twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో: ఎన్టీఆర్‌పై ముద్దుల వర్షం కురిపించిన హీరోయిన్.. క్రేజీ కోరికను బయటపెట్టేసింది.!

    By Manoj
    |

    జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరు. నందమూరి కుటుంబం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన ఈ టాలెంటెడ్ హీరో.. కెరీర్ ఆరంభంలోనే సూపర్ హిట్ చిత్రాల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. 19 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ ఏమాత్రం నిరాశకు గురి కాలేదు. ఇక, 'టెంపర్' తర్వాత అతడు వరుస విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్‌పై ఓ సీనియర్ హీరోయిన్ ముద్దుల వర్షం కురిపించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.? ఎందుకిలా చేసింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

    నాలుగో సినిమా చేస్తున్నారు

    నాలుగో సినిమా చేస్తున్నారు

    జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR'లో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజమౌళి.. తారక్ కాంబోలో ఇప్పటికే మూడు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.

    మన్యంలో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్

    మన్యంలో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్

    ఈ సినిమాలో తారక్.. కొమరం భీంగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం అతడు ఎన్నో ప్రయత్నాలే చేశాడు. ముఖ్యంగా మంచి ఫిజిక్ సాధించేందుకు హాలీవుడ్ ట్రైనర్ ద్వారా జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేశాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌లో పాల్గొన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం విశాఖపట్నంలోని మన్యంలో జరుగుతున్న షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు.

    ఎన్టీఆర్‌పై హీరోయిన్ ముద్దుల వర్షం

    ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న ‘అలీతో సరదాగా' అనే ప్రోగ్రామ్‌కు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు. అలాగే, తెలుగులో తనకు ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో చూడగానే.. అందరి ముందే అతడిపై ముద్దుల వర్షం కురిపించారు. అంతేకాదు, తారక్ పాటకు కేకలు వేస్తూ డ్యాన్స్ చేశారు.

     క్రేజీ కోరికను బయట పెట్టేసింది

    క్రేజీ కోరికను బయట పెట్టేసింది

    ఖుష్బూకు తమిళంలో అరవింద స్వామి, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చాలా సార్లు వెల్లడించారు. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తారక్ గురించి మాట్లాడుతూ.. ఆయన సినిమాలంటే విజిల్ వేస్తూ ఎంజాయ్ చేస్తానని వెల్లడించారు. అంతేకాదు, ఆ సమయంలో ‘తారక్ గారు.. నాకో ఆటోగ్రాఫ్ ఇవ్వండి ప్లీజ్' అని క్రేజీగా కోరారు.

    ఇద్దరూ కలిసి ఆ సినిమా చేశారు

    ఇద్దరూ కలిసి ఆ సినిమా చేశారు

    ఖుష్బూ తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత చాలా కాలం పాటు తెలుగు తెరకు దూరమైన ఈమె.. ‘స్టాలిన్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘యమదొంగ'లో మోహన్ బాబు భార్యగా నటించారు. అప్పుడు తారక్ నటనను దగ్గర నుంచీ చూసిన ఈమె.. ముగ్ధురాలు అయిపోయారు.

    English summary
    Khushbu Sundar is an Indian film actress, producer and television presenter who has acted in more than 200 movies. She is predominantly known for her work in the South Indian film industry. She has received two Tamil Nadu State Film Awards for Best Actress and one Kerala State Film Award – Special Mention.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X