Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గర్బవతి అయిన టీవీ నటి.. భర్తతో కలిసి ప్రెగ్నెన్సీ ఫోటోల రచ్చ
జాతీయ టెలివిజన్ ఛానెల్లో డైలీ సీరియల్ కుమ్ కుమ్ అత్యంత ప్రేక్షకదారణతో ముందుకెళ్తున్నది. లాక్డౌన్ కారణంగా అన్ని సీరియల్స్‌తోపాటు టెలికాస్ట్ నిలిచిపోయి ప్రేక్షకులకు నిరాశను కలిగించాయి. అయితే రీ టెలికాస్ట్‌తో పలు సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఈ క్రమంలో కుమ్ కుమ్ సిరియల్లో కీలక పాత్ర పోషించిన నటి శిఖా సింగ్ లాక్డౌన్లో శుభవార్త వినిపించింది. వివరాల్లోకి వెళితే...
మాతృత్వపు అనుభవంతో
టీవీ నటి శిఖా సింగ్ తన భర్త కరణ్ షాతో లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నది. గర్బవతిగా మారిన ఆమె తన మాతృత్వ అనుభవాలను పొందేందుకు ఉవ్విల్లూరుతున్నారు. గర్బానికి సంబంధించిన ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
గర్బవతిగా ఫీలింగ్స్‌తో
గర్బవతిగా ఆ ఫీలింగ్‌ను అనుభవిస్తూనే ఫ్యాషన్ దస్తులతో హంగామా చేస్తున్నది. చిన్న పిల్లలమనే ఫీలింగ్ నుంచి పెద్దలుగా మారబోతున్న నేపథ్యంలో ఆ ఫీలింగ్ మరింత గొప్ప అనుభూతిని కలిగిస్తున్నది. నీవు తల్లిగా అర్హత సాధించనున్నావనే విషయం మనసును మరింత ఆహ్లాదకరంగా మారుస్తున్నది అని శిఖా సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.
ఫ్యాషన్ టిప్స్
గర్బవతిగా ఉండే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలనే విషయాన్ని అప్పుడే చెప్పడం మొదలుపెట్టింది. గర్భంలోని పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. లూజ్‌గా ఉండే స్లీవ్ లెస్ దుస్తులను ధరించాలి అంటూ చిట్కాలు చెబుతున్నది.
Recommended Video
ఇదో గొప్ప అనుభూతి అంటూ
జీవితంలో పలు దశలుగా ముందుకు పోతున్నది. ప్రతీసారి ఓ కొత్త పాత్రను పోషించడం గొప్ప అనుభూతిని కలిగిస్తున్నది. తల్లిచాటు బిడ్డగా, భార్యగా ఇప్పటి వరకు పాత్రను పోషించినా తాను తల్లిగా సరికొత్త భూమికను జీవితంలో పోషించబోతున్నాను అని శిఖా సింగ్ పేర్కొన్నారు.