జీటీవీలో వేసేస్తున్నారు... చూసి పండుగ చేస్కోండి

By Srikanya

హైదరాబాద్ : గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘లౌక్యం'. దసరా కానుకగా విడుదలైన ఈ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ ను హిట్ సినిమాగా ప్రేక్షకులు డిక్లేర్ చేశారు. జనవరి 3 వ తేదీకి 100 రోజులు పూర్తి చేసుకుని రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం జీ టీవీలో సంక్రాంతి కానుకగా ఈ జనవరి 11న ప్రసారం కానుంది. సాయింత్రం 6 గంటలకు ప్రసారం చేస్తారు. ఈ చిత్రానికి మంచి టీఆర్పీ రేట్లు వస్తాయని భావిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మొదట ఒంటరిగా వెళ్లి సినిమా చూసిన వారు ఫ్యామిలీలను తీసుకెళ్లి చూసిరావటం ప్లస్ అయ్యింది. సినిమా నచ్చిన వారు పదిమందికి చెప్పారు. మౌత్‌టాక్‌ మా సినిమాకు పెద్ద ప్లస్‌ అయింది. హీరో తెరపై చాలా అందంగా కనిపించారు. రకుల్‌ చక్కగా నటించింది. బ్రహ్మానందం, పృథ్వి పాత్రలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యాయి. హంసా నందిని కేరక్టర్‌ని ఎవరూ ఎక్ప్‌పెక్ట్‌ చేయట్లేదు. అనూప్‌ సంగీతం, వెట్రి ఫోటోగ్రఫీ హైలైట్‌ అయ్యాయి. టోటల్‌ టీమ్‌ కలిసి హిట్‌ సినిమాకు పనిచేస్తున్నామనే భావనతో పనిచేశారు. వాళ్ల నమ్మకం నిజమైంది.

Loukyam treat on small screen

రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు కోన వెంకట్ - గోపి మోహన్ ద్వయం అందించిన స్క్రీన్ ప్లే, శ్రీధర్ సీపాన రాసిన కామెడీ పంచ్ డైలాగులు బాగా పేలడంతో సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. వినోదానికి లోటు లేకపోవడం సినిమా మెయిన్ ప్లస్ పాయింట్. ఈ సినిమాతో నిర్మాతకు కాసుల పంట పండింది.

శ్రీవాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. బ్రహ్మానందం, 30 ఇయర్స్ పృథ్వి, హంసానందిని ల పాత్రలు సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. కోనా వెంకట్, గోపీ మోహన్ ల రచనా చాతుర్యం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Loukyam treat on small screen

ఇది ఓ లవ్‌స్టోరీ. ఇందులో హీరో పేరు వెంకటేశ్వర్లు. వెంకీ అని పిలుస్తుంటారు. సాయపడే గుణం ఎక్కువ. స్నేహితుల కోసం ఎంత రిస్కయినా చేస్తాడు. అలా ఓ స్నేహితునికి సాయపడేప్పుడు అతని కథ ఎలాంటి మలుపు తిరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. హీరో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ పరిస్థితులను చక్కదిద్దుతుంటాడు. అందుకే ‘లౌక్యం' యాప్ట్‌ టైటిల్‌.

కొన్ని సినిమాలకు అన్నీ కుదురుతాయి. అలాంటి సినిమాలు ప్రేక్షకులను ఇట్టే మెప్పిస్తాయి. ‘లౌక్యం' సరిగ్గా అలా అన్నీ కుదిరిన సినిమా. పాత్రలకు తగ్గ తారాగణం కానీ, సాంకేతిక నిపుణులు కానీ, నిర్మాణ సంస్థ కానీ.. బాగా సెట్టయ్యాయి. వెట్రి సినిమాటోగ్రఫీకి చాలా పేరొస్తుంది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ లేనంత అందంగా ఈ సినిమాలో గోపీచంద్‌ను చూపించాడు.

అనూప్‌ రూబెన్స్‌ అసాధారణమైన సంగీతాన్నిచ్చాడు. తొలిసారి అతను ఓ కమర్షియల్‌ యాక్షన్‌ కామెడీ సినిమాకు పనిచేశాడు. రీరికార్డింగ్‌ కూడా అద్భుతంగా చేశాడు. ఇందులో రకుల్‌ప్రీత్‌ పేరు చంద్రకళ. గోపీ హైట్‌కు బాగా మ్యాచ్‌ అయ్యింది. ఎంతో ఎనర్జిటిక్‌గా పర్ఫామ్‌ చేసింది.

చంద్రమోహన్‌, బ్రహ్మానందం కాంబినేషన్‌ సీన్లు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. వాళ్లిద్దరూ కలిసి స్ర్కీన్‌ మీద కనిపిస్తే చాలు, మనకు నవ్వు వచ్చేస్తుంది. చంద్రమోహన్‌ పేరు మేకా పాపారావు అయితే, ముద్దుగా పప్పీ అని పిలుస్తుంటారు. బ్రహ్మానందం పేరు సిప్పీ. పప్పీ-సిప్పీగా వాళ్లిద్దరూ తెగ నవ్విస్తారు. అలాగే పృథ్వీ కూడా బాగా నవ్విస్తాడు. హంసానందిని ఇందులో బ్రహ్మానందం భార్యగా ఓ స్పెషల్‌రోల్‌లో కామెడీ పండించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X