యాంకర్ రవి అలా చేయడంతో షాక్.. ఎక్స్ ప్రెస్ హరిని చితకబాదిన లాస్య
బుల్లితెరపై ప్రస్తుతం యాంకర్ రవి లాస్య కలిసి దుమ్ములేపుతున్నారు. కామెడీ స్టార్స్ షోలో ఇద్దరూ కలిసి మళ్లీ మునుపటి కెమిస్ట్రీ, మ్యాజిక్‌ను తీసుకొస్తున్నారు. రొమాంటిక్ పర్ఫామెన్స్, సెటైరికల్ స్కిట్లతో ముందుకు వస్తున్నారు. మొత్తానికి లాస్య, రవి ఇలా కామెడీ స్టార్స్ షోలో సందడి చేయడంతో మంచి హైప్ వచ్చేసింది. అయితే ఈ కామెడీ స్టార్స్‌లో కొత్తగా అషూ రెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి జంట రచ్చ చేస్తోంది.

కామెడీ స్టార్స్ అలా..
బిగ్ బాస్ కంటెస్టెంట్లైన అవినాష్, అరియానా, సుజాత, అషూ రెడ్డిలతో ముందుగా షోను ప్లాన్ చేశారు. వీరితో పాటే బొమ్మ అదిరింది టీం కూడా జాయిన్ అయింది. అలా అందరూ కలిసి కామెడీ స్టార్స్‌ను ప్రారంభించారు. దీనికి శేఖర్ మాస్టర్, శ్రీదేవీని న్యాయ నిర్ణేతలుగా తీసుకొచ్చారు.

రచ్చ రచ్చ..
ఇక ప్రతీ వారం శేఖర్ మాస్టర్ శ్రీదేవీ రొమాంటిక్ డ్యాన్స్ పర్ఫామెన్స్, అవినాష్ అరియానా ట్రాక్, సుజాత, అషూలపై అవినాష్ వేసే కౌంటర్లు అన్నీ బాగానే క్లిక్ అయ్యాయి. ఈ మధ్య ఎక్స్ ప్రెస్ హరి అషూ జంట బాగా హాట్ టాపిక్ అవుతోంది.

ముద్దులు, హగ్గులు..
స్కిట్లో భాగంగానే అషూ, ఎక్స్ ప్రెస్ హరి హద్దులు దాటుతున్నారు. హగ్గులు, కిస్సులు అంటూ దుమ్ములేపుతున్నారు. అయితే ఇదంతా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కోసమేనని, బయట అన్నయ్య అవుతాడని హరి గాలి తీసేస్తోంది అషూ. మొత్తానికి ఎక్స్ ప్రెస్ హరి మాత్రం ఈ మధ్య హాట్ టాపిక్ అవుతున్నాడు.

ఫుల్ ఫేమస్..
అషూ వ్యవహారంతో హరి బాగానే ఫేమస్ అవుతున్నాడు. వచ్చే ఆదివారం వేసే స్కిట్లలో అందరూ కలిసి హరిని బాగానే ఆడుకున్నట్టు కనిపిస్తోంది. రజినీ స్టైల్‌లో నడుచుకుంటూ వచ్చిన హరి కాలి స్లిప్ అయి పడిపోయాడు. దీంతో అందరూ తెగ నవ్వేశారు.

చితకబాదిన లాస్య..
ఇక లాస్య చంద్రముఖి అవతారాన్ని ఎత్తింది. అందులో చంద్రముఖిని కించపరిచేలా హరి కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. అదే క్రమంలో హరిని తన కాళ్ల మీద పడేట్టు యాంకర్ రవి తోసేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు, ఇక చివర్లో లాస్య కూడా చంద్రముఖిగా మారి ఎక్స్ ప్రెస్ హరిని చితకబాదేసింది. మొత్తానికి అందరూ కలిసి హరిని బాగానే వాడేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











