Bigg Boss Telugu 8 Contestants: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..ఇందులో పది మంది కన్ఫర్మ్!

Bigg Boss Telugu 8 Contestants list: బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే స్టార్ మా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. పాల్గొనే కంటెస్టెంట్ల ఎవరనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ తరుణంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి ఓ లిస్ట్ విడుదల చేశారు. అందులో 10 మంది కన్ఫర్మ్ అంటూ ప్రకటించారు. ఈ లిస్ట్ ఎంటో? అందులో ఉన్న కంటెస్టెంట్ ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి గూరూ..

బుల్లి తెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు చాలా గ్రాండ్‌గా ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లువడింది. ఇప్పటికే ఈ షో కు సంబంధించిన పలు అప్టేట్స్, ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతూ.. సీజన్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి.

leaked Bigg Boss Telugu 8 probable Contestants list Here is Vishnu Priya Rithu Chowdary and other Expected celebrities names

ముఖ్యంగా ప్రోమో కింగ్ నాగార్జున హోస్ట్ గా వేసిన డైలాగ్స్ కేకపుట్టిస్తున్నాయి. గత సీజన్లకు ఏ మాత్రం తగ్గకుండా.. అన్ లిమిటెడ్ ఫన్ అందించాలని ప్లాన్ చేసినట్టుంది బిగ్ బాస్ టీమ్. అందుకు తగ్గట్టుగానే.. కంటెస్టెంట్స్ లను పర్పెక్ట్ గా సెలెక్ట్ చేసి.. హౌస్ లోకి పంపనున్నారట. ఇప్పటికే పలువురు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో పలువురు లీక్స్ వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి .. ఈ షోకి సంబంధించి క్రేజీ అప్టేట్స్ ఇచ్చారు. ఈ సీజన్ లో పాల్గొనేవారు వీరే అంటూ ఓ లిస్ట్ విడుదల చేశారు. పైగా అందులో పది మంది కంటెస్టెంట్లకు ఫ్లేస్ కన్ఫామ్ అంటూ ఓ లీక్ ఇచ్చేశారు. ఇంతకీ ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో ఓ లూక్కేద్దాం.

కంటెస్టెంట్స్ వీరే..

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి అంచనా ప్రకారం.. ఈ సీజన్ లో ఎప్పటి లాగే ఓల్డ్ హీరో జాబితాలో టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం కంటెస్టెంట్‌గా రాబోతున్నారు. వీరితోపాటు హీరో అభిరామ్ వర్మ కూడా బిబి హౌస్ లోకి రానున్నట్లు సమాచారం. బుల్లి తెర ప్రేక్షకులు ఎక్కువ మంది ఆదరిస్తున్నఈ షో లో సీరియల్స్ బ్యాచ్ కచ్చితంగా ఉంటుందనేది తెలిసిన విషయమే. అలా ఈ సారి సీరియల్స్ కేటగిరీ నుంచి చక్రవాకం ఫేమ్ ఇంద్రనీల్, నిఖిల్ మలియక్కల్ ఎంట్రీ ఇవ్వనున్నారంట. వీరితోపాటు కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యష్మీ గౌడ కూడా సీజన్ లో హౌస్ లో అడుగుపెట్టన్నారట.

ఇక జబర్దస్త్ నుంచి కూడా ప్రతి సీజన్ లో ఒక్కరు లేదా ఇద్దరూ కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ కేటగిరీ నుంచి జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి, యాంకర్ సౌమ్యరావు, విష్ణు ప్రియ రానున్నట్లు సమాచారం. అలాగే.. ప్రతి సీజన్ లో ఒక్క సింగర్ ఉంటున్నారు. ఇక సింగర్ క్యాటగిరీలో సింగర్ సాకేత్ కొమండూరి రాబోతున్నారట.. ఇక యూట్యూబర్ ఫేమ్ లను కూడా ప్రతి సీజన్ లో తీసుకుంటున్నారు. వారికి కూడా బీబీ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఈ సీజన్ లో ఈ కేటగిరి నుంచి ప్రముఖ యూట్యూబర్ బెజవాడ బేబక్క ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే.. కిర్రాక్ సీతా కూడా లిస్ట్ లో ఉన్నారట.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ...

అలాగే.. ప్రతి సీజన్ లోనూ హౌస్ ను మరింత కంట్రవర్సీలను పెంచడానికి, హౌస్ లో జోష్ పెంచడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ కంటెస్టెంట్ ను లోనికి పంపిస్తున్నారు. ఈ జాబితాలో టెస్టింగ్ తేజ లేదా రాకింగ్ రాకేష్ తీసుకోబోతున్నట్టు సమాచారం. వీరితో పాటు నైనిక అనసుర్, అభినయ నవీన్, కయ్యూం అలీ, విస్మాయ శ్రీ , నాగ మణికంఠ, సహరా క్రిష్ణన్ తో పాటు ఇటీవల వార్తల్లో నిలిచిన ఆర్ జే శేఖర్ భాషా లు కంటెస్టెంట్లు గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే అవకాశముందని అంచనా వేశారు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి.

ఈ పది మంది కన్ఫర్మ్!

కాగా.. ఈ జాబితాలో ఉన్న హీరో ఆదిత్య ఓం, అభిరాం వర్మ, సీరియల్ నటులు ఇంద్రనీల్, నిఖిల్ మలియక్కల్, జబర్దస్త్ రీతూ చౌదరి, యాంకర్ సౌమ్యరావు, విష్ణు ప్రియ, యష్మీ గౌడ, అలాగే యూటూబర్ బెజవాడ బేబక్క, కిర్రాక్ సీతా లకు దాదాపుగా 99.99 శాతం బిగ్ బాస్ లో ఫ్లేస్ కన్ఫర్మ్ అని గట్టిగా చెప్పుతున్నారు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి. అలాగే.. ఈ సారి సీజన్లలో అదిరిపోయే ట్విస్ట్ లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని, అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ పక్కా అంటూ బల్ల గుద్ది చెప్పుతున్నారు. కాగా .. బిగ్ బాస్ 8 తెలుగు షోలోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారో? షో ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. సెప్టెంబర్ 1 వరకు వేచిచూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X