Bigg Boss Telugu 5 బిగ్‌బాస్‌లోకి లోబో రీ ఎంట్రీ.. గ్రాండ్‌గా అడుగుపెట్టిన బస్తీ బాబు
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 45వ రోజు గందరగోళం మధ్య ముగిసింది. బంగారు కోడిపెట్ట ప్రభావతి టాస్క్‌లో ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు దూసుకెళ్లి దాడి చేసుకొనేంతగా గొడవ పడ్డారు. ముఖ్యంగా వీజే సన్నీ, ప్రియ మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. అయితే అక్టోబర్ 20వ తేదీన ప్రసారమైన 45వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

బంగారు కోడిపెట్ట టాస్క్‌లో
బంగారు కోడిపెట్ట టాస్క్ రెండో రోజు కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రియను వీజే సన్నీ అనుకోకుండా తోసివేయడంతో గొడవ ప్రారంభమైంది. నాతో ఫిజికల్‌గా గేమ్ ఆడితే చెంప పగలకొడుతాను అంటూ కామెంట్ చేసింది. దాంతో కొట్టి చూడు అంటూ వీజే సన్నీ సవాల్ విసిరాడు. అయితే ప్రియాంక, అనీ మాస్టర్ మధ్యలోకి వెళ్లి గొడవను ఆపారు.

సీక్రెట్ రూమ్‌లో లోబో
సీక్రెట్ రూమ్‌లో ఉంటున్న లోబో ఇంటిలోని గొడవను చూస్తూ ఆవేశంగా అరుస్తూ కనిపించారు. సన్నీకి మద్దతు తెలియజేస్తూ గట్టిగా నూకురా.. నూకరా అంటూ గట్టిగా అరిచారు. ఆట మధ్యలో చప్పట్లు కొడుతూ గేమ్‌ను ఎంజాయ్ చేశారు. ఇలా లోబో సీక్రెట్ రూమ్‌లో అలా కనిపించారు.

జస్వంత్ పడాలకు సీక్రెట్ టాస్క్
ఇక జస్వంత్ పడాలను కన్పెషన్ రూమ్‌లోకి పిలిచి బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్ ప్రకారం.. ముగ్గురు వద్ద కోడిగుడ్లు లేకుండా జీరో చేయాలని సూచించారు. అయితే బయటకు వచ్చిన జస్వంత్.. సిరి, షణ్ముఖ్, ప్రియ వద్ద నుంచి కోడిగుడ్లు తీసుకోన్నాడు. అలా జస్వంత్ సీక్రెట్ గేమ్‌ను ఆడారు.

ప్రభాకర్, దివాకర్ టాస్క్
అయితే 45వ రోజున మరో టాస్క్ ఆడించారు. ప్రభాకర్, దివాకర్ అనే బాతులను ఇచ్చాడు. వాటిని చేతిలో పట్టుకొని కింద పడకుండా కాపాడుకోవాలని సూచించాడు. ఆ గేమ్‌ను అని మాస్టర్, సింగర్ శ్రీరామచంద్ర ఆడారు. ఓ సర్కిల్‌లో ఉంటూ ఆడిన గేమ్‌లో శ్రీరామచంద్ర ఓడిపోయారు. అనీమాస్టర్ గెలిచింది.
Recommended Video

లోబో రీ ఎంట్రీ
ఇక 45వ రోజు చివర్లో బిగ్‌బాస్ మంచి ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో రీ ఎంట్రీ ఇచ్చినట్టు ప్రోమోలో తెలిపారు. మెయిన్ గెట్ తెరుచుకోవడం, అక్కడ లోబో నిలబడి ఉండటం చూసిన రవి.. లోబో వచ్చాడు అంటూ చెప్పడంతో అందరి ముఖంలో ఆనందం కనిపించింది. యాంకర్ రవి వేగంగా పరుగెత్తుకొచ్చి లోబోను కౌగిలించుకొన్నారు. అలా లోబో ఇంటిలోకి రీఎంట్రీ ఇచ్చినట్డు ప్రోమోలో కనిపించింది. గురువారం అంటే అక్టోబర్ 21న ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో లోబో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











