టీవీ ఆర్టిస్టుల వీరంగం: మా టీవీ ఆఫీసుపై దాడి

జూబ్లీహిల్స్‌లోని మాటీవీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆందోళన కారులు డబ్బింగ్ సీరియళ్లను నిలిపి వేయాలంటూ దాడికి పూనుకున్నారు. మాటీవీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కార్యాలయంలో అద్దాలతో పాటు, ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ ఘటనలో కొందరు మాటీవీ సిబ్బంది కూడా గాయపడ్డట్లు సమాచారం.
కార్యాలయం ఆవరణలో నిలిచి ఉన్న కార్ల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఆందోళన కారులు రెండు కార్లలో వచ్చి ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మాటీవీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక్కసారిగా దాడి జరుగడంతో మాటీవీ ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.
అయితే.... ఈ దాడిని తెలుగు టీవీ ఆర్టిస్టు పరిరక్షణ సమితి ఖండించింది. దాడుల వల్ల సమస్య పరిష్కారం కాదని పేర్కొంది. తమ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొన్ని అసాంఘీక శక్తులు తమ పేరుతో ఈ దాడికి పాల్పడ్డట్లు సమితిలోని పలువురు సభ్యులు అనుమానం వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











