Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అంతే ఇచ్చారు.. బిగ్ బాస్ 4 రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన కుమార్ సాయి
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు చాలా పొదుపుగా ఆలోచించినట్లు అర్ధమవుతోంది. ప్రతి సీజన్ కి ఎంతో హై లెవెల్ కంటెస్టెంట్స్ ని తీసుకు వచ్చే నిర్వాహకులు ఈ సారి మాత్రం కాస్త లో ప్రొఫైల్ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపారు. కరోనా కష్ట కాలంలో జనాలు టీవీలకు బాగా అలవాటు పడ్డారని ఎవరిని తెచ్చినా చూస్తారని అనుకున్నట్లు ఉన్నారు. అందుకే తక్కువ ఖర్చుతోనే కానిచ్చేశారు. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఒక్కో రూమర్ వస్తోంది. ఇక కుమార్ సాయి తన రెమ్యునరేషన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వివరణ ఇచ్చారు.
టార్గెట్ చేయడం వల్ల ఎలిమినేట్
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన ఈ రోజుల్లో ఫేమ్ కుమార్ సాయి ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. చాలా వరకు అతను సేఫ్ గేమ్ ఆడాలని ప్రయత్నం చేశాడు గాని వర్కౌట్ కాలేదు. లేటుగా రావడంతో అప్పటికే కంటెస్టెంట్స్ అతన్ని దూరంగానే ఉంచారు. అందరూ అతన్ని టార్గెట్ చేసి ఎలిమినేషన్స్ వరకు తీసుకు వెళ్లినట్లు కామెంట్స్ అయితే గట్టిగానే వచ్చాయి.
అనుమానాలను నిజం చేసిన కుమార్ సాయి
కుమార్ సాయి కూడా హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత హౌజ్ లో తనను మోసం చేసినట్లు చెప్పారు. ఎదో జరుగుతోంది అంటూనే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మధ్యలో వచ్చినందుకు తనను అందరూ కావాలని దూరం పెట్టారని కుమార్ సాయి అనుమానాలను మరింత బలంగా మార్చాడు. అతని వల్ల హౌజ్ లో కూడా పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదని నిర్వాహకులు కావాలని పంపించినట్లు కూడా రూమర్స్ వచ్చాయి.
రెగ్యులర్ పేమెంట్ తరహాలోనే ఇచ్చారు
ఇక కుమార్ సాయి పాల్గొన్నందుకు అందులో దక్కిన రెమ్యునరేషన్ ఎంత అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక కుమార్ సాయి వివరణ ఇస్తూ.. తాను రెమ్యునరేషన్ గురించి ఎప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదని వీలైనంత వరకు ఎప్పుడైనా సరే ఎంతో కొంత తీసుకునేవాన్ని అని అన్నాడు. ఇక బిగ్ బాస్ లో తనకు రెగ్యులర్ గా సినిమాలకు ఎంత తీసుకుంటానో అంతే ఇచ్చారని లక్షలు లక్షలు ఏమి ఇవ్వలేదని చెప్పాడు.
లక్షలు అయితే ఇవ్వలేదు..
అంటే కుమార్ సాయి రెగ్యులర్ యాక్టర్ గా 10వేల లోపు డైలీ పేమెంట్ అందుకోవచ్చని టాక్. అంటే బిగ్ బాస్ లో ఉన్న ఆ కొన్ని రోజుల్లో కుమార్ సాయికి 40వేల లోపే రెమ్యునరేషన్ వచ్చి ఉంటుందని సమాచారం. మొన్నటి వరకు ఈ కంటెస్టెంట్ రెమ్యునరేషన్ పై అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. లక్షకు పైగానే అందుకున్నట్టు టాక్ రాగా ఇప్పుడు కుమార్ సాయి ఇచ్చిన క్లారిటీతో అవన్నీ అబద్దాలని తేలిపోయింది.