బిగ్ బాస్‌లో జరుగుతోంది అదే, ఆ వ్యక్తి నిజాన్ని చెప్పేశాడు.. పశువుల కంటే దారుణం: కుమార్ సాయి
బిగ్ బాస్ సీజన్ 4 రోజురోజుకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. కేవలం వీకెండ్స్ లోనే కాకుండా మిగతా రోజులలో కూడా కంటెస్టెంట్స్ వ్యవహరిస్తున్న తీరు షాక్ ఇస్తోంది. ఇక గత వారం ఎలిమినెట్ అయిన కుమార్ సాయికి నెటిజన్ల నుంచి కొంత వరకు మద్దతు లభిస్తోంది. అతనిని కావాలని టార్గెట్ చేసి హౌజ్ నుంచి బయటకు పంపేశారని కామెంట్స్ వస్తున్నాయి. ఇక వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారిన కుమార్ ఒక విషయాన్ని బయటపెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

అదే నాకు మైనస్ అయ్యింది
కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం గురించి మాట్లాడుతూ.. అదే నాకు మైనస్ అయ్యింది. హౌజ్ లో ఎన్ని రిలేషన్స్ పెట్టుకున్న కూడా సోలోగానే గేమ్ ఆడాలి అనుకున్నా. అందుకే అందరు దూరం పెట్టినా కూడా సింగిల్ గానే ఉన్నాను. ఇక అప్పటికే హౌజ్ లో ఉన్న వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు.

జంతువులు మాత్రమే అలా చేస్తాయి
నన్ను ఎవరు కూడా కలుపుకోలేదు. నిజానికి మనుషులు అయితే అలా కొత్తగా వచ్చిన వారిని దూరం పెట్టి కావాలని టార్గెట్ చేయరు. జంతువులు మాత్రమే అలా చేస్తాయి. వీళ్ళు అలా చేశారు అనడం లేదు కానీ.. నా విషయంలో మాత్రం నన్ను దూరంగా ఉంచినట్లు అనిపించింది. నేను ఏదో అవసరం కోసం బలవంతంగా స్నేహం చేసే వ్యక్తిని అయితే కాదు. కానీ హౌజ్ లో అందరితో ఫ్రెండ్ లాగా ఉండాలని చాలా ట్రై చేశాను. కానీ సెట్టవ్వలేదు.

అతి కష్టమైనా పని ఏమిటంటే..
బిగ్ బాస్ లో అతి కష్టమైనా పని ఏమిటంటే.. అప్పటివరకు ఫ్రెండ్ లాగా ఉన్న వారిని ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాల్సి వస్తోంది. అప్పుడే అసలు రంగు బయటపడుతుంది. అయితే బిగ్ బాస్ హౌజ్ లో నేను గేమ్ లానే ఆడాను. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ స్నేహితులను నామినేట్ చేయకుండా నన్ను స్పెషల్ గా టార్గెట్ చేశారు.
Recommended Video

ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు
ఒక వ్యక్తి నాకు చెప్పినప్పుడు నాకు ఆ విషయం చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. అతను ఏమన్నాడంటే.. సారీ బ్రదర్ నిన్ను నామినేట్ చేయాలని కాదు. కానీ పలానా వాళ్ళ కోసం అది చేయక తప్పడం లేదు. ఆ మాటలతోనే నాకు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఎంతో హుషారుగా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన నేను అక్కడి పరిస్థితులను చూసి చాలా నిరాశకు గురయ్యాను.. అంటూ కుమార్ సాయి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











