twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌ పోస్టర్లపై పేడ.. వివాదానికి పుల్‌స్టాప్.. లోక నాయకుడిని కలిసిన లారెన్స్

    |

    తమ అభిమాన హీరోను ఏదైనా అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు. అదే వేరే ఇండస్ట్రీలో అంటే పర్లేదు అనుకోవచ్చు గానీ తమిళ నాడు లాంటి రాష్ట్రంలో నటులకు గుళ్లు కట్టే సంస్కృతి ఉన్న దాంట్లో తమ దైవాన్ని ఏమైనా అంటే ఊరుకుంటారా?. పైగా పోస్టర్లపై పేడ కొట్టానంటూ వేల మంది ముందు వేదికపైనే చెబితే ఒప్పుకుంటారా? సదరు హీరో అభిమానులు క్షమిస్తారా? ఇప్పుడిదంతా ఎందుకుని అనుకుంటున్నారా? అయితే అసలు మ్యాటర్‌లోకి వెళ్దాం.

    దర్బార్ ఆడియో వేడుకలో..

    దర్బార్ ఆడియో వేడుకలో..

    సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం దర్బార్. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ గత ఆదివారం చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు లారెన్స్ హాజరయ్యాడు. రజనీకి వీరాభిమాని అయిన లారెన్స్.. తలైవా మీద తనకున్న అభిమానాన్ని చెప్పుకొస్తూ.. మరో అగ్రనటుడు కమల్‌ను తక్కువ చేసినట్టు మాట్లాడాడు. ఆ విషయమే వివాదంగా మారింది.

    చిన్నతనంలో చేసిన పని..

    చిన్నతనంలో చేసిన పని..

    ‘చిన్నతనం నుంచి రజనీ అభిమాని.. చిన్నప్పుడు గోడ మీద కమల్ సార్ పోస్టర్ కనిపిస్తే ఆవుపేడ తీసి కొట్టేవాడ్ని. కానీ.. ఈ రోజున వీళ్లిద్దరూ చేయి.. చేయి కలుపుకొని నడుస్తుంటే చూసేందుకు చాలా సంతోషంగా ఉంద'ని చెప్పుకొచ్చాడు. అది చిన్నతనంలో చేసిన పని అని చెప్పినా అభిమానులు మాత్రం ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

    వివరణ ఇచ్చినా ..

    ఇక తన మాటల వల్ల ఫీలైన అభిమానులకు వివరణ ఇచ్చుకున్నాడు లారెన్స్. తన ఉద్దేశ్యం వేరని, కేవలం పేడ కొట్టాననే దాన్ని మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుందని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా ఆ హీరో ఫ్యాన్స్ వినలేదు.

    కమల్‌కే విన్నవించిన లారెన్స్..

    కమల్‌కే విన్నవించిన లారెన్స్..

    ఇక వీరి తాకిడి తట్టుకోలేక లారెన్స్ నేరుగా లోకనాయకుడినే కలిశాడు. ఈ మేరకు కమల్‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ అన్నింటిపై క్లారిటీ ఇచ్చాడు. తాను అన్ని విషయాలు కమల్ సర్‌తో చెప్పానని, ఆయన తన వాదనను విన్నాడని, వాటికి ఆయన కూడా సుతిమెత్తగా స్పందించాడని, తాను చెప్పినవన్నీ విన్నాడని తెలిపాడు. అంతేకాకుండా తనను ఆశీర్వదించాడని కూడా తెలిపాడు. ఈ పోస్ట్ ద్వారా ఆయన అర్థం చేసుకున్నదానికి, చూపించిన ప్రేమకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని ట్వీట్ చేశాడు. మరి ఇక్కడితోనైనా ఈ వివాదం సమసిపోతుందో లేదో చూడాలి.

    English summary
    Lawrence Give Explanation To Kamal Hassan About Cow Dung On His Posters. He remind His Childhood Memories At Darbar Audio Function, Which Is Celebrated On 8th December. This Movie Is Directed By AR Murugadoss And Music Composed By Anirudh Ravichander.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X