twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ఆమె ఊరమాస్.. తప్పుగా అంచనా వేశావు.. జ్వాలాను ముద్దు పెట్టుకొన్న సౌందర్య

    |

    డబ్బులు కింద పడేసుకొంటున్నారేంటి? పోగట్టుకొంటే డబ్బులైనా, మనుషులైనా తిరిగి రాబట్టుకోవడం కష్టం. ఏమైనా సరే.. కష్టపడితేనే వస్తాయి మేడమ్.. ఊరికే రావు కదా.. వస్తా మేడమ్.. ఆరోగ్యం జాగ్రత్త. అయినా ఈ ఇంట్లో డాక్టర్లు ఉండగా.. మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాలా? అని జ్వాలా అంటే.. ఏయ్ అంటూ స్వప్న గట్టిగా అరిచింది. దాంతో తల్లిని పక్కకు తీసుకెళ్లగా.. ఏంటే రెచ్చిపోతున్నావు అంటూ డాక్టర్ శోభ ఆవేశంగా అరిచింది. దాంతో నేను చిన్నప్పటి నుంచి అంటే అంటూ జ్వాలా తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. దాంతో ఎక్కువ చేయకు.. నా సంగతి తెలియదు. నేను చాలా డేంజర్ అని శోభ అంటే.. నా సంగతి తెలిసింది కదా అని జ్వాలా చేతిని చూపించింది. కార్తీకదీపం తాజా సీరియల్‌ 1362 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    మీ అమ్మ వద్దకు వెళ్తావా? ప్రేమ్ అంటూ

    మీ అమ్మ వద్దకు వెళ్తావా? ప్రేమ్ అంటూ

    నిరుపమ్‌తో హిమ నిశ్చితార్థం అంశం విషయంలో ప్రేమ్ ఇంకా బాధ పడుతూనే ఉన్నాడు. హిమను తలచుకొని.. ఫోన్‌లో ఆమె ఫోటో చూస్తూ ఆలోచనల్లో పడిపోయాడు. నిరుపమ్‌తో పెళ్లి వద్దని చెప్పింది. ఆమె మనసులో ఏముంది? నేను ఇష్టమని కనీసమైనా చెప్పాలి కదా అని ప్రేమ్ మనసులో అనుకొన్నాడు. ప్రేమ్ అదోలా ఉండటాన్ని చూసి.. మీలో ఏదో మార్పు కనిపిస్తున్నది. మీ అమ్మ మీద బెంగపెట్టుకొన్నావా? మీ అమ్మ దగ్గరికి వెళ్తావా? ఏదైనా పోగొట్టుకొన్నావా? అని తండ్రి సత్యం అంటే.. నాకు అంత ఓపికగా లేదు. నేను మమ్మిని భరించలేను అని ప్రేమ్ అన్నాడు.

    జ్వాలాకు ఎలా బుద్ది చెప్పాలి? అని శోభ

    జ్వాలాకు ఎలా బుద్ది చెప్పాలి? అని శోభ


    ఇదిలా ఉండగా, జ్వాలా చేతిలో చెంపదెబ్బ తినడం గురించి ఆలోచిస్తూ డాక్టర్ శోభ కసిగా కనిపించింది. జ్వాలాకు ఎలా బుద్ది చెప్పాలా అనే ఆలోచనల్లో పడింది. ఒక్కో సమస్యను మెల్లగా విప్పుకొంటు వెళ్తాను. అప్పుడే నిరుపమ్‌ను దారిలోకి తెచ్చుకోవాలి. నిరుపమ్‌ను ఆమెతో కట్ చేయాలి. దాని ఇల్లు ఎక్కడో తెలుసుకోవాలి. నిరుపమ్ మనసు మార్చి.. నా మెడలో తాళి కట్టించుకోవాలి. అప్పు చేసిన కట్టిన హాస్పిటల్‌లో నిరుపమ్ నేను కలిసి పనిచేయాలి. నిరుపమ్ మనసు మార్చడమే నా ముందు ఉన్న కర్తవ్యం అని శోభ పలు విధాలుగా ఆలోచించింది.

