Kumari Aunty బిగ్ బాస్ స్టేజ్‌పై కుమారి ఆంటీ: అక్కడ కూడా అదే పని.. వీడియో వైరల్

కుమారి ఆంటీ.. కుమారి ఆంటీ.. కుమారి ఆంటీ.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయిన పేర్లలో ఇది ఒకటి. అంతలా ఆమె సోషల్ మీడియా పుణ్యమా అని పాపులర్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో భోజనం వ్యాపారం చేసుకుంటోన్న ఈమె.. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లి సెన్సేషన్‌గా మారారు. ఫలితంగా ప్రధాన వార్తా సంస్థల్లో హెడ్‌లైన్ అవడంతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయారు. అలాంటి కుమారి ఆంటీ ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ స్టేజ్‌పై దర్శనమిచ్చారు. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

సామాన్యులను కూడా సెలెబ్రిటీలుగా మార్చే సాధనమే సోషల్ మీడియా. దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది ప్రముఖులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఇటీవలే హైదరాబాద్‌లో భోజనం వ్యాపారం చేసే కుమారి ఆంటీ కూడా ఫుల్ ఫేమస్ అయ్యారు. దీంతో ఆమె కోసం యూట్యూబ్ ఛానెళ్లు ఎగబడడంతో ఆ హోటల్ ముందు ట్రాఫిక్ జామ్ అవడం.. పోలీసులు వాళ్లకు షాక్ ఇవ్వడం.. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుగజేసుకుని కుమారి ఆంటీకి పర్మీషన్ ఇవ్వడం జరిగాయి. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది.

Kumari Aunty Attends and Gives Lunch to Celebrities in Bigg Boss Utsavam Event

సామాన్య వ్యాపారి అయిన కుమారి ఆంటీ ఇప్పుడు బిగ్ సెలెబ్రిటీగా మారిపోయారు. దీంతో ఆమెకు బుల్లితెర నుంచి, వెండితెర నుంచి ఎన్నో రకాల అవకాశాలు కూడా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కుమారి ఆంటీ ఏకంగా బిగ్ బాస్ స్టేజ్‌పైనే దర్శనమిచ్చారు. 'బీబీ ఉత్సవం' అనే టైటిల్‌తో ప్రసారం కాబోతున్న ఓ స్పెషల్ ఈవెంట్‌కు ఆమె గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా ఏడో సీజన్‌లోని కంటెస్టెంట్లతో కలిసి కుమారి ఆంటీ తెగ సందడి చేశారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kumari Aunty Attends and Gives Lunch to Celebrities in Bigg Boss Utsavam Event

అంతేకాదు, 'బీబీ ఉత్సవం' షోలో ఆమె తన అనుభవాలను పంచుకోవడంతో పాటు తనతో పాటు తెచ్చుకున్న ఫుడ్‌ను బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వడ్డించారట. ఈ విషయాన్ని తాజాగా వచ్చిన వీడియోలో యాంకర్ శ్రీముఖి వెల్లడించింది. 'మా ఈ బీబీ ఉత్సవంలో మా అందరికీ కడుపు నిండా తిండి పెట్టిన కుమారి ఆంటీకి థ్యాంక్స్' అని ఆమె చెప్పింది. మొత్తానికి కుమారి ఆంటీ త్వరలోనే బుల్లితెరపైన కూడా కనిపించి సందడి చేయబోతున్నారు. దీంతో ఆమె రేంజ్ మరింతగా పెరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X