For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: లోబోకు ఈ సారి అలాంటి షాక్.. చరిత్రలో ఎవరూ అలా ఎలిమినేట్ కాలేదు.. ఆ ఆరుగురు శత్రువులు

  |

  తెలుగు బుల్లితెరపై కొంత కాలంగా పూర్తి స్థాయిలో ప్రయోగాత్మక, సరికొత్త కార్యక్రమాలు చాలా వస్తున్నాయి. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ షోలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి. ఇండియాలోని ఎన్నో భాషల్లో ఇది ప్రసారం అవుతోన్నా.. మన షోకు మాత్రమే జాతీయ స్థాయిలో రేటింగ్ దక్కుతోంది. ఫలితంగా ఇది రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో భారీ అంచనాలతో గత నెలలో ఐదో సీజన్ ప్రారంభం అయింది. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. ఈ నేపథ్యంలో ఎనిమిదో వారానికి గానూ లోబో బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  Recommended Video

  Bigg Boss Telugu 5:హౌస్ లో ఆమె క్లీన్ పర్సన్.. Ravi గురించి ఏమీ మాట్లాడను - Lobo | Filmibeat Telugu
  రసవత్తరంగా సాగించేలా ప్లాన్ చేశారు

  రసవత్తరంగా సాగించేలా ప్లాన్ చేశారు

  తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఐదో సీజన్‌కు ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే 19 మంది కంటెస్టెంట్లను తీసుకొచ్చి.. గొడవలు, బూతులు, రొమాన్స్ చూపిస్తూ పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఈ ఉత్సాహంతోనే షోను మరింత రసవత్తరంగా మార్చేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వీక్ డేస్‌తో పాటు వీకెండ్స్‌లో మంచి రేటింగ్‌ను అందుకుంటున్నారు.

  బెడ్‌పై బ్రాతో బాలయ్య హీరోయిన్: దారుణమైన ఫోజులతో అందాల ఆరబోత.. చూసి తట్టుకోవడం కష్టమే

  దీవాళీ ఎపిసోడ్ అదుర్స్ అనిపించేలా

  దీవాళీ ఎపిసోడ్ అదుర్స్ అనిపించేలా

  ఈ ఆదివారం బిగ్ బాస్ షోలో దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. తారల తళుకుల మధ్య దాదాపు నాలుగు గంటల పాటు ఈ ఎపిసోడ్‌ ప్రసారం అయింది. ఇందులో మోనాల్ గజ్జర్, ఆరియానా గ్లోరీ, అవికా గోర్ వంటి భామ డ్యాన్సులు అదిరిపోయాయి. అలాగే, శ్రీయ, సుమ ఎంట్రీ స్పెషల్ అట్రాక్షన్ అయింది. వీళ్లతో పాటు సోహైల్, అవినాష్, బాబా భాస్కర్ తమదైన కామెడీతో అలరించారు. ఇక, ఈ ఎపిసోడ్‌లో దేవరకొండ బ్రదర్స్ 'పుష్పక విమానం' ప్రమోషన్స్ నిర్వహించారు. అలాగే, 'మంచి రోజులు వచ్చాయ్' టీమ్ కూడా కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించింది.

  ఒక్కొక్కరూ సేఫ్.. చివర్లో మాత్రం అలా

  ఒక్కొక్కరూ సేఫ్.. చివర్లో మాత్రం అలా


  ఎనిమిదో వారం ఎంతో ఎమోషనల్‌గా జరిగిన నామినేషన్స్ టాస్కులో లోబో, యాంకర్ రవి, సింగర్ శ్రీరామ చంద్ర, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్‌, మానస్‌లు నామినేట్ అయిపోయారు. వీరిలో ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో ఒక్కొక్కరినీ సేఫ్ చేసుకుంటూ వచ్చారు. ముందుగా మానస్, ఆ తర్వాత వరుసగా షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్, శ్రీరామ్‌లను సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఇక, చివర్లో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన రవి, లోబోను ఉంచారు. దీంతో హౌస్‌లోని వాళ్లతో పాటు ప్రేక్షకులంతా ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ఆసక్తితో ఎదురు చూశారు.

