twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న గంగవ్వ.. ఇప్పడు కుమార్ సాయి.. ఇద్దరి కోరికలు తీర్చనున్న నాగ్.. ఆ హామీ ఎమిటంటే!

    |

    టాలీవుడ్ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ‌లో ఆరోవారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇంటి నుంచి కంటెస్టెంట్ కుమార్ సాయి అనూహ్య పరిస్థితుల్లో బయటకు వెళ్లారు. అయితే ఎలిమినేషన్ తర్వాత వేదికపైకి వచ్చిన కుమార్ సాయి తన ప్రయాణాన్ని, అనుభూతులను పంచుకొన్నారు. ఈ సందర్బంగా నాగార్జునతో కుమార్ సాయి మాట్లాడుతూ..

    వైల్డ్ కార్డు ఎంట్రీగా కుమార్ సాయి

    వైల్డ్ కార్డు ఎంట్రీగా కుమార్ సాయి

    నేను వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగపెట్టిన నేపథ్యంలో నాకు కొంత సానుకూలత ఉన్నప్పటికీ దానిని క్యాష్ చేసుకోలేకపోయాను. ప్రేక్షకుల తీర్పే తుది నిర్ణయం. వారి నిర్ణయానికి ఎవరైనా తలవంచాలి. కాబట్టి ఎలిమినేషన్ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ ప్రయాణం చాలా హ్యాపీగా ఉంది అని కుమార్ సాయి అన్నారు.

    రెండు కోరికలు తీరకుండానే బయటకు

    రెండు కోరికలు తీరకుండానే బయటకు

    బిగ్‌బాస్ ఎంట్రీలోకి వెళ్లేటప్పుడు నేను మూడు కోరికలతో వెళ్లాను. అందులో ఒకటి టైటిల్ గెలవాలనే ప్రయత్నంతో వెళ్లాను. అది కుదర్లేదు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చే సమయానికి కరోనావైరస్‌కు వ్యాక్సిన్ రావాలని కోరుకొన్నాను. అది వర్కవుట్ కాలేదు. ఇక మూడో కోరిక మీకు కథ చెప్పే అవకాశం ఇవ్వాలని కోరుకొన్నాను అని కుమార్ సాయి చెప్పారు.

    నా కల నిజం చేయండి అంటూ

    నా కల నిజం చేయండి అంటూ

    నా మూడు కోరికల్లో రెండు వర్కవుట్ కాలేదు. ఇక మీకు కథ చెప్పే అవకాశం ఇవ్వాలని నేను కోరుకొంటున్నాను. ఆ అవకాశం ఇస్తే నా ప్రయత్నంతో మిమ్మల్ని మెప్పించాలని అనుకొంటున్నాను. ఒక్కసారి కథ చెప్పే అవకాశం ఇవ్వండి అని కుమార్ సాయి అనగానే.. అందుకు హోస్ట్ నాగార్జున సరే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో కుమార్ సాయి ఆనందంలో మునిగిపోయాడు.

    కుమార్ సాయికి నాగార్జున హామీ

    కుమార్ సాయికి నాగార్జున హామీ

    నాగార్జున తన కోరికకు సానుకూలంగా స్పందించడంతో కుమార్ సాయిలో ఉత్సాహం రెట్టింపయ్యింది. నేను గెలిచాను.. నేను గెలిచాను అంటూ ఆనందంలో గట్టిగా వేదికపై అరిచాడు. తన కోరికను మన్నించినందుకు థ్యాంక్స్ అంటూ కుమార్ సాయి సంతోషంలో మునిగిపోయాడు. గతంలో గంగవ్వకు కూడా ఇళ్లు కట్టిస్తానని ఆమె కోరిక తీర్చేందుకు నాగార్జున హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు కుమార్ సాయి కోరిక తీర్చడానికి నాగ్ ముందుకు రావడంపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కుమార్ సాయి ఎలిమినేటెడ్!! | Filmibeat Telugu
    వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యుల ఎలిమినేషన్

    వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యుల ఎలిమినేషన్

    కుమార్ సాయి ఎలిమినేట్ కావడంతో బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన వైల్డ్ కార్డు ఎంట్రీల కథ త్వరగానే ముగిసిపోయింది. ఇప్పటికే స్వాతి దీక్షిత్ ఇంటి నుంచి చాలా త్వరగా ఎలిమినేట్ కావడం తెలిసిందే. ఆ తర్వాత వైల్డ్ కార్డు రూపంలో ఇంటిలోకి ప్రవేశించిన కుమార్ సాయి కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. తాను ఇంట్లో కుదురుకొంటుండగానే అనూహ్య పరిస్థితుల్లో ఎలిమినేట్ కావడం గమనార్హం.

    English summary
    Bigg Boss Telugu 6 Elimination update: Host Nagaruna has given shock to contestant. He asked to Kumar Sai, Monal Gajjar to pack their bags in Elimination process. As per source, Kumar Sai was eliminated from the house. Kumar Sai eliminated. In this occassion, Nagarjuna assured to fulfill the dream of Gangavva and wild contestant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X