టెలివిజన్ నటి సంచిత సూసైడ్.. మరణానికి ముందు చివరి వీడియోలో ఏమున్నదంటే?
యువ టెలివిజన్ నటి సంచిత ఉగాలే సూసైడ్ వార్త హిందీ సినీ ఇండస్ట్రీని కుదిపి వేసింది. బాలీవుడ్ చిత్రాలు, ఓటీటీ, టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తూ వర్థమాన తారగా పాపులారిటీ సంపాదించుకొంటున్న ఆమె ఆకస్మికంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లడాన్ని ఆమె స్నేహితులు, సన్నిహితులు, సహచర నటులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన మరణానికి 24 గంటల ముందు ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నది. ఎంతో సంతోషంగా కనిపించిన ఆమె ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారంటే నమ్మశక్యంగా కావడం లేదంటూ నెటిజన్లు తమ అనమానాలను, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు సంచిత షేర్ చేసిన వీడియో వివరాల్లోకి వెళితే..
సంచిత ఉగాలే విషయానికి వస్తే..ఆమె బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా నెటిజన్లకు అత్యంత సుపరిచితులు. ఆమె పోస్ట్ చేసే రీల్స్, వీడియోలకు అనూహ్యమైన స్పందన ఉంటుంది. ఇన్స్‌టాగ్రామ్‌లో ఈ యువ నటికి 1.4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే విశేషంగానే చెప్పుకోవాలి. తన మరణానికి ముందు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతున్నది.

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా కనిపించే సంచిత బాలీవుడ్ పాటలపై తన హావభావాలను ప్రదర్శిస్తూ ఓ రీల్‌ను పోస్టు చేశారు. రాజ్ కపూర్ రూపొందించిన సర్గమ్ సినిమాలోని డఫ్లీ వాలే డఫ్లీ బజా అనే పాటపై తన భావాలను ప్రదర్శించారు. అలాగే ఓ రాధా చునరీ అనే పాటపై కూడా ఆమె తన నటనా ప్రతిభను ప్రదర్శించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే కాకుండా 300 లకు పైగా మంది షేర్ చేశారు. 10 వేల మంది లైక్ చేశారు.
తన చివరి వీడియోలో పింక్ కలర్ దుస్తులు ధరించి నుదుట బొట్టుతో అందంగా ముస్తాబై కనిపించారు. ఓ కెమెరాను పట్టుకొని ఆమె ఆనందంగా తన సంతోషాన్ని పంచుకొనే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపించారు. అయితే ఈ వీడియో చూస్తే.. సూసైడ్ చేసుకోవాల్సినంత బాధ గానీ, కష్టాలు, సమస్యలు గానీ కనిపించడం లేదు. అయితే ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి వెనుక కారణం ఏమిటి? ఇలాంటి పరిస్థితికి ఎందుకు ఆమె ఒడిగట్టిందనే విషయంపై నెటిజన్లు అనేక సందేహాలు, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, కుంకుమ్ భాగ్య, వాగ్లే కి దునియా సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన నటి సంచిత ఉగాలే ముంబైలోని నాలాసోపారా ప్రాంతంలో నివాసంలో సోమవారం (జూన్ 15వ తేదీ) ఉదయం 7 గంటల ప్రాంతంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించారు. ఆమె వయసు 22 సంవత్సరాలు. తన తండ్రి ఫిర్యాదు మేరకు ఈ మరణాన్ని యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేశారు.
సంచిత తన కెరీర్‌లో కుంకుమ్ భాగ్య, వాగ్లే కి దునియా, దిల్ వాలీ దుల్హా లే జాయేంగే సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకొన్నారు. బుల్లితెర మీదనే కాకుండా ఆమె ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించారు. విక్రాంత్ మెస్పీ నటించిన క్రైమ్ ఆజ్ కల్, జీ5 స్ట్రీమింగ్ అవుతున్న సైలెన్స్ 2: ది నైట్ ఓల్ బార్ షూట్‌అవుట్ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయ్‌తో కలిసి నటించారు. అలాగే విక్కీ కౌశల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛావా సినిమాలో తారాభాయ్‌గా నటించి మెప్పు పొందారు.


Click it and Unblock the Notifications