For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Lakshmi Vasudevan: రూ. 5 లక్షలకు కక్కుర్తి పడ్డ బుల్లితెర నటి.. ఆ తప్పు చేయకండని కంటతడి, వీడియో వైరల్

  |

  సాధారణ ప్రజలు మోసపోవడం, వేధింపులకు గురికావడం, సైబర్ క్రైమ్ బారిన పడటం సహజమే. కానీ ఈ మోసాలు, ఫొటో మార్ఫింగులు సెలబ్రిటీలను సైతం వదలట్లేదు. కాకపోతే సాధారణ అమ్మాయిలు ఇలా మోసపోతే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు, నిందితులను పట్టుకోవడంతో అయిపోతుంది. కానీ సెలబ్రిటీలు ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్నప్పుడు నిర్మొహమాటంగా బయటకు చెబుతున్నారు. వారిలా ఇంకెవరూ కూడా తప్పు చేయకూడదని అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగానే తాజాగా సీరియల్ నటి లక్ష్మి వాసుదేవన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

   అంతఃపురం సీరియల్ నటి..

  అంతఃపురం సీరియల్ నటి..

  లక్ష్మీ వాసుదేవన్ బుల్లితెరపై మోస్ట్ పాపులర్ సీరియల్ నటి. కస్తూరి, ముత్తజగు, ఒరు ఉరుల ఒరు రాజకుమారి, తిలలంగడి వంటి తమిళ సీరియల్స్ తోపాటు మధుమాసం, అంతఃపురం, చిలసౌ స్రవంతి ధారావాహికల్లో నటించి మంచి పేరు సంపాందించుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకున్న లక్ష్మీ వాసుదేవన్ తాజాగా ఏడుస్తూ ఓ వీడియోలో దర్శనమిచ్చింది. తనకు తెలియకుండా జరిగిన తప్పు వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది.

   ఎమోషనల్ గా మాట్లాడుతూ..

  ఎమోషనల్ గా మాట్లాడుతూ..

  లక్ష్మీ వాసుదేవన్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఆమె ఎమోషనల్ గా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ''నేను ఈ విషయాన్ని వాట్సాప్ లో నా ఫ్రెండ్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరో నా ఫొటోలను మార్ఫింగ్ చేసి కొత్త నంబర్ నుంచి నాకు తెలిసిన వారందరికీ పంపించారు. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదనే ఇదంతా చెబుతున్నాను. ఇంతకు ఏం జరిగిందో మీకు చెప్పాలి.

   రూ. 5 లక్షల గెలుచుకున్నారని..

  రూ. 5 లక్షల గెలుచుకున్నారని..

  సెప్టెంబర్ 11న రూ. 5 లక్షల గెలుచుకున్నారని మా అమ్మకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ తో పాటు ఒక లింక్ కూడా వచ్చింది. నేను ఆ లింక్ పై క్లిక్ చేశాను. దీంతో ఫోన్ లో ఒక యాప్ ఇన్ స్టాల్ అయింది. ఆ తర్వాత నా ఫోన్ ను ఎవరో హ్యాక్ చేశారు. ఆ విషయం నాకు అప్పుడు తెలియదు. మూడు నాలుగు రోజుల తర్వాత నాకు మెసేజ్ లు రావడం మొదలైంది. మీరు లోన్ తీసుకున్నారు. వెంటనే లోన్ చెల్లించాలని మెసేజ్ లు, ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయింది.

  ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి..

  ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి..

  చాలా దారుణంగా మాట్లాడుతూ నాకు వాయిస్ నోట్ పంపారు. రూ. 5 లక్షల అప్పు కట్టకపోతే మీ ఫొటో అందరికి పంపిస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. నేను వెంటనే హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశాను. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. కానీ ఇంతలో నా ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, నా కాంటాక్ట్ ఉన్న వాళ్లందరికి పంపించారు. అందరూ ఏం జరిగింది అని అడగడంతో ఏడుపు వచ్చింది.

  నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..

  నిరూపించుకోవాల్సిన అవసరం లేదు..

  నా స్నేహితులకు నా గురించి తెలుసు. వారికి నేను ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి తప్పుడు యాప్ లను డౌన్ లోడ్ చేసిన తర్వాత ఎదురయ్యే సమస్యల గురించి చెప్పాలి. మీరు డబ్బు గెలుచుకున్నారని తెలియని నెంబర్ నుంచి మీకు మెసేజ్ లు వస్తే వాటిపై క్లిక్ చేయకండి. తెలియకుండా ఏ యాప్ ను డౌన్ లోడ్ చేయవద్దు. లక్కీ డ్రా సందేశాలను నమ్మి మోసపోకండి.

   చాలామందికి అవగాహన కలుగుతుంది..

  చాలామందికి అవగాహన కలుగుతుంది..

  సైబర్ క్రైమ్ పోలీసులు వీడియో సందేశం లేదా వాట్సాప్ స్టేటస్ ద్వారా పోస్ట్ చేయాలని నాకు చెప్పారు. నేను చెబితే చాలామందికి అవగాహన కలుగుతుందన్నారు. అప్పుడే చాలా మందికి ఈ విషయం తెలుస్తుంది. ఇలా లోన్ యాప్స్ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని ఎదుర్కోవడం మహిళలకు చాలా కష్టం. ఒక్కోసారి ఒక్కో నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది.

  ఐపీ అడ్రస్ లు మారుస్తూ..

  ఐపీ అడ్రస్ లు మారుస్తూ ఆస్ట్రేలియా, శ్రీలంక, అమెరికా, లండన్, సిడ్నీలో చూపిస్తోంది. దీనిపై సైబర్ క్రైమ్ కసరత్తు చేస్తోంది. నాకు మీ అందరి మద్దతు కావాలి'' అంటూ ఆ వీడియోలో కోరింది లక్ష్మీ వాసుదేవన్. ఇలా సైబర్ క్రైమ్ బారిన పడిన సెలబ్రిటీలు మరెవరు వాటిలో చిక్కుకోకూడదని అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా మంది సాధారణ యువతులు లోన్ యాప్స్ బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.

  English summary
  Telugu Serial Actress Lakshmi Vasudevan Emotional video On Cyber Crime Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X