యాంకర్ ప్రదీప్ ‘పెళ్లిచూపులు’షోకు అమ్మాయిల ఎంపిక వెనక సంచలన విషయాలు!
మాటీవీలో 'పెళ్లి చూపులు' పేరుతో కొత్త రియాల్టీ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాంకర్ సుమ ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ షో ద్వారా ప్రదీప్ తనకు కాబోయే జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. గత ఆదివారం నుండే ఈ షో ప్రారంభం అయింది. ఈ షో కోసం కొన్ని వందల మంది అమ్మాయిలు అప్పై చేసుకోగా చివరకు 14 మంది సెలక్ట్ అయ్యారు. అయితే ఈ షోకు సెలక్ట్ అయి పలు కారణాల వల్ల వెళ్లలేక పోయిన లుబ్నా వాలియా అనే అమ్మాయి.... ఈ షో ఎంపిక వెనక రహస్యాలను బయట పెట్టింది. ఆలో టీవీ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇదొక మంచి అవకాశంగా భావించి అప్లై చేశాను
టీవీ షోలో చేయాలని నాకు ఎప్పటి నుండో కోరిక ఉండేది. చాలా షోలకు అప్లై చేశాను. ఎప్పుడూ సెలక్ట్ అవ్వలేదు. ప్రదీప్ ‘పెళ్లి చూపులు' షో గురించి యాడ్ చూసి ఇది ఒక మంచి అవకాశంగా భావించి అప్లై చేశాను. సెలక్ట్ కూడా అయ్యాను. అయితే నాకు ఎగ్జామ్స్, వారు అడిగిన డేట్స్ ఒకేసారి రావడంతో వెళ్లలేక పోయాను అని లుబ్నా వాలియా తెలిపారు.

నాలుగు దశల్లో ఎంపిక జరిగింది
ఇందులో కంటెస్టెంట్లను నాలుగు దశల్లో వడపోసి ఎంపిక చేయయడం జరిగింది. మొదట ‘మా టీవీ' తరుపున ఒక అప్లికేషన్ ఫాం ఇచ్చారు. అందులో మన పర్సనల్ డీటేల్స్ ఫిల్ చేయమని చెప్పారు. ప్రదీప్‌ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి అంటే మీ దృష్టిలో ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలు అడిగారు. దాంట్లో సెలక్ట్ అయ్యావని రెండు మూడు రోజుల్లో కాల్ వచ్చిందని లుబ్నా వాలియా తెలిపారు.

ఆ విషయాలు కూడా అడిగారు
తర్వాత మీకు కొన్ని మెయిల్ ద్వారా కొన్ని ప్రశ్నలు పంపిస్తాము, వాటిని ఫిల్ చేయండి, సెలక్ట్ అయితే మీతో మాట్లాడతామని చెప్పారు. అందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. దాదాపు 30 నుండి 40 ప్రశ్నలు ఉన్నాయి. ఫ్యామిలీ, పర్సనల్ డీటేల్స్ దగ్గర నుండి నాన్న ఏం చేస్తారు? మదర్ వర్కింగా? లేక హోం మేకరా? మీ మతం ఏమిటి? మీ కులం ఏమిటి? ఇలా చాలా అడిగారు... అని లుబ్నా వాలియా తెలిపారు.

ప్రదీప్ గురించిన ప్రశ్నలు కూడా అడిగారు
మీ ఎథిక్స్ ఏమిటి? ఒక వేళ మీరు పెళ్లి చేసుకుంటే ప్రదీప్ ను యాంకరింగ్ చేయడానికి అనుమతిస్తారా? అతడు ఇండస్ట్రీలో ఉండటం మీకు ఓకేనా? అలా చాలా ప్రశ్నలు అడిగారు. అవి ఫిల్ చేసిన 15 నుండి 20 రోజుల తర్వాత మళ్లీ కాల్ వచ్చింది. మీకు సెలక్ట్ అయ్యారు, మీరు షోకు రావాలి అన్నారని వారు చెప్పినట్లు లుబ్నా వాలియా తెలిపారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయన్నారు
సెలక్ట్ అయిన తర్వాత 20 రోజులు అగ్రిమెంట్ రాసివ్వాలన్నారు. అయితే నాకు అప్పుడే ఎగ్జామ్స్ ఉండటం వల్ల నేను డేట్స్ ఇవ్వలేక పోయాను. వారు నన్ను మళ్లీ అప్రోచ్ అయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే నా మనసులో వెళితే స్టార్డింగ్ నుండే ఫుల్ షో ఉండాలి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ నేను చేయలేను అన్నాను. ఇలాంటి అవకాశం మళ్లీ మీకు రాదు అని వారు చెప్పారు. అయినా నేను నో చెప్పాను... అని లుబ్నా వాలియా తెలిపారు.

మా ఇంట్లో సపోర్ట్ ఉంది
నేను యాక్టింగ్ సైడ్ ఉన్నాను కాబట్టి మా ఫ్యామిలీ సపోర్ట్ ముందు నుండి ఉంది. వాళ్లకు ఈ షో గురించి చెప్పినపుడు వారు భయ పడ్డారు. ఒక అమ్మాయి ఒక షోకు వెళ్లి ఒక అబ్బాయి కోసం పది మంది అమ్మాయిలతో గొడవ పడి, బయటకు వచ్చినపుడు నీ ఇమేజ్ ఎలా ఉంటుంది? పది మంది నిన్ను ఎలా చూస్తారు? అనే ఆలోచనలో వారు ఉన్నారు. అది జస్ట్ షో మాత్రమే అని వారిని కన్విన్స్ చేసి ఫాం ఫిల్ చేశాను.. అని లుబ్నా తెలిపారు.
ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడని భావించడం లేదు
అయితే ఇది గేమ్ షో మాత్రమే అని నేను అనుకుంటున్నాను. ఈ షో ద్వారా తనకు తెలియని ఒక అమ్మాయి ప్రదీప్ తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. టీఆర్పీల కోసమే ఈ షో మొదలు పెట్టినట్లు నేను భావిస్తున్నాను అని లుబ్నా వాలియా అన్నారు.


Click it and Unblock the Notifications