    కొడుకును తలచుకొని సౌందర్య ఎమోషనల్

    కొడుకును తలచుకొని సౌందర్య ఎమోషనల్


    బాబాయ్ ఇంద్రుడు తప్పతాగి తూలిపడుతుంటే.. జ్వాలా తన భుజాల మీద మోసుకు రావడాన్ని సౌందర్య చూసింది. వెంటనే కారు ఆపి జ్వాలా బాబాయ్‌ని పట్టుకొని ఆటోలో కూర్చోపెట్టింది. ఇలా మీ బాబాయ్ తాగి తూలుతుంటే నీకు కోపం ఎందుకు రావడం లేదు. కోపానికి బదులు నీ కళ్లలో ప్రేమ కనిపిస్తున్నది అంటే.. నాకు బాబాయ్ తాగితే కోపం ఎందుకు రావాలి.. నన్ను ప్రేమగా చూసుకొంటాడు అని జ్వాలా సమాధానం చెప్పింది. అయితే నీ కొడుకు తాగి వస్తే నీకు కోపం వస్తుందా అని జ్వాలా ఎదురు ప్రశ్న వేస్తే.. సౌందర్య తన కుమారుడు కార్తీక్ గురించి ఆలోచించి ఎమోషనల్ అయింది. దాంతో హలో మేడమ్ ఆలోచిస్తున్నారు అంటూ అడిగితే.. సౌందర్య వచ్చి జ్వాలా నుదిటిపై ముద్దు పెట్టుకొన్నది. నా హృదయాన్ని టచ్ చేశావు. నా కొడుకును గుర్తు చేశావు. నీకు మంచి మొగుడు రావాలని కోరుకొంటున్నాను. జాగ్రత్తగా తీసుకెళ్లు అంటూ సౌందర్య ఎమోషనల్ అయింది.

     మరో అమ్మాయితో తిరుగు అంటూ

    మరో అమ్మాయితో తిరుగు అంటూ


    తనను పెళ్లి చేసుకోనని హిమ తీసుకొన్న నిర్ణయాన్ని డాక్టర్ శోభకు నిరుపమ్ చెప్పాడు. అయితే నన్ను పెళ్లి చేసుకొనని చెప్పింది. కానీ నాపై ఆమె మనసులో ఇష్టం ఉంది. కానీ బయటకు ఇష్టం లేనట్టు నటిస్తున్నది అని శోభతో నిరుపమ్ అన్నాడు. అయితే నీవు ఒక ప్లాన్ చేయి.. ఆమె ముందు మరో అమ్మాయితో తిరుగు. హిమ చూడగానే ఆమె మనసులో ఏముందో వెంటనే తెలుస్తుంది అని డాక్టర్ శోభ సలహా ఇచ్చింది. అయితే ఆ సలహా బాగుంటుందా అని నిరుపమ్ ఆలోచిస్తున్న సమయంలో నేను చెప్పిన ఐడియా బాగాలేదా? అంటూ శోభ అడిగితే.. ప్లాన్ బాగుంది అంటూ నిరుపమ్ సమాధానం ఇచ్చాడు.

    దేవుడా జ్వాలా నిరుపమ్ ఇలానే ఉండాలి..

    దేవుడా జ్వాలా నిరుపమ్ ఇలానే ఉండాలి..


