డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. యువ హీరోయిన్ సోదరి అదృశ్యం
హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ట్విస్టు కీలకంగా మారింది. ఈ కేసులో తన సోదరి పేరు వెలుగు చూసిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందని నటి, ఇన్స్‌టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కుషితా కల్లాపు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో లిషితా గణేష్ అదృశ్యం కావడం మీడియా, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కుషితా కల్లాపు ఫిర్యాదు చేసిన వివరాల్లోకి వెళితే..
ఇటీవల హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ వ్యవహారాన్ని తెలంగాణ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో సినీ ప్రముఖులు కూడా పాల్గొనడం అందర్నీ షాక్ గురిచేసింది. అయితే ఈ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో కుషితా కల్లాపు సిస్టర్స్ పట్టుపడ్డారు. అయితే తాము బజ్జీలు తినడానికి వచ్చామని చెప్పడం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

అయితే డ్రగ్స్ కేసులో కుషితా కల్లాపు సోదరి లిషితా గణేష్ పేరును కూడా చేర్చారు. ఈ కేసులో అరోపణలు ఎదుర్కొంటున్నప్పటీ నుంచి ఆమె ఆచూకీ మిస్టరీగా మారింది. ఆమె అదృశ్యం కావడం కుటుంబ సభ్యులను కలవరానికి గురిచేసింది. కొద్ది రోజులుగా లిషితా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆమె సోదరి కుషితా ఆశ్రయించారు.
తెలంగాణ పోలీసులను ఆశ్రయించిన కులితా కల్లాపు తన సోదరి లిసితా మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశారు. తన సోదరి ఆచూకీ తెలుసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లిషితా కనిపించకపోవడం ఆందోళనగా ఉందని వెల్లడించారు. అయితే ఫిర్యాదు అందుకొన్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బహుశా కేసు నమోదు నేపథ్యంలో ఆమె ఎక్కడో తలదాచుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు క్రిష్ పేరును కూడా A8 గా చేర్చారు. ఆయన కూడా విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్నట్టు తెలుస్తున్నది. మార్చి 1వ తేదీన ఈ కేసులో విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇలా అనేక ట్విస్టులతో డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతున్నది.


Click it and Unblock the Notifications











