Kumari Aunty: టీవీ షోలే కాదు సీరియల్స్‌లోకీ కూమారి ఆంటీ.. ఎందులో కనిపిస్తుందో తెలుసా?

కుమారి ఆంటీ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో చాలా ఫేమస్ అయిందీ మహిళ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు మారుమోగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల ఫుల్ ఫేమస్ అయిన ఈమె అనేక సమస్యలు ఎదుర్కుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో సమస్యలు తొలగ్గా.. చాలో సంతోషంలో ఉంది. అయితే వరుసగా టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేసిన ఈమె.. తాజాగా సీరియల్స్ లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈమె ఏ సీరియల్ లో కనిపించిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యానా ప్రతీ ఒక్కరూ సెలబ్రిటీలు అయిపోతున్నారు. ముఖ్యంగా అనేక మంది నెట్టింట వైరల్ అవుతూ.. తెగ పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలాంటి వాళ్లలో ఒకరే ఈ కుమారీ ఆంటీ. అయితే హైదరాబాద్ లో భోజనం వ్యాపారం చేసుకుని జీవించే ఈమె.. చాలా ఫేమస్ అయింది. ఇలా యూట్యూబర్స్, న్యూస్ ఛానెళ్ల వాళ్లు అంతా ఆమె వద్ద ఇంటర్వ్యూలు తీసుకుంటూ మరింత హైలెట్ చేశారు. దీంతో ఆమె వద్దకు వచ్చే కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

Kumari Aunty Started Acting in Telugu Famous Serial Check Full Details

ఇలా రోడ్డుపై అమ్ముకోవడం, జనాలు ఎక్కువవడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఆమె అక్కడ భోజనం అమ్మడానికి వీళ్లేదంటూ పోలీసులు తేల్చి చెప్పడం.. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో ఆమెకు మళ్లీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఓ వారం రోజుల పాటు సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమెను ఆ తర్వాత టీవీషోలలో తీసుకు వచ్చారు. ముఖ్యంగా బీబీ ఉత్సవంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈమెతో డైలాగ్స్ చెప్పించి రచ్చ చేశారు.

అయితే టీవీ షోలలో కనిపించి మరింత సందడి చేసిన ఈ కుమారీ ఆంటీ తాజాగా సీరియల్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా జీ తెలుగులో వచ్చే రాజేశ్వరి విలాస్ సీరియల్ లో కుమారీ ఆంటీ కనిపించింది. భలే భలే డైలాగులు చెబుతూ.. తనలోని యాక్టింగ్ టాలెంట్ ను కూడా బయటకు తీసింది. ముఖ్యంగా ఈ సీరియల్ లో హీరోయిన్... కుమారీ ఆంటీకీ హెల్ప్ చేసినట్లు చూపించారు. ఆమె షుగర్ డౌన్ అయి పడిపోగా.... హీరోయిన్ చేసిన హల్వా తిని ప్రాణాలు కాపాడుకున్నట్లు చెబుతుంది.

ఆహారం అంటే కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా ఉండాలి అంటూ హితవు పలికింది. ఆమె ఫుడ్ బిజినెస్ చేయడం.. అందులో ఫుడ్, హోటల్స్ కు సంబంధించిన సీరియల్ లో ఈమెను చూపించడంతో అంతా ఫిదా అయిపోతున్నారు. బుల్లితెరపై ఈమెను చూసి... హేయ్ కుమారీ ఆంటీ, కుమారీ అంటీ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇలాగే క్రేజ్ కొనసాగితే ఫుడ్ బిజినెస్ మానేసి... సినిమాలు, సీరియల్స్, యూట్యూబ్ లో ఛానెల్ పెట్టి మరింత సంపాదించేలా ఉందీ ఆంటీ. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X