»   » ఇండియన్ ఐడల్ సీజన్-9 విజేత... మన తెలుగోడే!

ఇండియన్ ఐడల్ సీజన్-9 విజేత... మన తెలుగోడే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సోనీ టీవీలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్-9 టైటిల్ తెలుగు సింగర్ ఎల్‌వీ రేవంత్ (25) దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో పీవీఎన్ఎస్ రోహిత్, ఖుదా భక్ష్‌లతో పోటీ పడ్డ రేవంత్ తనదైన టాలెంట్ ప్రదర్శించి వితేజగా అవతరించాడు.

ఇండియన్ ఐడల్ 9 ట్రోఫీతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి రేవంత్ అందుకున్నాడు. ఇండియన్ ఐడల్ విన్నర్ కావడంతో యూనివర్సల్ మ్యూజిక్‌ కంపెనీ రేవంత్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

సచిన్ చేతుల మీదుగా

సచిన్ చేతుల మీదుగా

ఫైనల్ ఈ వెంటులో గెలించిన రేవంత్‌కు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇండియన్ ఐడల్ ట్రోఫీని బహూకరించాడు. ఈ పోటీలో రోహిత్ రన్నరప్ గా నిలిచాడు.

అలరించిన రేవంత్

అలరించిన రేవంత్

ఫైనల్ ఈ వెంటులో పాటలతో పాటు డాన్సింగ్ స్పెట్స్ తో రేవంత్ ప్రేక్షకులను అలరించాడు. ‘చక్ దే' సినిమా నుంచి ‘మర్ జాయేన్ యా జీ లూన్ జరా' పాటపాడి జవాన్లకు అంకితమిచ్చాడు.

రేవంత్ మాట్లాడుతూ

రేవంత్ మాట్లాడుతూ

విజేతగా నిలిచినందుకు ఆనందంగా ఉందని, ఈ షో తన లైఫ్ మారిపోయిందని, ఇప్పుడే నా జీవితం మొదలైందని రేవంత్ తెలిపారు. బాలీవుడ్లోనే సెటిలవుతానని రేవంత్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

ఇతడు బాహుబలి సింగరే...

ఇతడు బాహుబలి సింగరే...

తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200 పాటలు పాడిన రేవంత్‌... బాహుబలి సినిమా ‘మనోహరి..' పాట ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇండియన్ ఐడల్-5 విజేత శ్రీరామ చంద్ర తర్వాత రేవంత్ మళ్లీ తెలుగు గడ్డ నుండి విజేతగా అవతరించాడు.

రేవంత్ గురించి

రేవంత్ గురించి

రేవంత్ 1990లో శ్రీకాకుళంలో జన్మించాడు. విశాఖలో చదువుకున్నాడు. కీరవాణి ప్రోత్సాహంతో సింగర్ గా ఎదిగాడు.

Read more about: tollywood
English summary
Hyderabad-based playback singer Revanth bagged the most-coveted title of Indian Idol in the Season 9 of the singing reality show conducted by Sony Television on Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu