కుమార్ సాయి ఎలిమినేషన్‌కు అదే కారణమా? అలా బలి అయ్యాడా?
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో మరో వికెట్ పడింది. వైల్డ్ కార్డు ఎంట్రీగా ఇంట్లోకి అడుగుపెట్టిన మరో కంటెస్టెంట్ కుమార్ సాయి తిరుగుముఖం పట్టారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీలు బలమైన కంటెస్టెంట్లుగా ఎందుకు మారలేకపోతున్నారనే విషయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వచ్చిన స్వాతి దీక్షిత్, కుమార్ సాయి అవుట్ కారణాలు ఏమిటంటే..
Recommended Video

వైల్డ్ కార్డు ఎంట్రీలకు ముందే క్లారిటీ
ఇంట్లోకి ముందుగా అడుగుపెట్టిన వారికంటే వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులకు కొంత సానుకూలత ఉంటుందనే విషయంపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి. వారు ఇంట్లోకి ప్రవేశించడాని కంటే ముందే ఇంట్లో జరిగిన విషయాలు తెలిసి ఉంటాయి. ఎలాంటి వ్యూహంతో ఇంట్లోకి వెళ్లాలనే కొంత క్లారిటీ ఉంటుంది. అయితే ఆ క్లారిటిని పాజిటివ్‌గా మలచుకోలేకపోతున్నారనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.

వైల్డ్ కార్డు ఎంట్రీలకు ఇంట్లో వ్యతిరేకత
ఇక ఇంట్లోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో ప్రవేశించగానే కంటెస్టెంట్‌కు సభ్యుల నుంచి బలమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు సభ్యుడికి వ్యతిరేకంగా గ్యాంగ్‌గా ఏర్పడి.. వారికి ఉండే సానుకూలతపై దెబ్బ తీయడం మొదలుపెడుతున్నారు. వారిని అకారణంగా నామినేట్ చేయడంతో వారికి ప్రతికూలత ఎదురువుతున్నది.

సోషల్ మీడియాలో సపోర్ట్
ఇక బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్ ముప్పు తప్పించుకోవాలంటే.. ఇంట్లో రాణించడమే కాకుండా బయట నుంచి కూడా ఓట్లు సంపాదించేలా వ్యూహాలు చేసుకోవాలి. ఇంటిలోని చాలా మందికి సోషల్ మీడియా నుంచి బలమైన సపోర్ట్ లేకపోవడం వల్లే ప్రతిభ ఉన్న వారు ఎలిమినేషన్ ప్రక్రియలో విజయం సాధించలేకపోతున్నారనే స్పష్టమవుతున్నది. బిగ్‌బాస్‌లోకి రావడం ఒక్కటే కాదు.. సోషల్ మీడియా బ్యాకప్ ఉండాలనే అంశం ప్రధానంగా మారింది.

కుమార్ సాయి ఎలిమినేషన్‌కు కారణాలు
ఇక కుమార్ సాయికి ఎలిమినేషన్‌కు పలు కారణాలు ఉన్నాయి. ఇంటి సభ్యులతో విభేదాలు ఒకటైతే.. ఇంట్లో కుదురుకోవడానికి సమయం ఎక్కువగా తీసుకోవడం మరో సమస్యగా మారింది. తాను ఇంటి సభ్యులకు అంటీ ముట్టనట్టు ఉంటున్నారనే విషయంపైనే పలు మార్లు నామినేట్ అయ్యాడు. అయితే నామినేషన్‌లో కొన్నిసార్లు బయటపడినప్పటికీ.. సోషల్ మీడియాలో తనకంటూ సైన్యం లేకపోవడం ఎలిమినేషన్‌కు మరో కారణమని భావించవచ్చు.

సోషల్ మీడియాను బలంగా
బిగ్‌బాస్‌లో రాణించాలంటే ప్రతిభ, పాపులారిటీ అంశాలే సరిపోవనే విషయం తాజా ఎలిమినేషన్లో స్పష్టమవుతున్నది. బిగ్‌బాస్‌ను గెలువాలంటే సోషల్ మీడియాలో ఆర్మీలు, ప్రమోషన్ కార్యక్రమాలు తప్పనిసరిగా మారాయి. పలు రకాలు గ్రూపుల నుంచి ఓట్లు పడేలా ముందస్తు ప్లాన్ చేసుకొంటే తప్ప విజయం దరి చేరదనే విషయం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల విషయంలో రుజువైంది.


Click it and Unblock the Notifications











