హీరోలను తలదన్నేలా నిరుపమ్ పరిటాల అబ్బాయి.. డాక్టర్ బాబు కొడుకును మీరు చూశారా?

సినిమాలు కన్నా సీరియల్స్ ఎక్కువ ఈ మధ్య ఫేమస్ అవుతున్నాయి. ఒక స్టార్ హీరోకు ఎంత అభిమాన గణం ఉంటుందో.. ఒక సీరియల్ హీరోకు అంతే ఫ్యాన్ బేస్ ఉంటుంది. నిజం చెప్పాలంటే అంతకు మించే ఉంటుంది. అంతలా సీరియల్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

అయితే డాక్టర్ బాబుగా కార్తీకదీపం సీరియల్‌తో విశేషంగా పాపులారిటీని సంపాదించుకొన్న కార్తీక్ అలియాస్ నిరుపమ్ పరిటాల తాజాగా ఫ్యామిలీతో విహార యాత్ర చేస్తున్నారు. ఆయన కుటుంబం షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాళ్ల అబ్బాయి ఫోటో గురించి నెటిజన్లు భారీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Look at Doctor Babu alias Nirupam Paritala Son Akash Raj Photos viral in Social media

ఇక సీరియల్ అని చెప్పగానే చిన్నా, పెద్ద.. ముసలి, ముతక అనే తేడా లేకుండా అందరికీ తెలిసిన ఒకే ఒక్క సిరియల్ కార్తీక దీపం. ఏ ముహూర్తాన ఈ సీరియల్ ను మొదలుపెట్టారో కానీ, బుల్లితెరపై బ్లాక్ బస్టర్ సీరియల్ గా కార్తీక దీపం రికార్డ్ సృష్టించింది.ఒక సీరియల్ హీరోయిన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని దీప క్యారెక్టర్ ను చూసాక తెలిసింది అంటే అతిశయోక్తి కాదు. ఇక దీప బుల్లితెరకు మకుటం లేని మహారాణి అయితే.. డాక్టర్ బాబు మకుటం లేని మహారాజు.

కార్తీక్ గా మన అందరికీ పరిచయం అయిన నిరుపమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు ఉన్న నటుడు, రచయిత ఓంకార్ పరిటాల కుమారుడు. చిన్నతనం నుంచే ఇంట్లో సినిమా కథలు వింటూ పెరిగాడు. అలా అతనికి నటనపై ఆసక్తి కలిగింది.

మొదట సినిమాలోనే ఎంట్రీ ఇవ్వలనుకున్నాడు. కానీ, అనుకోకుండా సీరియల్స్ వైపు అడుగులు వేశాడు. అలా నిరుపమ్.. ఈటీవీ లో ప్రసారమయ్యే చంద్రముఖి సీరియల్ ద్వారా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత హీరోగా కూడా మారాలని ప్రయత్నాలు చేశాడు. కానీ, వరుసపెట్టి సీరియల్స్ చేస్తున్న టైంలో రెండు, మూడు సినిమా ఆడిషన్లలో పార్టిసిపేట్ చేస్తే.. ఆడిషన్ బాగానే ఉన్నా టీవీ సీరియల్స్ చేస్తున్నాననే కారణంగా తనను రిజెక్ట్ చేశారట.

ఇక ఆ సమయంలో చాలా బాధపడినా సీరియల్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు రావడంతో ఆనందంగానే ఉన్నట్లు తెలిపాడు. ఇక నిరుపమ్.. తన మొదటి సీరియల్ చంద్రముఖి హీరోయిన్ అయిన మంజులనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకున్న మంజుల.. ఈ మధ్యనే మళ్లీ సీరియల్స్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ జంటకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అక్షరాజ్ అతని పేరు.

ఇక మంజుల ఒక పక్క సీరియల్స్ చేస్తూనే ఇంకోపక్క యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. నిత్యం తన భర్త, కొడుకుతో ఉన్న వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా భర్త నిరుపమ్, కొడుకు అక్షరాజ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇందులో డాక్టర్ బాబు కన్నా అందరి చూపు ఆయన కొడుకు మీదనే పడింది.

తల్లి రూపం...తండ్రి పోలికలు కలబోసినట్లు అక్షరాజ్ ఎంతో అందంగా ఉన్నాడు. టీనేజ్ లో ఉన్నప్పుడే హీరోలా కనిపిస్తున్నాడు. ఇక ఈ కుర్రాడిని చూడగానే త్వరలోనే చిన్న డాక్టర్ బాబు హీరోగా ఎంట్రీ ఇస్తాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి అక్షరాజ్.. హీరోగా వస్తాడా..? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X