Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి కుమారి ఆంటీ.. పవన్ కల్యాణ్‌నే నమ్ముకొంటున్న వంటలక్క!

By Lekhaka

కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు అనే మాట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సరిగ్గా సరిపోద్ది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఆయన పేరు చెప్పుకొని సినిమా ప్రమోషన్లు చేసుకునే యువ హీరోలు చాలా మందే ఉన్నరు. ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే చాలు అనుకునే దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు, కమెడియన్లు కలలు కంటుంటారు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మనకు తెల్వనిదేం కాదు. కానీ ఇప్పుడా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. బిగ్ బాస్-8 సీజన్ లో కంటెంస్ట్ గా పాల్గొంటున్న కుమారీ ఆంటీ పవన్ కల్యాణ్ ఫోటోతో అప్పుడే ప్రచారం మొదలు పెట్టింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓటేస్తే తాను టైటిల్ గెలుచుకోవచ్చని పెద్ద స్కెచ్చే వేసింది ఆంటీ.

బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసి కంటెస్టెంట్స్ జాబితా సిద్ధం చేశారు. లాస్ట్ మినిట్ లో మార్పు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉందని టాక్. ఈ సీజన్ లో కుమారీ ఆంటీ పాల్గొంటుంది. అదేనండీ "రెండు లివర్లు ఎక్స్ ట్రా... నీది పన్నెండు వదలు నాన్నా" అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది కదండీ ఆ ఆంటీ. బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ లో ఉంటుందా? హౌస్ లోకి వెళ్తుందా? లేదా అనేది క్లారిటీ రాకముందే ఓ అడుగు ముందుకేసిందీ ఆంటీ. ఏకంగా పవర్ స్టార్ ఫోటోతో ప్రచారం మొదలు పెట్టేసింది.

kumari aunty bigboss season8 campaign with pawan kalyan photo

స్ట్రీట్ ఫుడ్ తో ఫేమస్ అయిన కుమారీ అంటీ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది. ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. మా టీవీలో కామెడీ షోలకు గెస్ట్ గా కూడా వెళ్లింది అంటే ఎంత ఫేమ్ అయిందో తెలుస్తోంది. అందుకే ఆమెను బిగ్ బాస్ యాజమాన్యం గెస్ట్ గా ఎంపిక చేసింది. ఆమె ఎన్ని రోజులు ఉంటదనేది తర్వాత విషయం. కానీ బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటే హౌస్ లో చేసే పార్టిసిపేషన్ తో పాటు ఆడియెన్స్ వేసే ఓట్లు కూడా కీలకం. అందుకే ఆమె ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టింది.

బేసిగ్గా ఆమె పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయినప్పటికీ.. ఇప్పుడు ఇంకాస్త్ డోస్ పెంచింది. ఇంట్లో పవన్ కల్యాణ ఫోటో పెట్టుకోని ఏ ఇంటర్వ్యూలోనైనా క్లారిటీగా కనబడేట్టు జాగ్రత్తలు తీసుకుటోంది. పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తనకు తోడైతే ఇక తిరుగుండదని గట్టి నమ్మకంతో ఉంది కుమారీ ఆంటీ. ఇప్పటికే పవన్ కల్యాణ్ సక్సెస్ రేట్ ఏంటో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వందశాతం విన్నింగ్ రేట్ ఎంత వరకు దేశంలో ఏ పార్టీ సాధించలేదు. అది పవన్ కల్యాణ్ స్టామినా.. అందుకే కుమారీ ఆంటీ పెద్ద స్కెచ్చే వేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

kumari aunty bigboss season8 campaign with pawan kalyan photo

భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి బుల్లితెర సెలెబ్రిటీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. సీరియల్ నటి తేజస్విని, యాంకర్ వింద్యా, విష్ణుప్రియ భీమనేని, శ్వేతా నాయుడు, అంజలి, బుల్లితెర స్టార్ ఇంద్రనీల్ వర్మ, కమెడియన్ సద్దాం, సీరియల్ హీరో శివ కుమార్‌, టాలీవుడ్ సీనియర్ హీరో వినోద్ కుమార్, మై విలేజ్ షో అనిల్, తెలుగు హీరోయిన్ కుషిత కల్లాపు, సుప్రిత, యూట్యూబర్ శీతల్ గౌతమ్, సీనియర్ నటి సన, మోడల్ ఊర్మిళ చౌహాన్, యూట్యూబర్ యువ సామ్రాట్, కమెడియన్ బబ్లూ హౌస్ లోకి వెళ్తారని టాక్.

More from Filmibeat

Read more about: kumari aunty bigboss pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X