  Unstoppable: బాబుకు టీడీపీని ఎందుకిచ్చావ్ అన్న మోహన్ బాబు.. చిరును లాగుతూ బాలయ్య షాకింగ్ రియాక్షన్

  బిగ్ బాస్ నుంచి లోబో ఎలిమినేషన్

  బిగ్ బాస్ నుంచి లోబో ఎలిమినేషన్


  బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోనూ ఎంటర్‌టైనర్‌గా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఇక, ఈ సీజన్‌లో మాత్రం యాంకర్ కమ్ కమెడియన్ లోబో ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. తనదైన శైలి వ్యవహార శైలితో అందరినీ నవ్విస్తున్నాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో ఉన్న ఆడవాళ్లను తెగ ఏడిపిస్తున్నాడు. అలాంటి లోబో ఆదివారం జరిగిన దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో షో నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో గత వారం నామినేషన్స్‌లో ఉన్న యాంకర్ రవి, సింగర్ శ్రీరామ చంద్ర, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్‌, మానస్‌లు సేఫ్ అయినట్లు అయింది.

  ఐదుగురు మిత్రులు... వాళ్లు మాత్రం

  ఐదుగురు మిత్రులు... వాళ్లు మాత్రం


  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హోస్ట్ అక్కినేని నాగార్జునతో ముచ్చటించాడు లోబో. ఆ సమయంలో అతడితో ఓ గేమ్ ఆడించాడు. అందులో హౌస్‌లో ఉన్న వారిలో ఐదుగురు మిత్రులు ఎవరో చెప్పమని నాగార్జున కోరాడు. దీంతో లోబో.. ప్రస్తుతం ఉన్న వారిలో విశ్వ తనకు సలహాలు ఇస్తుంటాడని.. సన్నీదీ తనదీ ఒకే మనస్తత్వం అని.. కాజల్ ఈ ఇంట్లో ఉన్న వారిలో క్లీన్ పర్సన్ అని, బయట జనాలకు ఆమెనే కనిపిస్తుందని.. ఆనీ గొప్పగా ఆడుతుందని.. రవి గురించి ఏమీ చెప్పనని చెప్పాడు. మిగిలిన వాళ్లను శత్రువులు అని పరోక్షంగా వెల్లడించాడు.

  Bigg Boss: షో చరిత్రలో ఇలా జరగడం తొలిసారి.. టాప్ కంటెస్టెంట్ చెత్త రికార్డు.. ఆమె వల్లే ఇలా!

  షోలో ఎవరూ అలా ఎలిమినేట్ కాలేదు

  షోలో ఎవరూ అలా ఎలిమినేట్ కాలేదు


  బిగ్ బాస్ హౌస్‌లో ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చినప్పటికీ లోబో అప్పుడప్పుడు వివాదాస్పద తీరుతో పలు గొడవల్లో భాగం అయ్యాడు. ఇలా హౌస్‌లో ఉన్న కొందరితో శృతి మంచి మరీ వాదానలకు దిగాడు. ఒకానొక సందర్భంలో ప్రియపైకి దూసుకుని వెళ్లాడు. దీంతో నాగార్జున నుంచి చీవాట్లు కూడా తిన్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఎలిమినేట్ అయ్యాడని సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లాడు. ఆ వెంటనే మళ్లీ హౌస్‌లోకి వచ్చాడు. ఇలా వచ్చిన రెండు వారాలకే ఈ సారి ఏకంగా బయటకు వెళ్లిపోయాడు. ఇలా షో చరిత్రలో ఎవరూ ఎలిమినేట్ కాకపోవడం గమనార్హం.

  వాళ్లలో ఒకరు విన్నర్.. ఒకరు రన్నర్

  వాళ్లలో ఒకరు విన్నర్.. ఒకరు రన్నర్

  బిగ్ బాస్ షో చరిత్రలో లోబో ఎలిమినేషన్‌ ఇప్పుడు సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చింది. దీనికి కారణం.. కొద్ది రోజుల క్రితమే అతడు సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లడమే. బిగ్ బాస్ షో చరిత్రలో ఇప్పటి వరకూ ముమైత్ ఖాన్, రాహుల్ సిప్లీగంజ్, అఖిల్ సార్థక్‌లు ఎలిమినేషన్ పేరుతో సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లారు. అందులో ముమైత్‌ను మినహాయిస్తే మిగిలిన మేల్ కంటెస్టెంట్లు అందరూ ఫినాలేలో అడుగు పెట్టారు. అంతేకాదు, రాహుల్ మూడో సీజన్ విన్నర్ అవగా.. అఖిల్ నాలుగో సీజన్‌లో రన్నర్‌గా నిలిచాడు. దీంతో లోబో కూడా ఫినాలేలోకి వెళ్తాడని అంతా అనుకున్నారు.

  English summary
  Telugu Top Reality TV Series Bigg Boss 5th Season Running Successfully. In 8th Week Lobo Eliminated From The show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X