Lahari Shari ఒక రోజంతా జెట్ ఫ్లైట్‌లో నాగార్జునతో.. నా కల నిజమైందంటూ బిగ్‌‌బాస్ బ్యూటీ పోస్ట్

నటి లహరి షారి ఇటీవల నాగార్జున మరియు నాగ చైతన్యతో ఒక రోజంతా గడిపే అవకాశాన్ని పొందింది. సోషల్ మీడియాలో తన ఈ విషయాన్ని ఆమె స్వయంగా పంచుకుంది. అసలు ఆమె ఎందుకు వారితో రోజంతా గడిపింది? అనే వివరాల్లోకి వెళితే

లహరి షారి

లహరి షారి

బిగ్ బాస్ ఐదో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న లహరి షారి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి, ఆమె యాంకర్ గా మోడల్ గా కూడా పని చేస్తున్నారు. అయితే ఆమె ప్రధానంగా తెలుగు పరిశ్రమలో పేరు తెచ్చుకోవడానికి చూస్తున్నారు. ఆమె జూన్ 5, 1995న తెలంగాణ హైదరాబాద్లో జన్మించింది. 2014లో, లహరి 'సారీ నాకు పెళ్లైంది' సినిమాతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత 2016 లో, ఆమె ఈటీవీ తెలుగులో 'సెలబ్రేషన్స్' షోతో టెలివిజన్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది.

పేరు, గుర్తింపు పొంది

పేరు, గుర్తింపు పొంది

తరువాత, లహరి షారి 'మహా' న్యూస్ ఛానెల్‌లో చేరారు మరియు 2017 నుంచి 2019 వరకు అందులో పనిచేశారు. ఈ సమయంలో ఆమె మంచి పేరు, గుర్తింపు పొందింది. ఆమె తదుపరి స్టూడియో ఎన్ న్యూస్ అనే ఒక న్యూస్ ఛానెల్‌లో 2019 లో క్రియేటివ్ హెడ్‌గా చేరింది. అదే సమయంలో, లహరి అర్జున్ రెడ్డి (2017), మళ్ళీ రావా (2017), పటేల్ SIR (2017), అజ్ఞాతవాసి (2018), పేపర్ బాయ్ (2018), శ్రీనివాస కళ్యాణం (2018), U (2018) కథే హీరో వంటి వివిధ సినిమాల్లో కూడా కనిపించారు. ఆ తరువాత ఆమె తిప్పరా మీసం (2019), మరియు జోంబీ రెడ్డి (2021), చెక్(2021) వంటి సినిమాల్లో కూడా కనిపించారు.

సర్వత్రా ఆసక్తి

సర్వత్రా ఆసక్తి


ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆమె చాలా హుషారుగా కనిపించింది కానీ అనూహ్యంగా ఆమె ఎలిమినేట్ అయి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆమె తాజాగా నాగార్జున, నాగచైతన్య ను కలిసినట్లు ప్రకటించింది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగార్జున మరియు నాగ చైతన్య కలిసి వెండితెర కనిపించిన సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ప్రమోషన్స్ లోనే

ఈ సినిమా ను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను సినిమా యూనిట్ వేగవంతం చేయనుంది. నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి లు ప్రమోషన్స్ లో పాల్గొననున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే వీరంతా ఒక స్పెషల్ ప్రయివేట్ జెట్ లో ఎక్కడికో వెళుతున్నట్టు చూపించారు. అయితే ఈ ప్రమోషన్స్ లోనే లహరికి హోస్ట్ గా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

కలలు నిజమవుతాయి

కలలు నిజమవుతాయి


ఈ క్రమంలోనే లహరి అక్కినేని నాగచైతన్య, నాగార్జునతో కలిసి ఉన్న ఫోటో పంచుకుంటూ "కలలు నిజమవుతాయి. 7 జనవరి 2022 ఆ కల నాకు నిజమైంది.. మీలాంటి అద్భుతమైన వ్యక్తులతో రోజంతా గడపడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగార్జున సర్ & చై సార్ ధన్యవాదాలు. మీరు నా రోజును ప్రేమ పూర్వకంగా మార్చారు.."అని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X