Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్‌కు ఆస్కార్ విన్నర్ సర్‌ప్రైజ్.. అతడు రైతు బిడ్డ కాదంటూ!

ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతుతున్నదే బిగ్ బాస్. మొదట హిందీలో వచ్చిన ఇది.. చాలా కాలానికి తెలుగులోనూ మొదలైంది. ఇక్కడ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ అందుకుని సూపర్ సక్సెస్ అయింది. ఫలితంగా వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడు నిర్వహకులు ఏడో సీజన్‌ను ఎంతో ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇందులోకి కామన్ మ్యాన్‌గా వచ్చిన పల్లవి ప్రశాంత్‌ను ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సర్‌ప్రైజ్ చేశారు. ఆ వివరాలు మీకోసమే!

ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చిన సీజన్ కావడంతో ఏడో దానిపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. ఇందులోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నాడు.

M. M. Keeravani Changes Pallavi Prashanth Name In Bigg Boss Telugu 7 Show

ఏమాత్రం అంచనాలు లేకుండానే ఏడో సీజన్‌ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్.. అసాధారణమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా టాస్కులో ఇరగదీసేసిన అతడు.. క్రమంగా ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. తద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలు ఉన్నా.. వాళ్లందరికీ ధీటుగా నిలబడుతూ ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు.

బిగ్ బాస్ విన్నర్‌ను నిర్ణయించే ఓటింగ్ 14వ వారంలోనే మొదలైంది. ఇందులో కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన ఆటతీరుతో ఆకట్టుకుని.. టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్న పల్లవి ప్రశాంత్‌కు భారీగా ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. హాట్‌స్టార్ పోలింగ్‌తో పాటు మిస్‌డ్ కాల్స్‌లోనూ అతడు టాప్‌లోనే ఉన్నట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

M. M. Keeravani Changes Pallavi Prashanth Name In Bigg Boss Telugu 7 Show

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఫినాలేకు చేరుకున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ప్రకటించారు. ఈ క్రమంలోనే స్టేజ్ మీదకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి వచ్చారు. నాగార్జున హీరోగా నటిస్తోన్న 'నా సామిరంగ' సినిమాలోని పాటను బిగ్ బాస్ వేదికపై ఆయన లాంచ్ చేశారు. అనంతరం పల్లవి ప్రశాంత్‌ ఫినాలేకు చేరుకున్నట్లుగా కీరవాణి ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు.

కీరవాణి తన పేరును ప్రకటించగానే పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. తరచూ అతడు భూమికి నమస్కారం చేస్తూ కనిపించాడు. దీంతో ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సరికొత్త ఆలోచన చేశారు. 'ప్రశాంత్.. నువ్వు రైతు బిడ్డవు కదా. ఇప్పటి నుంచి నీ పేరు బీబీ బిడ్డ అని మారుస్తున్నాను. అంటే నువ్వు పదే పదే భూమికి నమస్కరిస్తున్నావు కాబట్టి భూమి బిడ్డను చేశాను' అన్నారు.

ఆ తర్వాత కీరవాణి 'బీబీ బిడ్డ అంటే మరో పేరు కూడా వస్తుంది. అదే బిగ్ బాస్ ప్రశాంత్. అంటే ఇప్పటి నుంచి నువ్వు భూమి బిడ్డ ప్రశాంత్ లేదా బిగ్ బాస్ ప్రశాంత్‌గా గుర్తింపు తెచ్చుకుంటావు' అన్నారు. దీంతో పల్లవి ప్రశాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తానికి కీరవాణి ఇచ్చిన సర్‌ప్రైజ్ రైతు బిడ్డతో పాటు అతడి ఫ్యాన్స్‌నూ ఖుషీ చేసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X