twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గర్బవతి అయిన టీవీ నటి.. భర్తతో కలిసి ప్రెగ్నెన్సీ ఫోటోల రచ్చ

    |

    జాతీయ టెలివిజన్ ఛానెల్‌లో డైలీ సీరియల్‌ కుమ్ కుమ్ అత్యంత ప్రేక్షకదారణతో ముందుకెళ్తున్నది. లాక్‌డౌన్ కారణంగా అన్ని సీరియల్స్‌తోపాటు టెలికాస్ట్ నిలిచిపోయి ప్రేక్షకులకు నిరాశను కలిగించాయి. అయితే రీ టెలికాస్ట్‌తో పలు సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఈ క్రమంలో కుమ్ కుమ్ సిరియల్‌లో కీలక పాత్ర పోషించిన నటి శిఖా సింగ్ లాక్‌డౌన్‌లో శుభవార్త వినిపించింది. వివరాల్లోకి వెళితే...

    మాతృత్వపు అనుభవంతో

    మాతృత్వపు అనుభవంతో

    టీవీ నటి శిఖా సింగ్ తన భర్త కరణ్ షాతో లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నది. గర్బవతిగా మారిన ఆమె తన మాతృత్వ అనుభవాలను పొందేందుకు ఉవ్విల్లూరుతున్నారు. గర్బానికి సంబంధించిన ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నది. ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

    గర్బవతిగా ఫీలింగ్స్‌తో

    గర్బవతిగా ఫీలింగ్స్‌తో

    గర్బవతిగా ఆ ఫీలింగ్‌ను అనుభవిస్తూనే ఫ్యాషన్ దస్తులతో హంగామా చేస్తున్నది. చిన్న పిల్లలమనే ఫీలింగ్ నుంచి పెద్దలుగా మారబోతున్న నేపథ్యంలో ఆ ఫీలింగ్ మరింత గొప్ప అనుభూతిని కలిగిస్తున్నది. నీవు తల్లిగా అర్హత సాధించనున్నావనే విషయం మనసును మరింత ఆహ్లాదకరంగా మారుస్తున్నది అని శిఖా సింగ్ తన ఇన్స్‌టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు.

    ఫ్యాషన్ టిప్స్

    ఫ్యాషన్ టిప్స్

    గర్బవతిగా ఉండే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలనే విషయాన్ని అప్పుడే చెప్పడం మొదలుపెట్టింది. గర్భంలోని పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. లూజ్‌గా ఉండే స్లీవ్ లెస్ దుస్తులను ధరించాలి అంటూ చిట్కాలు చెబుతున్నది.

    Recommended Video

    #8YrsOfGabbarSingh: Then World Wide Box Office Collections, Now Twitter Records
    ఇదో గొప్ప అనుభూతి అంటూ

    ఇదో గొప్ప అనుభూతి అంటూ

    జీవితంలో పలు దశలుగా ముందుకు పోతున్నది. ప్రతీసారి ఓ కొత్త పాత్రను పోషించడం గొప్ప అనుభూతిని కలిగిస్తున్నది. తల్లిచాటు బిడ్డగా, భార్యగా ఇప్పటి వరకు పాత్రను పోషించినా తాను తల్లిగా సరికొత్త భూమికను జీవితంలో పోషించబోతున్నాను అని శిఖా సింగ్ పేర్కొన్నారు.

    English summary
    Kum Kum actress Shikha Singh Pregnant photos goes viral. She shared fashionable style of photos with her great feelings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X