చివర్లో ట్విస్ట్ ఉంటుందనుకున్నా.. వాళ్ల వల్లే అభిజీత్ గెలిచాడు: బిగ్ బాస్ రిజల్ట్‌పై కుమార్ సాయి కామెంట్స్
అన్ని సీజన్లతో పోలిస్తే పేరున్న కంటెస్టెంట్లు చాలా తక్కువగా ఉండడంతో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఏమాత్రం ఆసక్తికరంగా సాగదని చాలా మంది అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా ఆరంభం నుంచే రంజుగా సాగిందీ సీజన్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు... ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన టాస్కులు అన్నింటికీ మించి ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు ఇలా ఊహించని కథలతో షోపై ఆసక్తి పెరిగిపోయింది. ఏది ఎలా ఉన్న విన్నర్ విషయంలో మాత్రం అందరూ అనుకున్నదే జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ రిజల్ట్‌పై కంటెస్టెంట్ కుమార్ సాయి ఆసక్తికరమైన వాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

నా స్వామి రంగ నుంచి ఈరోజుల్లో వరకు
'నా స్వామి రంగ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కమెడియన్ కుమార్ సాయి. ఆ సినిమాలో మెప్పించిన అతడు.. మారుతి తెరకెక్కించిన 'ఈరోజుల్లో'లో అవకాశం అందుకున్నాడు. ఇక, ఈ సినిమాలో అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరీ ముఖ్యంగా అతడి మేనరిజం ట్రెండ్ అయింది. దీని తర్వాత ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడతను.

వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ
చాలా కాలం పాటు సినిమాల్లో రాణించిన కుమార్ సాయి.. కొన్నేళ్లుగా వెండితెరపై సందడి చేయడం లేదు. కానీ, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని మాత్రం అందుకున్నాడు. ప్రీమియర్ ఎపిసోడ్‌లో మొత్తం పదహారు మంది ఎంటర్ అవగా.. మొదటి వారం షో నుంచి సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యారు. ఆ వెంటనే కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.

అంచనాలెన్నో.... నిరాశ పరిచిన ఆర్టిస్టు
కుమార్ సాయి కామెడీ టైమింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లోకి అతడు ప్రవేశించినప్పటి నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఓ రేంజ్‌లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా అతడి నుంచి వినోదం పండలేదు. ఈ విషయంలో ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. దీన్నే నాగార్జున కూడా పలుమార్లు చెప్పాడు.

అనుకోకుండా ఔట్... బాస్‌పై విమర్శలు
వినోదాన్ని పంచకపోయినప్పటికీ.. బిగ్ బాస్ హౌస్‌లో చక్కగా ఆడుతూ వచ్చాడు కుమార్ సాయి. ప్రతి టాస్కులోనూ తన సత్తాను చూపించుకున్నాడు. అయినప్పటికీ ఊహించని విధంగా అతడు షో నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో బిగ్ బాస్ నిర్వహకులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతడు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరిగినా.. అది నిజం కాలేదు.

బిగ్ బాస్ రిజల్ట్‌పై కుమార్ సాయి కామెంట్స్
బిగ్ బాస్ షోలోకి వచ్చే సమయంలోనూ.. గ్రాండ్ ఫినాలేలోనూ అక్కినేని నాగార్జునకు ఓ కథను చెబుతానని అన్నాడు కుమార్ సాయి. ఇప్పుడదే పనిలో ఉన్నానని చెబుతున్న అతడు.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో బిగ్ బాస్ షో గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన అతడు.. విన్నింగ్ రిజల్ట్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చివర్లో ట్విస్ట్ ఉంటుందనుకున్నా.. కానీ అతడే
దీని గురించి మాట్లాడుతూ.. 'బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నేనే గెలుస్తాననుకున్నా. బయటకొచ్చాక మాత్రం అభిజీత్‌దే టైటిల్ అనుకున్నా. ఎందుకుంటే ఆయనకు అంతలా ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్స్ వల్లే అతడు విజయం సాధించాడు. కానీ, ఎందుకో చివర్లో ట్విస్ట్ ఉంటుందేమో అనుకున్నా. ఆ సమయంలో ఇద్దరు గెలుస్తారని భావించా. కానీ నా నమ్మకమే నిజమైంది' అని చెప్పాడతను.


Click it and Unblock the Notifications











