బిగ్ బాస్ 3: నాగార్జున అదరగొట్టారు.. ఈ సారి 15 మంది కత్తుల్లాంటి కంటెస్టెంట్లే!

Recommended Video

Bigg Boss Telugu 3 : Nagarjuna’s Show Kickstarts,Check Out The Details Of Contestants || Filmibeat

తెలుగు టీవీ రంగంలో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకుని 3వ సీజన్లోకి అడుగు పెట్టింది. తొలి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా సంచలన రేటింగులతో టాప్ లేపింది. గతేడాది రెండో సీజన్ నాని తనదైన శైలిలో అదరగొట్టారు. తాజాగా మూడో సీజన్ ద్వారా కింగ్ నాగార్జున రంగంలోకి దిగారు.

ఆదివారం(జులై 21) రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ 3 ఘనంగా మొదలైంది. నాగార్జున స్టైలిష్ లుక్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిగ్ బాస్ సీజన్ 1 బంగారు బాటలో నడిపిన మా పెద్దాయి తారక్ ఐ లవ్ యూ... సీజన్ 2 విజయవంతంగా అదే బాటలో నడిపిన నా గోల్డ్ నాని ఐ లవ్ యూ బ్రదర్ అని వ్యాఖ్యానించారు.

బిగ్ బాస్ చాలా సంస్కార వంతమైన షో, కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ఒకే ఇంటిలో ఒకే దగ్గర బంధాలతో అను బంధాలతో నడిపే షో.... అంటూ నాగార్జున దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కింగ్ తన కుటుంబం గురించి గుర్తు చేసుకున్నారు. మా ఇంట్లో 30 మంది ఉంటారు. అందరినీ కలిపేందుకు నాన్నగారు ఒక రూల్ పాస్ చేశారు. ప్రతి ఆదివారం అందరూ ఆయన సూచన మేరకు కలిసి సరదాగా గడిపేవారం. ఇపుడు ఆయన వెళ్లిపోయారు.. కానీ బంధాలు, అనుబంధాలు అలాగే ఉన్నాయి థాంక్యూ నాన్న.. కానీ ఈ బిగ్ బాస్ ఇంట్లో ఉండేది 15 మంది మాత్రమే అని నాగార్జున తెలిపారు.

కంటెస్టెంట్ నెం.1 సావిత్రి

బిగ్ బాస్ హౌస్‌లోకి మొదటి కంటెస్టెంటుగా V6 యాంకర్ సావిత్రి(శివ జ్యోతి) ఎంటరయ్యారు. నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామం నుంచి మొదలైన ఆమె ప్రస్తానం ప్రోమో రూపంలో చూపించారు. ట్రంకు పెట్టె పట్టుకుని అచ్చమైన తెలంగాణ యువతిగా సావిత్రి ఎంటరయ్యారు.

కంటెస్టెంట్ నెం. 2 రవికృష్ణ

టీవీ సీరియల్స్ యాక్టర్ రవికృష్ణ రెండో కంటెస్టెంటుగా ఎంటరయ్యాడు. బిగ్ బాస్ లోకి సెకండ్ పార్టిసిపెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన రవికృష్ణకు సావిత్రి వెల్ కమ్ చెప్పింది.

కంటెస్టెంట్ నెం.3 అషురెడ్డి

బిగ్ బాస్ 3లో మూడో కంటెస్టెంటుగా సోషల్ మీడియా సెలబ్రిటీ అషురెడ్డి ఎంటయ్యారు.

కంటెస్టెంట్ నెం.4 జాఫర్

బిగ్‌బాస్ హౌస్‌లోకి నాలుగో కంటెస్టెంటుగా టీవీ 9 రిపోర్టర్ జాఫర్ ఎంటయ్యారు.ఈ సందర్భంగా నాగార్జున... ఎప్పుడైనా తప్పుడు ఇంటర్వ్యూలు చేశారా అని ప్రశ్నించారు. దానికి జాఫర్ స్పందిస్తూ చాలా చేశా అంటూ సమాధానం ఇచ్చారు.

కంటెస్టెంట్ నెం.5... హిమజ

బిగ్ బాస్ ఇంట్లోకి 5వ కంటెస్టెంటుగా సినిమా, టీవీ నటి హిమజ ఎంటరయ్యారు. తన సొంతూరు గుంటూరు జిల్లా వీర్లపాలెం అని హిమజ తెలిపారు. హౌస్‌లో చాలా కూల్‌గా ఉంటానని, ఎవరైనా గిల్లినా గిల్లించుకోను అని తెలిపారు.

