ప్రియను వెనకాల నుంచి పట్టుకొని ఎమోషనల్ అయిన లోబో.. రవి చెప్పగానే హఠాత్తుగా వెళ్లి..

బిగ్ బాస్ కాంట్రవర్సీ తో కొనసాగే రియాలిటీ షో అయినప్పటికీ ఎప్పటికప్పుడు సరికొత్త గొడవలతో కంటెస్టెంట్స్ కొత్త అనుభవాలు నేర్పుతుంది. పోటిదారులు ఎంత సీరియస్ గా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఊహించని విధంగా ఎమోషనల్ అవుతుంటారు. కొందరు కావాలని ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు డ్రామాలు కూడా ప్లే చేస్తూ ఉంటారు. కొందరు నిజంగానే అనుకోకుండా కంటతడి పెడుతున్నారు. అయితే ఈ సారి హౌస్ లో ఆర్టిస్ట్ ప్రియా కొన్ని చేదు అనుభవాల కారణంగా నిజంగానే హార్ట్ అయ్యారు. ఇక ఈ వారం హఠాత్తుగా లోబో ప్రియను అందరూ చూస్తుండగానే వెనకాల నుంచి కూర్చున్నచోట హగ్ చేసుకోవడం ఆశ్చర్యపరిచింది.

Photo Courtesy: Star మా and Disney+Hotstar

లోబో ఆగ్రహం

లోబో ఆగ్రహం

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ సమయంలో వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరినొకరు తిట్టుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అక్కడే అసలైన ఆట మొదలవుతుంది. ఇక నాలుగో వారం నామినేషన్స్ లో కూడా గతంలో కంటే ఎక్కువ స్థాయిలో గొడవలు జరిగాయి. ముఖ్యంగా ప్రియపై లోబో ఆగ్రహంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే కంటతడి కూడా పెట్టుకున్నాడు.

గత వారం ప్రియ ఎమోషనల్

గత వారం ప్రియ ఎమోషనల్

గత వారం ప్రియా యాంకర్ రవి అలాగే లహరి మ్మధ్యలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ప్రియ చేసిన కామెంట్లు రవికి ఒక్కసారిగా కోపాన్ని తెప్పించాయి. అయితే ఆ తర్వాత రవి బ్యాక్ గ్రౌండ్ లో చేసిన కొన్ని కామెంట్స్ నిజమని తెలియడంతో ప్రియ సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ఇక మధ్యలో బలిపశువుగా మారిన హరి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో ఎక్కువగా ప్రియ కంటతడి పెట్టుకుంది.

సినిమా కథ అనడంతో..

సినిమా కథ అనడంతో..

ఇక ఈ వారం కూడా లోబో చేసిన కామెంట్స్ కు ఒక విధంగా ప్రియా చాలా ఎమోషనల్ అయ్యింది. తన నిజ జీవితంలోని మొదటి ప్రేమ గురించి చెబుతూ ఉంటే ప్రియ సినిమా కథ చెబుతున్నాడు అని అనడం తనకు ఏమాత్రం నచ్చలేదు అని అందుకే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లోబో కారణం చెప్పేసాడు. ఇక ఆ తర్వాత ప్రియ ప్రతి స్పందించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ లోబో గట్టిగా అరిచాడు కూడా.

 ప్రియను హగ్ చేసుకున్న లోబో

ప్రియను హగ్ చేసుకున్న లోబో

ఇక ప్రియా అదే బాధతో ఉన్నట్లు అర్థమైంది. ఇక ఇది వరకే ఒకసారి ప్రియను అనుకోకుండా రవి బాధపెట్టాడు. అయితే మళ్ళీ లోబో వల్ల బాధ పడకూడదు అని అర్థమయ్యేలా చెప్పాడు. వెళ్లి ఆ విషయాన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పగానే లోబో ప్రియ దగ్గరకు వెళ్లి ఆమెను కూర్చున్న చోటే గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.

Recommended Video

#BiggBossTelugu5 : Lobo, Nataraj Master Lost It Completely || Filmibeat Telugu
మొదటిసారి చాలా దగ్గరగా

మొదటిసారి చాలా దగ్గరగా

హఠాత్తుగా లోబో ప్రియ దగ్గరికి తీసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే ఇంత వరకు బిగ్ బాస్ హౌస్ లో దాదాపు అందరి మధ్యలో ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. కానీ మొదటిసారి లోబో ప్రియ ఇద్దరు కూడా చాలా దగ్గరగా కనిపించారు. అందరూ కూడా లోబోని అభినందిస్తూ గట్టిగా అరిచారు. అయితే ఎంత ఎమోషనల్ అయినా కూడా మళ్లీ నామినేషన్ సమయానికి మారిపోతూ ఉంటారని మరోవైపు షన్ను జెస్సి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X