ప్రేమ విఫలం, పిచ్చివాడైన యువకుడు.. టీవీ నటి ఇంటికెళ్లి గొడవ!

టీవీ నటి ఇంట్లో చొరబడి ఆమెతో తనకు పెళ్లి జరిపించాలని ఓ యువకుడు గొడపడ్డ సంఘటన కోయంబత్తూర్‌లో చోటు చేసుకుంది. ఈ విషయమై ఆమె కుటుంబ సభ్యులు, చుట్టు పక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

బెదిరింపులకు పాల్పడిన యువకుడిని 24 ఏళ్ల భరత్‌గా గుర్తించారు. గోబిచెట్టిపాళ్యానికి చెందిన భరత్ వడపలని ప్రాంతంలో తన తండ్రితో కలిసి నివాసం ఉంటున్న టీవీ నటి రితికా అపార్టుమెంటుకు చేరుకున్నాడు. వెళ్లి తలుపు తట్టగా ఆమె తండ్రి డోర్ తీశారు. తనను తాను పరిచయం చేసుకుని మీ కూతురుతో పెళ్లి జరిపించాలని గొడవ చేశాడు. వెంటనే పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Love failure Engineering graduate hulchul at TV actress house

పోలీసులు అతడి తల్లిదండ్రులను పిలిపించగా... భరత్ మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాడని, అతడికి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నట్లు మెడికల్ రికార్డులు పోలీసులు అప్పగించారు. అతడు కోయంబత్తూరులో చదువుకుంటున్న సమయంలో ఓ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని, ఆమె పెళ్లికి నిరాకరించడంతో పిచ్చివాడైపోయాడని తెలిపారు.

భరత్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కోయంబత్తూరు నుంచి గోవా వెళ్లే ఫ్లైట్ మిస్సయిన తర్వాత... సిటీలోనే తిరుగుతూ తన గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు టీవీ నటి రితిక ఇంటికి చేరుకుని గొడవ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రితికా ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు.

భరత్ మానసిక పరిస్థితి తెలుసుకుని ఫిర్యాదు చేయకుండా అతడి పేరెంట్స్‌తో పంపించేందుకు అంగీకరించారు. రితికా తమిళంలో 'రాజా రాణి' సీరియల్‌తో పాటు పలు టీవీ కార్యక్రమాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X