Don't Miss!
- News
YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
TRP Ratings: పుష్ప సినిమాతో పోటీ పడిన రాజా మూవీ.. ఈ రోజుల్లో కూడా ఆ రేటింగ్ ఏంటి బాబోయ్!
ఇటీవల కాలంలో టెలివిజన్ రంగంలో కూడా సినిమాలకు టిఆర్పి రేటింగ్ అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. అవి స్టార్ హీరోలో భవిష్యత్తు సినిమాల నాన్ ట్థియేట్రికల్ బిజినెస్ కు చాలా ఉపయోగపడుతున్నాయి. అయితే కొన్ని పాత సినిమాలకు కూడా ఈ మధ్య ఊహించని స్థాయిలో టిఆర్పి అందుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా వెంకటేష్ ఓల్డ్ క్లాసిక్ మూవీ రాజా కూడా ఇప్పటికీ పెద్ద సినిమాలతో పోటీపడుతూ క్రేజ్ అందుకుంటూ ఉండటం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

టాప్ రేటింగ్స్
ఈ రోజుల్లో కేవలం బాక్సాఫీస్ రికార్డులు మాత్రమే కాకుండా టిఆర్పి రేటింగ్స్ లో వచ్చే రికార్డులు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఫ్యాన్స్ అయితే ఆ నెంబర్స్ ను షేర్ చేసుకుంటూ వారి హీరోల స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గత వారం విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బింబిసారా పుష్ప రాజా సినిమాలకు టాప్ రేటింగ్స్ రావడం విశేషం.

బింబిసారకు టీఆర్పీ ఎంతంటే..
ముందుగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా మొదటిసారి జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యింది. ఇంకా ఈ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదివరకే ఓటీటీ లో వచ్చిన ఈ సినిమాకు అద్భుతమైన వ్యూవర్షిప్ రాగా ఇప్పుడు రేటింగ్స్ కూడా అదే స్థాయిలో వచ్చాయి. మొత్తంగా బింబిసార సినిమాకు మొదటిసారి ప్రీమియర్స్ 11.46 టిఆర్పి వచ్చింది.

మరోసారి పుష్ప హవా
అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమాకు కూడా మంచి డీసెంట్ టిఆర్పి రేటింగ్ అయితే దక్కింది. చాలావరకు అల్లు అర్జున్ సినిమాలకు టెలివిజన్లో మంచి క్రేజ్ అయితే ఉంది. అల..వైకుంఠపురములో టాప్ రేటింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కూడా అదే తరహాలో రేటింగ్స్ అందుకుంటుంది. ఇదివరకే ఈ సినిమా చాలాసార్లు టెలివిజన్లో టెలికాస్ట్ అయింది. ఇక గత వారం 4.46 టిఆర్పి రేటింగ్ అందుకోవడం విశేషం.

రాజా సినిమా పోటీగా..
అయితే ఊహించని విధంగా పుష్ప సినిమాకు పోటీగా రాజా సినిమా రేటింగ్ అందుకునే విధంగా పోటీ పడింది. వెంకటేష్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాల్లో రాజా సినిమా ఒకటి. ఎన్నిసార్లు ఈ సినిమాను చూసినా కూడా బోర్ కొట్టదు. జెమినీ టీవీలో ఇప్పటికే వేల సార్లు ఈ సినిమాను టెలికాస్ట్ చేశారు. ఇక రీసెంట్ గా టెలికాస్ట్ అయినా రాజా సినిమాకు 3.33 టిఆర్పి రావడం విశేషం.

ఆ సినిమాలకు వచ్చిన రేటింగ్స్
గతవారం కంటే ముందు వారం వచ్చిన కొన్ని సినిమాల టిఆర్పి రేటింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. RRR మూవీకి 6.37 టీఆర్పీ రాగా సరిలేరు నీకెవ్వరు సినిమాకు 3.72 టిఆర్పి వచ్చింది. ఇక నాగార్జున బంగార్రాజు సినిమాకు 2.91 టిఆర్పి దక్కింది. అలాగే నివేద థామస్ రెజీనా నటించిన షాకిని డాకిని సినిమాకు ఫస్ట్ టైం 3.83 టిఆర్పి వచ్చింది. ఇక ధనుష్ తమిళ రీమేక్ మూవీ మొదటిసారి 5.21 టిఆర్పి అందుకోవడం విశేషం.