6వ కంటెస్టెంటుగా రాహుల్ సిప్లిగంజ్

బిగ్ బాస్ ఇంట్లోకి ఆరో కంటెస్టెంటుగా ప్రముఖ తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎంటరయ్యారు. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో తెలుగులో పలు మాస్ సాంగ్స్‌తో రాహుల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

7వ కంటెస్టెంటుగా

బిగ్ బాస్ ఇంట్లోకి 7వ కంటెస్టెంటుగా రోహిణి ఎంటయ్యారు. నాగార్జున తరహాలో మిమిక్రి చేసి అలరించారు.సోగ్గాడే చిన్నినాయనా అని పిలిచావ్..నాకు ఏమిస్తావు అని నాగార్జున అడగ్గా ‘మీరు ఏం అడిగినా ఇచ్చేస్తా' అంటూ చలాకీగా సమాధానం ఇచ్చింది ఈ గడుసు పిల్ల.

8వ కంటెస్టెంట్ డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్

బిగ్ బాస్ ఇంట్లోకి 8వ కంటెస్టెంటుగా డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ ఎంటయ్యారు. తమిళనాడుకు చెందిన బాబా భాస్కర్ పలు తెలుగు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించాడు.

9వ కంటెస్టెంట్... పునర్నవి భూపాలం

బిగ్ బాస్ ఇంట్లోకి 9వ కంటెస్టెంటుగా పునర్నవి భూపాలం ఎంటరయ్యారు. తెలుగులో సినిమాల్లో చిన్న పాత్రలో చేస్తూ పాపులర్ అయిన పుర్నవి... ఇంట్లోకి వెళ్లిన తర్వాత తనదైన శైలిలో అదరగొడతాను అని తెలిపారు.

10వ కంటెస్టెంట్ హేమ

బిగ్ బాస్ ఇంట్లోకి 10వ కంటెస్టెంటుగా ప్రముఖ తెలుగు నటి, మూవీ ఆర్టిస్ట్ అసియేషన్ ఉపాధ్యక్షురాలు, ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న హేమ ఎంటరయ్యారు. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తర్వాత నటించడం ఏమీ ఉండదని, తనకు ఏది రైట్ అనిపిస్తే అది చేస్తానని తెలిపారు.

11వ కంటెస్టెంట్ అలీ రెజా

బిగ్ బాస్ ఇంట్లోకి 11వ కంటెస్టెంటుగా టీవీ నటుడు అలీరెజా ఎంటరయ్యారు. మిస్టర్ మజ్ను టైటిల్ సాంగుతో ఎంట్రీ ఇచ్చిన అలీరెజా తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శించాడు. నాగార్జున మాట్లాడుతూ సిక్స్ ప్యాక్ వెనక చాలా కస్టం దాగి ఉంటుందని, దాన్ని కాపాడు కోవడం కూడా అంత ఈజీ కాదన్నారు.

12వ కంటెస్టెంట్ మహేష్ విట్టా

యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోల ద్వారా పాపులర్ అయిన మహేష్ విట్టా 12వ కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన మహేష్ విట్టా... ఇంటర్నెట్లో పాపులర్ అయిన తర్వాత సినిమా అవకాశాలు వరించాయి. అలా ఇపుడు బిగ్ బాస్ షో వరకు వచ్చాడు.

13వ కంటెస్టెంగా శ్రీముఖి

బిగ్ బాస్ ఇంట్లోకి 13వ కంటెస్టెంటుగా పటాస్ ఫేం శ్రీముఖి ఎంటరయ్యారు. మాస్ మసాలా సాంగులకు డాన్స్ చేస్తూ శ్రీముఖి గ్లామరస్‌గా ఎంటరయ్యారు. ఓసే రాములమ్మ పాటకు ఆమె చేసిన డాన్స్ ఈ షో మొత్తానికే హైలెట్ అయింది. బిగ్ బాస్ కోసం ఆమె పటాస్ షోను సైతం వదులుకున్న సంగతి తెలిసిందే.

14వ కంటెస్టెంటుగా వరుణ్ సందేశ్

బిగ్ బాస్ ఇంట్లోకి 14వ కంటెస్టెంటుగా వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న వరుణ్... ఇలా అనూహ్యంగా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు.

15వ కంటెస్టెంటుగా వితికా షేరు

వరుణ్ సందేశ్ తర్వాత 15 కంటెస్టెంటుగా ఆయన భార్య, నటి వితికా షేరు ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి సినిమాల్లో నటించారు. ఇపుడు బిగ్ బాస్ ఇంట్లో కాపురం పెట్టడానికి రావడంతో మున్ముందు ఏం జరుగబోతోంది? అనేది ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X