Bigg Boss Elimination: బిగ్ బాస్‌లో వాళ్లకే అన్యాయం.. పాపం ఐదుగురు బలి.. ఇండియాలో ఇదో చెత్త రికార్డు

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇందులో ఎన్నడూ చూడని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు కనిపించడంతో దీనికి ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. దీంతో వరుసగా సీజన్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో దాన్ని మొదలెట్టారు. ఇందులో ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. దీంతో లేడీస్ విషయంలో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఆ వివరాలు మీకోసమే!

ఒక దానికి మించి మరొకటి హిట్:బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఎన్నో అనుమానాల మధ్య తెలుగులోకి వచ్చింది. అసలు ఇలాంటి వాటిని మన వాళ్లు ఎంకరేజ్ చేస్తారా? ఇక్కడ ఇది క్లిక్ అవుతుందా? ఇలా అనుకుంటోన్న పరిస్థితుల్లో ఈ షోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఏడోది కూడా ప్రారంభం అయింది.

Lady Contestants Eliminated in Bigg Boss Telugu Seasons in First Week

ఉల్టా పుల్టా.. ఆమె ఎలిమినేషన్:గత సీజన్ల కంటే సూపర్ సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో సెప్టెంబర్ 3వ తేదీన ఏడో సీజన్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని సర్‌ప్రైజ్‌లు, టాస్కులు, ట్విస్టులతో కూడిన కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఇక, ఈ సీజన్ మొదటి వారం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో కిరణ్ రాథోడ్‌ ఎలిమినేట్ అయింది.

కిరణ్ వెళ్లడంతో కొత్త చర్చలు:తెలుగు బిగ్ బాస్ షోలో (ఓటీటీ వెర్షన్ మినహా) ఇప్పటి వరకూ లేడీ కంటెస్టెంట్లు విజేతలుగా నిలవలేదు. అంతేకాదు, నిన్నటి ఎపిసోడ్ వరకూ మొత్తం ఏడు సీజన్లలో మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే.. ఐదుగురు లేడీ కంటెస్టెంట్లే మొదటి వారం ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఆడవాళ్లకు బిగ్ బాస్ షోలో అన్యాయం జరుగుతుందని ఓ చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

Lady Contestants Eliminated in Bigg Boss Telugu Seasons in First Week

ఏ సీజన్‌లో ఎవరు వెళ్లారంటే:బిగ్ బాస్ మొదటి సీజన్‌లో జ్యోతి, రెండో సీజన్‌లో సంజన, మూడో సీజన్‌లో హేమ, ఐదో సీజన్‌లో సరయు రాయ్, ఏడో సీజన్‌లో కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక, నాలుగో వారంలో సూర్య కిరణ్ మాత్రమే మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. అలాగే, ఆరో సీజన్‌లో మొదటి వారంలో ఎలిమినేషన్ అస్సలు జరగలేదు. అంటే మెజారిటీ లేడీస్‌ వెళ్లిపోయారు.

Lady Contestants Eliminated in Bigg Boss Telugu Seasons in First Week

ఇండియాలోనే చెత్త రికార్డుగా:బిగ్ బాస్ తెలుగులో మాత్రమే ఫస్ట్ వీక్‌లో ఎక్కువ మంది లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇండియాలోని ఏ భాషలో చూసుకున్నా ఇంత మెజారిటీ సంఖ్యలో ఫీమేల్ కంటెస్టెంట్ల ఎలిమినేషన్స్ జరగలేదట. దీంతో తెలుగు బిగ్ బాస్ షోలో చెత్త రికార్డు నమోదు అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేయాలని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X