టీవీ సీరియల్ పాపే ...నాగ్ కొత్త సినిమా హీరోయిన్
హైదరాబాద్ : టీవి రెగ్యులర్ చూసే వాళ్లందరికీ...సూపర్ హిట్ సీరియల్ 'చిన్నారి పెళ్లికూతురు'(బాలికా వధు) గుర్తుండే ఉంటుంది. ఆ సీరియల్ లో నటించిన ఆనంది హీరోయిన్ గా పరిచయం చేస్తూ నాగార్జున నిర్మాతగా 'ఉయ్యాల జంపాల' అనే చిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే పలు షార్ట్ ఫిలింస్ లో నటించిన తరుణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.
సన్‌షైన్ సినిమా అధినేత పి.రామ్మోహన్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై డి.సురేష్‌బాబు సమర్పణలో నాగార్జున ఈ 'ఉయ్యాల జంపాల' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హీరో,హీరోయిన్స్ గా రాజ్ తరుణ్, ఆనందిని, దర్శకుడిగా విరించి వర్మ పరిచయమవుతున్నారు. బావా మరదళ్ల క్యూట్ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్రానికి 'స్వామిరారా' ఫేమ్ సన్నీ ఎం.ఆర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఆనంది నటించిన 'చిన్నారి పెళ్లికూతురు' విషయానికి వస్తే బాల్య వివాహాల దుస్థితిపై ధ్వజమెత్తిన సీరియల్ అది. 'బాలికా వధు' ధారావాహిక వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకొని మున్ముందుకు దూసుకెళ్తోందంటే ప్రేక్షకుల విపరీతమైన ఆదరణే కారణం . ఈ సీరియల్‌ని ప్రారంభించినప్పుడు ఏదో ఓ ఐదువందల ఎపిసోడ్ల వద్ద అపేద్దామనుకున్నారు. రాన్రాను వీక్షకుల శాతం పెరగటంతో మరిన్ని అంశాలను చేర్చి కథని మరింత పకడ్బందీగా రూపొందిస్తూ వచ్చారు
ఈ సీరియల్‌లో నటించిన సురేఖా సిక్రీని గానీ.. లక్ష్మీ సర్గారాని గానీ.. ఇంకా ఎవరిని పలకరించినా - వాళ్లల్లో వాళ్లకి గొడవలున్నా షూటింగ్ నిర్విఘ్నంగా కొనసాగటానికే చూసేవార్ట. సెట్స్ బయట తిట్టుకోవటం.. సీన్‌లో లీనమై నటించటం వల్ల ఇంతటి ఘన విజయాన్ని సాధించిందని చెబుతున్నారు నిర్వాహకులు. 'బాలికా వధు' ప్రారంభమై నాలుగేళ్లు దాటింది. ప్రత్యూష బెనర్జీ, నేహా మర్దా, వ్యాస్, సిక్రీ, స్మితా బన్సాల్, అనూప్ సోనీ.. ఇలా ఎంతోమంది పాత్రధారులు. కొంతమంది వచ్చారు. కొంతమంది నిష్క్రమించారు.


Click it and Unblock the Notifications











