యాంకర్ రవితో వీడియో పోస్ట్ చేసి.. వెంటనే డిలీట్ చేసిన లహరి.. కారణం అదేనా?
బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామరస్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన లహరి షరీ ఓ వర్గం వారి నుంచి క్రేజ్ బాగానే అందుకుంది. తప్పకుండా ఆమె తన గ్లామర్ తోనే ఎక్కువ రోజులు కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని తొందరగానే ఎలిమినెట్ అయ్యింది. ఇక రవితో ఆమెకు గొడవలు ఏ రేంజ్ లో అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల అతనితో వీడియో పోస్ట్ చేసిన లహరి వెంటనే ఆమె డిలీట్ చేసింది.

హాట్ ఎంట్రీ..
హాట్ డ్యాన్స్ తోనే బిగ్ బాస్ సీజన్ 5 లోకి బ్యూటీఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన లహరి హోస్ట్ నాగార్జున మనసుతో పాటు ప్రేక్షకుల మనసును కూడా దోచేసుకుంది. ఇక హౌస్ లో తప్పకుండా ఆమె టాప్ 5 వరకు కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. ఇక ఆమె కొంతమందితో ప్రత్యేకంగా లవ్ ట్రాక్ కూడా కొనసాగించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ వచ్చింది.

రవితో స్నేహం..
అయితే లహరి చేసిన కొన్ని పొరపాట్లు ఆమెను ఎలిమినెట్ అయ్యేలా చేశాయి. హౌస్ లో ఉన్న కొంతమంది బ్యాచిలర్స్ తో ఆమె కెమిస్ట్రీ బాగానే కొనసాగించింది. కానీ ఊహించన విదంగా యాంకర్ రవితో చేసిన స్నేహం ఆమెను డేంజర్ జోన్ లో పడేసింది. ముఖ్యంగా ప్రియతో జరిగిన వివాదం ఆమె స్థానాన్ని మార్చేశాయి.

ప్రియ దారుణమైన కామెంట్స్
లహరిపై ప్రియ చేసిన విమర్శలు అన్ని ఇన్ని కావు. ఒక్కో రోజు ఒక్కో అబ్బాయితో ఉంటోంది అని రవితో కూడా కెమిస్ట్రీ నడుస్తోందని విమర్శలు గట్టిగానే చేసింది. ఇక లహరి ఆ కామెంట్స్ ను సరిగ్గా ఉపయోగించుకోలేక పోయింది. కరెక్ట్ గా ఆ కామెంట్స్ ను ఎమోషనల్ గా వాడుకొని ఉండి ఉంటే మరో రకంగా సేవ్ అయ్యి ఉండేదెమో అనే కామెంట్స్ వచ్చాయి.

అందువల్లే ఎలిమినేట్..
ఏదేమైనా కూడా రవి కారణంగా ప్రియ బిగ్ బాస్ ఎలిమినేట్ అయ్యిందని అందరికి తెలిసిన సత్యం. అయితే రవి కూడా ఇటీవల ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే మొదటిసారి ఈ కంటెస్టెంట్స్ బయట విభిన్నంగా కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె క్లివేజ్ షోతో షాక్ ఇచ్చింది.

రవితో వీడియో స్పెషల్ వీడియో
అయితే వీడియోలో ఇద్దరు కూడా చాలా సరదాగా కనిపించారు. మేము కలిసినందుకు చాలామందిలో ఎన్నో అనుమానాలు మొదలై ఉంటాయని ఇక మేము వాటికి ఆన్సర్ ఇవ్వమని అంటూ రవి చెప్పాడు. అనంతరం రవి ఫ్రెండ్స్ అంటూ చెప్పగా లహరి మళ్ళీ లవ్ సింబల్ తో షాక్ ఇచ్చింది. మళ్ళీ లవ్ సింబల్ ఎందుకంటూ పక్కన నుంచి ఎవరో చెబుతున్నట్లు ఆనిపించడంతో మళ్ళీ జనాలు నామినేట్ చేస్తారేమో అని నవ్వుతూ కనిపించాడు.

వెంటనే డిలీట్..
ఇక ఆ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటలకు లహరి మళ్ళీ వెంటనే డిలీట్ చేసింది. అలా ఎందుకు చేసింది అనేది ఎవరికి అర్థం కాలేదు. బహుశా అందులో గ్లామర్ డోస్ ఎక్కువయ్యి ఉంటుందేమో అని అనిపిస్తోంది. నిజానికి లహరి ఆ వీడియోతో మెరిసే డ్రెస్ లో చాలా హాట్ గా దర్శనమిచ్చింది. ఇక ఆమె వీడియో ఎందుకు డిలీట్ చేసిందో తెలియాలి అంటే ఆమెనే క్లారిటీ ఇవ్వాలి.


Click it and Unblock the Notifications











