Jr.ఎన్టీఆర్ రియాలిటీ షో.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ పనైపోయింది!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఎన్టీఆర్ హోస్టింగ్ తో ఏ రేంజ్ లో మొదలయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ కు తెలుగులో కూడా మంచి లైఫ్ ఉందని నిరూపించిన తారక్ హోస్ట్ గా తన బాధ్యతలను ఎలాంటి పొరపాటు లేకుండా నిర్వర్తించారు. ఇక చాలా రోజుల తరువాత తారక్ మరో రియాలిటీ షోతో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల త్రివిక్రమ్ తో కలిసి షోకు సంబంధించిన ఒక పని పూర్తి చేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

త్వరలోనే ఒక రియాలీటి షోలో..
జునియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొమురం భీమ్ టీజర్ తోనే సరికొత్తగా కనిపించి ఆడియెన్స్ లో అంచనాలను పెంచిన యంగ్ టైగర్ త్వరలోనే ఒక రియాలీటి షోలో మరో డిఫరెంట్ లుక్కుతో ఆకట్టుకొనున్నట్లు తెలుస్తోంది. షోకి సంబంధించిన కొన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల న్యూస్ లు వైరల్ అవుతున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రోమో షూట్
జునియర్ ఎన్టీఆర్ చాలా వరకు సింపుల్ గా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటాడు. వీలైనంత వరకు కాంట్రవర్సీలకు వెళ్లకుండా అలాగే ప్రొడక్షన్ లాంటి రిస్క్ పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. గతంలో ఒకసారి ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించడానికి ప్రయత్నాలు జరిగినట్లు టాక్ వచ్చింది.ఇక ఇప్పుడు మొదటిసారి ఒక టాక్ షో కోసం తన సొంత డబ్బును ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.జెమిని టీవీలో ప్రసార కాబోయే ఆ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ గా సెట్స్ ఏర్పాట్లు చేశారు. ఇక ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ తో కలిసి ఒక ప్రోమో కోసం షూటింగ్ చేసినట్లు సమాచారం. ప్రోమోతోనే అఫిషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

కాన్సెప్ట్ నచ్చడంతో
ఇక షో కోసం తారక్ రెమ్యునరేషన్ ఎంత అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ నిజానికి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ లేకుండా షోను మొదలు పెట్టబోతున్నాడాట. కాన్సెప్ట్ నచ్చడంతో సొంతంగా డబ్బులు పెట్టేందుకు కూడా రెడీ అయ్యారని సొంతంగా లాభాలు అందుకునేందుకు ఎన్టీఆర్ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సమ్మర్ నుంచి న్యూ షో
బిగ్ బాస్ లో హోస్ట్ గా వ్యవహరించిన తారక్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి సీజన్ లో తారక్ వచ్చిన ప్రతి ఎపిసోడ్ రేటింగ్ అమాంతంగా పెరుగుతూ వచ్చింది. ఏ రోజు కూడా బిగ్ బాస్ రేంజ్ తగ్గలేదు. ఇక మరోసారి బిగ్ బాస్ హోస్ట్ గా ఆఫర్ వచ్చినప్పటికీ తారక్ ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు మాత్రం సొంతంగా టాక్ షోను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. సమ్మర్ మిడ్ నుంచి న్యూ షో స్టార్ అయ్యే ఛాన్స్ ఉందట.


Click it and Unblock the Notifications











