బిగ్‌బాస్ ట్విస్టులతో ఇంటి కెప్టెన్‌గా కుమార్ సాయి.. గంగవ్వ టాలెంట్ మాములుగా లేదుగా

బిగ్‌బాస్ ఇంటిలో 24, 25వ రోజు వినోదం, విభేధాలతో సాగిపోయింది. కెప్టెన్సీ టాస్క్ గేమ్స్‌తో ఇల్లంతా సందడిగా మారిపోయింది. కెప్టెన్సీ టాస్కుల విషయంలో బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టులకు ఇంటి సభ్యులు చిత్తయిపోయారు. సుజాత, మాస్టర్, కుమార్ సాయి, హారిక అనూహ్యంగా కెప్టెన్సీ టాస్క్‌లోకి వచ్చారు. కెప్టెన్సీ రేసులో బెర్త్ కన్ఫార్మ్ అనుకొన్న సోహైల్, మెహబూబ్‌కు షాక్ తగిలింది. 24, 25 రోజల్లో ఇంట్లో జరిగిన విషయాలు వివరంగా..

కెప్టెన్సీ టాస్కులో బిగ్‌బాస్ ట్విస్టు

కెప్టెన్సీ టాస్కులో బిగ్‌బాస్ ట్విస్టు

బిగ్‌బాస్ ఇంటిలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ గేమ్‌లో అనేక ట్విస్టులు చోటుచేసుకొన్నాయి. కెపెన్సీ టాస్క్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన మెహబూబ్, సోహైల్‌కు బిగ్‌బాస్ ఝలక్ ఇచ్చారు. జోర్దార్ సుజాత్ చేతిలో ఉన్న స్విచ్ కార్డ్ అస్త్రం అందరికి ట్విస్టు ఇచ్చింది. స్విచ్ కార్డును ఏ ఇంటి సభ్యుడితోనైనా మార్పిడి చేసుకోవచ్చనే బిగ్‌బాస్ ఆదేశాలు సుజాతకు, ఇతర ఇంటి సభ్యులకు కలిసి వచ్చింది. అత్యధిక పాయింట్లు ఉన్న మెహబూబ్‌తో స్విచ్ కార్డు మార్పిడి చేసుకోవడంతో అత్యధిక పాయింట్లు ఉన్న ప్లేయర్‌గా సుజాత మారిపోయింది.

కెప్టెన్సీ రేసులోకి ఆ నలుగురు

కెప్టెన్సీ రేసులోకి ఆ నలుగురు

మెహబూబ్ అత్యధిక పాయింట్లు కోల్పోవడంతో సుజాత, అమ్మా రాజశేఖర్ మాస్టర్, దేత్తడి హారిక, కుమార్ సాయి కెప్టెన్సీ టాస్క్‌ రేసులోకి వచ్చారు. బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టుపై ఇంటి సభ్యుల మధ్య చర్చ భారీగా జరిగింది. ఇంటి సభ్యులు తమ వ్యూహాల గురించి మాట్లాడుకొన్నారు. సోహైల్ మధ్య అమ్మ రాజశేఖర్ మాటల యుద్ధం చోటుచేసుకొన్నది.

కెప్టెన్‌గా కుమార్ సాయి

కెప్టెన్‌గా కుమార్ సాయి

ఇక కెప్టెన్సీ ఎంపిక కోసం టాస్క్ రెడీ చేశారు. ఇంటి బయట బురద కుంటలో కిల్లర్ పాయింట్స్ కాయిన్ ఉంటాయి. బురద నుంచి ఎక్కువగా ఎవరు తీస్తారో వారు ఇంటి కెప్టెన్ అవుతారు అని గేమ్స్ రూల్స్ చెప్పారు. బెల్ మోగగానే బురదలోకి దిగి కాయిన్స్ వెతికే ప్రయత్నం చేశారు. చివరకు అత్యధిక పాయింట్లు సాధించిన కుమార్ సాయి కెప్టెన్‌ అయినట్టు ప్రకటించారు. కెప్టెన్ కోసం రిస్ట్ బ్యాండ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతేకాకుండా కెప్టెన్ అయినందున ఎలిమినేషన్ నుంచి మినహాయించినట్టు ప్రకటించారు.

సరదాగా ముచ్చట్లలో ఇంటిసభ్యులు

సరదాగా ముచ్చట్లలో ఇంటిసభ్యులు

కెప్టెన్సీ టాస్క్ పూర్తయిన తర్వాత ఇంటి సభ్యులు రిలాక్స్ అయ్యారు. కొందరు సరదాగా ముచ్చట్లలో మునిగిపోయారు. గంగవ్వ ఇంటి సభ్యులు చేయాల్సిన పనులను పురమాయించారు. అలాగే ఒకరిపై మరొకరు జోకులు వేసుకొంటూ కనిపించారు. స్వాతితో ముచ్చటపెడుతున్న అఖిల్‌ను ఆటపట్టిస్తూ ఇంటి సభ్యులు కనిపించారు.

Recommended Video

Bigg Boss Telugu 4: Devi Nagavalli On Marriage
భవిష్యవాణి చెప్పిన గంగవ్వ

భవిష్యవాణి చెప్పిన గంగవ్వ

ఇక చివర్లలో గంగవ్వ తన టాలెంట్‌ను ప్రదర్శించారు. దేవత పూనినట్టు గంగవ్వ నటించారు. పడక మీద పడుకొనే ఇంటి సభ్యులకు భవిష్యవాణిని చెప్పారు. ప్రతీ ఒక్కరి జాతకాలు చెబుతూ ఇంటి సభ్యులను నవ్వించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అమ్మా రాజశేఖర్ సినిమా తీస్తాడు అంటూ ఓ రిథమ్ ప్రకారం భవిష్యవాణిని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X