మరోసారి బయటపడిన హారిక - అభిజీత్ ప్రేమ: ఆ కంటెస్టెంట్ చేసిన కామెంట్లతో మొత్తం లీక్!

గత వాటితో పోలిస్తే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో లవ్ ట్రాకులు ఎక్కువగా కనిపించాయి. ఇందులో అభిజీత్ - దేత్తడి హారిక ట్రాక్ క్యూట్‌గా అనిపించింది. షో ఆరంభంలోనే కలిసిన ఈ ఇద్దరూ.. క్రమక్రమంగా దగ్గరవుతూ వచ్చారు. అయితే, ఇటీవలి కాలంలో వీళ్లిద్దరి మధ్య దూరం కాస్త పెరిగింది. దీంతో అభిజీత్.. హారిక తీరుపై అసహనంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల రీఎంట్రీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ మాజీ కంటెస్టెంట్ చేసిన కామెంట్లతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ మరోసారి బయట పడింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

మోనాల్ కామెంట్లతో ట్రాక్‌ హాట్ టాపిక్

మోనాల్ కామెంట్లతో ట్రాక్‌ హాట్ టాపిక్

నాలుగో సీజన్ ఆరంభంలో అభిజీత్.. మోనాల్ గజ్జర్‌తో చనువుగా ఉండేవాడు. ఆ సమయంలో వీళ్లిద్దరూ చాలా సమయం కలిసి గడిపేవారు. అప్పుడే వీళ్ల మధ్య ట్రాక్ నడుస్తున్నట్లు జోరగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ‘దేత్తడి హారిక నిన్ను ఇష్టపడుతుంది. నీతో సమయం గడపాలని ట్రై చేస్తోంది' అంటూ మోనాల్.. అభిజీత్‌తో చెప్పడం హాట్ టాపిక్ అయింది.

బిగ్ బాస్‌నే అనడంతో క్లారిటీ వచ్చింది

బిగ్ బాస్‌నే అనడంతో క్లారిటీ వచ్చింది

మోనాల్ గజ్జర్ తనకు దూరమై అఖిల్ సార్థక్‌కు క్లోజ్ అయిన సమయంలో అభిజీత్ కొద్ది రోజుల పాటు ఒంటరిగా ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అతడికి హారిక కంపెనీ ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఒకానొక సందర్భంలో తనను అభిజీత్ టీమ్‌లో కాకుండా వేరే టీమ్‌లో ఎందుకు వేశారంటూ హారిక బిగ్ బాస్‌తోనే చిలిపిగా గొడవకు దిగింది. దీంతో వీళ్ల ట్రాకుపై క్లారిటీ వచ్చింది.

నాగార్జున కామెంట్లతో పెరిగిన దూరం

నాగార్జున కామెంట్లతో పెరిగిన దూరం

కంటెస్టెంట్ల ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన సమయంలో.. హారిక తల్లి తన కూతురిని చక్కగా చూసుకుంటున్నావని అభిజీత్‌ను ప్రశంసించారు. అంతేకాదు, ఎప్పటికీ ఇలాగే కలిసుండమని కోరారు. అది కంటిన్యూ చేస్తున్న సమయంలోనే దెయ్యం టాస్కు విషయంలో నాగార్జున.. హారికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి అభీకి దూరమవుతూ వస్తోందామె.

 ఆ లెటర్‌తో ప్రేమను రివీల్ చేసిన అభి

ఆ లెటర్‌తో ప్రేమను రివీల్ చేసిన అభి

కొద్ది రోజులు క్రితం అందరూ పడుకున్న తర్వాత అభిజీత్.. హారికను ఉద్దేశించి ఓ టిష్యూ పేపర్ మీద సందేశాన్ని పంపించాడు. అందులో ‘ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ మీ (దయచేసి నాతో సమయాన్ని గడుపు)' అని రాశాడు. అది తన పక్కనే ఉన్న బెడ్‌పై పెట్టి వచ్చి పడుకున్నాడు. ఆ వెంటనే దాన్ని చూసిన దేత్తడి హారిక బాగా ఎమోషనల్ అయిపోయి అతడిని గట్టిగా హగ్ చేసుకుంది.

బయట పెట్టిన లాస్య... సపోర్టు చేస్తూ

బయట పెట్టిన లాస్య... సపోర్టు చేస్తూ

ఫినాలే వీక్ కావడంతో బిగ్ బాస్ హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజా ఎపిసోడ్‌లో లాస్య లోపలికి వచ్చింది. అద్దాల గది నుంచి కంటెస్టెంట్లు అందరితో మాట్లాడిన ఆమె.. ఎక్కువగా తన స్నేహితులతో గడిపింది. ఈ సందర్భంగా రెండు మూడు వారాలుగా హారిక.. అభిజీత్‌తో పెద్దగా కలవడం లేదన్న విషయాన్ని వాళ్లిద్దరి దగ్గర ప్రస్తావించింది.

 అభిజీత్ కామెంట్లతో మరోసారి రివీల్

అభిజీత్ కామెంట్లతో మరోసారి రివీల్

పాపం అభిజీత్ అడుక్కోవాల్సి వస్తుంది అని లాస్య అనగా.. ‘అవును.. ఈ మధ్య నాతో టైమ్ స్పెండ్ చేయడం లేదు. రెండు వారాల నుంచి అస్సలు కనిపించడమే లేదు. నువ్వైనా ఆమెకు చెప్పు' అంటూ మరోసారి తన ప్రేమను బయట పెట్టాడు అభి. దీనికి లాస్య కూడా మద్దతు తెలిపింది. దీంతో ‘లాస్యక్క నువ్వు కూడా తనకే సపోర్ట్‌ చేస్తున్నావా' అంటూ హారిక అతడిని హగ్ చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X