    డాక్టర్ శోభ, నిరుపమ్ మాట్లాడుకొంటుండగా అంతలోనే అక్కడికి జ్వాలా వచ్చింది. గదిలో ఇద్దరు ఉండగా.. బిజీగా ఉన్నారా? అని జ్వాలా అడిగితే.. అదేం లేదు అంటూ సమాధానం చెప్పాడు.. అయితే నాకు టిఫిన్ బాక్స్ ఇస్తే నేను వెళ్లిపోతాను అని అంటే.. టిఫిన్లపై ఆడవాళ్లకు బాగానే ప్రేమ ఉంటుంది అని అంటూ.. నీతో పని ఉందంటూ నిరుపమ్ దగ్గరకి వచ్చాడు. హిమ ఎక్కడుంది అంటే బయట లాన్‌లో కూర్చొన్నది అని జ్వాలా చెప్పింది. దాంతో జ్వాలా చేయిపట్టుకొని నిరుపమ్ బయటకు వెళ్లాడు. అలా జ్వాలా చేయిపట్టుకొని నిరుపమ్ రావడాన్ని చూసి.. హిమ సంతోషంలో మునిగిపోయింది. దేవుడా వీరిద్దరూ ఎప్పడూ ఇలాగే ఉండిపోవాలి అని హిమ మనసులో కోరుకొన్నది.

    జ్వాలా తప్పుగా అంచనా వేశావు..

    జ్వాలా తప్పుగా అంచనా వేశావు..


    జ్వాలాను పట్టుకొని నిరుపమ్ వెళ్లిపోవడం చూసి డాక్టర్ శోభ కంగారు పడిపోయింది. నేను చెప్పింది ఇలా అర్ధమైందా అంటూ కంగారు పడిపోయి.. స్వప్న వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. జ్వాలాను తప్పుగా అంచనా వేశాను అని శోభ అంటే.. అది జ్వాలా ఊరమాస్ అని స్వప్న అంటే.. నేనే మరో అమ్మాయితో ఉండమని చెప్పాను. కానీ నాతో ఉంటాడని అనుకొన్నాను. అయితే జ్వాలాను తీసుకొని వెళ్లాడు. జ్వాలాను ఆఫ్టరాల్ ఆటో డ్రైవర్ అనుకొన్నాను. కాస్త టైమ్ ఇస్తే.. నిరుపమ్‌ను బుట్టలో వేసుకొంటుంది. నా తెలివితేటలు ఉపయోగించి ఈ సిటీలో లేకుండా చేస్తాను అని డాక్టర్ శోభ శపథం చేసింది.

     నిరుపమ్, జ్వాలా లవ్ యాంగిల్

    నిరుపమ్, జ్వాలా లవ్ యాంగిల్


    మరో అమ్మాయితో తిరిగితే హిమ మనసులో ఏముంటుందో తెలుస్తుంది అనే సలహాను పాటిస్తూ.. జ్వాలా, నిరుపమ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడికి హిమ రావడంతో ఏయ్ అంటూ జ్వాలా పిలిచింది. ఏం కావాలి అంటే.. నాకు ఐస్ క్రీమ్ పడదు. నాకు వేడి వేడి సూప్ కావాలి అంటూ ఆర్డర్ఇచ్చింది. దాంతో మా ఇద్దరిని చూసి హిమ రగిలిపోతుందని నిరుపమ్ మనసులో అనుకొన్నాడు. సరికొత్త ప్రేమ వ్యవహారం ఆసక్తిగా మారింది.

     కార్తీకదీపం 20వ వారం రేటింగ్

    కార్తీకదీపం 20వ వారం రేటింగ్


    ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్ రేటింగ్ మరింత పడిపోయింది. గతవారం 11.60 నమోదు కాగా.. తాజా వారం అంటే ఈ ఏడాది 20వ వారంలో కార్తీకదీపం సీరియల్ రేటింగ్ మరింత క్షీణించింది. ఈ వారం 11.16గా నమోదైంది. ఐపీఎల్ టోర్ని జరుగుతుండటం, అది కాకుండా సీరియల్‌లో సాగదీత ఎక్కువ కావడం.. అక్కడక్కడే కథ తిరగడం సీరియల్‌పై ప్రేక్షకులకు విసుగు పుట్టేలా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    English summary
    Karthika Deepam May 26th Episode number 1362. love drama between Nirupam, Jwala creates interesting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X