సోహెల్ మెహబూబ్ వీడియో.. తప్పే అంటూ కుమార్ సాయి సెన్సేషనల్ కామెంట్స్
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ముగిసింది. కానీ వివాదాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోహెల్ మెహబూబ్ స్కాం చేశారంటూ ఓ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదంటూ సోహెల్ మెహబూబ్ క్లారిటీ ఇచ్చినా కూడా కొందరికీ ఇంకా అనుమానాలు అలానే ఉన్నాయి. సోహెల్ ప్రతీ చోటా ఒక్కో కారణం చెబుతూ ఉండటం, సోహెల్ చెప్పిన మాటలకు, అఖిల్ చెప్పే వాటికి పొంతనే కుదరడం లేదు.

సైగలు వాటి కోసం..
ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల గురించి అడిగితే సైగలు చేశాడని మెహబూబ్ గురించి సోహెల్ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత తాము ముగ్గురం సూపర్ అంటూ మరో సైగ చేశాడని చెప్పుకొచ్చాడు. స్థానాల గురించి అడగలేదని ఒకచోట అంటే.. అడిగామని ఒక చోట చెప్పుకొస్తున్నాడు. మెహబూబ్ ఏదో సైగలు చేశాడు.. అర్థం కావడం లేదంటూ అఖిల్‌తో చర్చించానని సోహెల్ చెబుతున్నాడు.

నాకు తెలియదు..
మెహబూబ్ సోహెల్ మాట్లాడుకున్నారని, అలా చేశారని నాకు తెలియదు.. ఆ విషయం గురించి సోహెల్ నాతో మాట్లాడలేదంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. కానీ సోహెల్ మాత్రం అఖిల్‌తో చర్చించానని అంటున్నాడు. ఈ ముగ్గురి వ్యవహారం ఇలా ఉంటే అభిజిత్ రియాక్షన్ మరోలా ఉంది.

వారే చూసుకుంటున్నారు...
సోహెల్ మెహబూబ్ వీడియో గురించి అభిజిత్ మాట్లాడుతూ.. అది ఎప్పుడు జరిగిందో తనకు తెలియడం లేదంటూ చెప్పుకొచ్చాడు. అయినా అది జరిగినా తానేమీ మాట్లాడలేను.. అందులో ఏదైనా తప్పు జరిగి ఉంటే స్టార్ మా, ఎండోమోల్ షైన్ ఇండియావారు చూసుకుంటారు.. నాకు మాట్లాడే హక్కులేదంటూ చెప్పుకొచ్చాడు. అది వారి వ్యక్తిగతమని అన్నాడు.

అలా చేసి ఉంటే తప్పే..
తాజాగా కుమార్ సాయి ఈ ఘటనపై స్పందించారు. వారు అలా చేసే వాళ్లు కాదు.. ఒక వేళ చేసి ఉంటే అది కచ్చితంగా తప్పే.. ఎందుకంటే అలా చేయడం వల్ల విజేతకు రావాల్సిన డబ్బులు కూడా పోయాయ్ కదా అని కుమార్ సాయి చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











