For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మాయిని వేధిస్తున్న జబర్ధస్త్ టీమ్ లీడర్: రాజీవ్ కనకాల షోలో గొడవ.. స్టేజ్ మీదే కమెడియన్‌పై దాడి

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న షోలలో జబర్ధస్త్‌ది ప్రత్యేకమైన స్థానం. దీనికి కారణం ఇది దాదాపు ఎనిమిదేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంతో పాటు ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేయడమే. ఈ షో ద్వారా వచ్చిన వాళ్లలో చాలా మంది బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో వెంకీ ఒకడు. చాలా కాలంగా ఇందులో సందడి చేస్తోన్న ఈ కమెడియన్.. తాజాగా అమ్మాయిని వేధిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు, ఏకంగా షోలోనే అతడిపై యువతి తరపు వాళ్లు దాడి చేశారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఎంట్రీ

  అలా మొదలైన కెరీర్.. ఇలా ఎంట్రీ

  మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించాడు వెంకీ. ఇలా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఈవెంట్లలో తనదైన శైలి కామెడీతో ఆకట్టుకున్నాడు. తద్వారా ఎనలేని గుర్తింపును అందుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరును కూడా సంపాదించుకున్నాడు. ఇలా సాగిపోతోన్న వెంకీకి కొందరు టీమ్ లీడర్ల ద్వారా జబర్ధస్త్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అలా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు.

  సత్తా చాటిన వెంకీ... టీమ్ లీడర్‌గా

  సత్తా చాటిన వెంకీ... టీమ్ లీడర్‌గా

  సాదాసీదా ఆర్టిస్టుగా జబర్ధస్త్‌లోకి ప్రవేశించిన వెంకీ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు. తనదైన శైలి పంచులు, ప్రాసలతో పాటు మిమిక్రీని ప్రధాన బలంగా మార్చుకుని అదరగొట్టేశాడు. దీంతో ఎన్నో స్కిట్లు కొట్టడంలో ప్రధానమైన పాత్రను పోషించాడు. ఫలితంగా షో నిర్వహకుల మన్ననలు అందుకుని టీమ్ లీడర్‌గా ప్రమోషన్‌ను అందుకున్నాడు.

  అలాంటి స్కిట్లతో పాపులరైన వెంకీ

  అలాంటి స్కిట్లతో పాపులరైన వెంకీ

  టీమ్ లీడర్ అయిన తర్వాత వెంకీ వెనుదిరిగి చూసింది లేదు. కన్‌ఫ్యూజింగ్ స్కిట్ల స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన అతడు.. ఎన్నో సార్లు బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డును అందుకున్నాడు. తద్వారా జబర్ధస్త్‌లోని బెస్ట్ టీమ్ లీడర్లలో వెంకీ ఒకడిగా నిలుస్తున్నాడు. ఇక, యూట్యూబ్‌లో సైతం అతడి స్కిట్లకు మంచి ఆదరణ దక్కుతోంది. ఫలితంగా ఈ కమెడియన్ ఎంతగానో ఫేమస్ అయ్యాడు.

  రాజీవ్ కనకాల షోలోకి ఎంట్రీ ఇచ్చి

  రాజీవ్ కనకాల షోలోకి ఎంట్రీ ఇచ్చి

  మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇటీవల ‘రెచ్చిపోదాం బ్రదర్' అనే షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలో జబర్ధస్త్ కమెడియన్లు సందడి చేస్తున్నారు. వీళ్లతో పాటు స్టూడెంట్స్ కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ షోలోనే వెంకీ కూడా స్కిట్లు చేస్తున్నాడు. వాటికి సైతం మంచి ఆదరణ దక్కుతుందనే చెప్పాలి.

  అమ్మాయిని వేధిస్తున్న కమెడియన్

  అమ్మాయిని వేధిస్తున్న కమెడియన్

  జబర్ధస్త్‌లో స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతోన్న వెంకీ.. వివాదాలకు దూరంగా ఉంటాడన్న పేరు ఉంది. స్కిట్లను కూడా ఎవరి మనోభావాలూ దెబ్బ తినకుండా రాసుకొస్తాడు. అందుకే అతడు పెద్దగా విమర్శల పాలవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జబర్ధస్త్ కమెడియన్ వెంకీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఈ టీమ్ లీడర్‌పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి.

  రాజీవ్ కనకాల షోలో పెద్ద వాగ్వాదం

  రాజీవ్ కనకాల షోలో పెద్ద వాగ్వాదం

  ఈరోజు ప్రసారం అయ్యే ‘రెచ్చిపోదాం బ్రదర్' ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. జడ్జ్ రాజీవ్ కనకాల ముందరే వాళ్లంతా గొడవకు దిగారు. వాళ్లతో పాటు సదరు యువతి కూడా అక్కడకు వచ్చింది. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్యలో పెద్ద వాగ్వాదం జరిగింది. ఇదంతా ప్రోమోలో చూపించారు.

  అమ్మాయి ముందే వెంకీ మీద దాడి

  అమ్మాయి ముందే వెంకీ మీద దాడి

  ఇక, ఈ ఘర్షణలో కొందరు వ్యక్తులు వెంకీపై దాడికి దిగినట్లు కనిపిస్తోంది. బూతులు కూడా మాట్లాడడంతో బీప్ వేశారు నిర్వహకులు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది ఓ ప్రాంక్ వీడియో అని తెలుస్తోంది. షో నిర్వహకుల పర్మీషన్ తీసుకునే ఇది చేసినట్లు కూడా తెలిసింది. ఇది తెలియని వెంకీ తెగ కంగారు పడిపోయాడట.

  English summary
  Jabardasth Venky Is One Of The Best Comedian in Jabardasth Show. Now A Lady Harassment Allegations on him in Rechipodam Brother Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X