పరిచయం అవుతావనే విషయంపై ఆశ్చర్య పోతుండేదానిని. నిన్ను త్వరగా కలుసుకోవాలి ఆరాటపడేదానిని. నీవు ఆరోగ్యంగా, సంతోషంగా, గౌరవంగా, దయార్థహృదయంతో ఉండాలని కలలుకన్నాను అని అని శిఖా సింగ్ పేర్కొన్నారు.

సరికొత్త పాత్రలోకి

సరికొత్త పాత్రలోకి

జీవితంలో కొత్త పాత్రలోకి ప్రవేశించాను. జీవితం ప్రతీ మలుపులో ఓ బాధ్యతను భుజానికి ఎత్తుకోవడం ఆనందంగా ఉంది. తల్లిచాటు బిడ్డ నుంచి, భార్యగా, ఇప్పుడు మరో బిడ్డకు తల్లిగా సరికొత్త పాత్రను చేపట్టడం ఓ సవాలే అని చెప్పవచ్చు. నా చిన్నారి జీవితం బంగారుమయం కావాలిని కోటి ఆశలతో ముందుకెళ్లున్నాను అని శిఖా సింగ్ చెప్పారు.

Recommended Video

Sushant Singh Rajput: Vivek Oberoi Emotional నన్ను కూడా సుశాంత్ లానే తొక్కేసారు ?
శిఖా సింగ్ కెరీర్ ఇలా...

శిఖా సింగ్ కెరీర్ ఇలా...

శిఖా సింగ్ కెరీర్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్‌తో మొదలై.. మేరీ డోలి తేరి అంగన, ఘర్ కీ లక్ష్మీ బేటియాన్, ఉత్తరన్, నా ఆనా ఇస్ దే లాడో, ఫుల్వా, అదాలత్, ససురాల్ సిమర్ కీ, మహాభారత్, ప్యార్ కో హో జానే దో, చంద్ర నందిని, కుండలి భాగ్య, లాల్ ఇష్క్ సీరియల్స్‌లో నటించింది. మే 1, 2016న తన చిరకాలంగా పరిచయం ఉన్న స్నేహితుడు కరణ్ షాను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X